March 28, 2024

పంట పండింది

రచన: సైఫ్ అలీ గోరే   saif

*

ఏమిటి కోలాహలం

ఏదో పర్షాకాలపు పంటని

కురులని సవరించుకుంటూ

ఎవరో ఉత్సాహం తో కోస్తున్నట్లు

 

రాణివాసాలకు ఈ వార్త వెళ్తే

వ్యామోహాల శాసనాలు

భూత ప్రేతాలై వెంబడించేస్తాయి కదా!

 

*

కర్బూజా పళ్ళ కోసం

గూఢచారులెవరో

రహాస్య యుద్ధాలు చేసుకునే

ముహూర్తం తిరిగి పుడుతుంది కదా!

 

ప్రతాపశీలులెవరో

ఉసికొల్పడానికేనా ఈ పూలు

ఈ ఫకీర్ల గ్రహం మీద

వికసిస్తున్నాయన్నట్టుంది .

 

*

ఐనా

అదృష్టవంతులని

ఏ చీకటి వ్యతిరేకించదని

అధికార క్షేత్రంలో కూర్చోని ఉన్న

నిట్టూర్పుకు చెప్పండి .

 

అందరు గుమిగూడాకా

ఆ చెక్కిలి కొండమీద

ఇంకెవరి సమ్మతి కోసం

జీవితం నిరీక్షించదు .

 

*

పంట చేతికి వచ్చాక

నేను పట్టాభిషేకుడిని ఐన రాజునవుతా

పిచ్చి కొమ్మల్లో అందని పిచ్చి పళ్ళకోసం

ఊగిసలాటలు ఉమ్మేసి

ముద్దుల కోసం వజూ చేసుకుంటా

 

వర్షాకాలం పంట

మరో నాలుగు కాలాలు

దాచుకుంటా

*

1 thought on “పంట పండింది

  1. బాగుంది…కొన్ని భాషా దోషాలు లేకుంటే…బహుశా పట్టాభిషిక్తుడ్ని అని వుండాలనుకుంటా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *