రచన : అంగులూరి అంజనాదేవి జీవితం గాఢమైంది. నిగూఢమైంది. స్వల్ప విషయాలకే ఆనందపడేలా చేస్తుంది. కారణం లేకుండానే బాధపెడ్తుంది. కష్టపడకుండా, కొనకుండా, సంపాయించకుండా దొరికిన ప్రేమకోసం తాపత్రయపడేలా చేస్తుంది.హృదయంలోని ప్రేమనంతా బయటపెట్టి ఎన్నో అడగాలనుకునేలా చేస్తుంది. రాత్రింబవళ్లు వువ్విళ్లూరుతూ నిద్రను చెదరగొట్టి, స్వప్నాలను దాచుకొని, సమస్యల్ని సృష్టించి ఒకరికోసం ఒకరు బాధపడేలా చేస్తుంది భూమి మాత్రం గుండ్రంగా తిరుగుతూ నిమిషాలను, గంటలను లాక్కెళ్తోంది. కాలమేమో […]
Month: October 2013
సరిగమల గలగలలు – 2
రచన: మాధవపెద్ది సురేష్ చంద్ర వెన్నెలకంటి నాకు వెన్నెలకంటి రాజేశ్వరరావుగారితో 1990 నుండి పరిచయం. మొదటి కలయికలోనే మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. నాకసలు విరోధులు లేరు, ఉండరు. నా మనస్తత్వం అటువంటిది. ఎప్పుడైనా ఎవరితోనైనా ఏదైనా మాటా మాటా అనుకున్నా, కోపం ఉన్నా కొద్దిసేపే. మళ్ళీ అసలు ఆ విషయం గుర్తుండదు. ‘సంగీతానికి ఇంటిపేరు సాహిత్యం’ అని నేను చాలా సార్లు నా మాటల్లో, పాటల్లో చెబుతూనే ఉంటాను. శ్రీ బాలు […]
సంభవం – 6
రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/ తిరుపతి నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకి వెళ్ళే రోడ్డుమీద ఒక బ్లాక్ కలర్ అంబాసిడర్ కారు నలభై మైళ్ళ వేగంతో వెళుతోంది. అప్పటికే తనకొచ్చిన డ్రీమ్ గురించి రెండోసారి వివరిస్తుంది దిశ. “ఎర్రకోట దగ్గర జనంలో కూర్చున్న వ్యక్తి లేచి, వేదికమీద కూర్చున్న వ్యక్తిని షూట్ చేశాడా?” “ఎస్ డాక్టర్…!” “హౌ కెన్ ఇట్ బి పాజిబుల్ దిశా! అంత టైట్ సెక్యూరిటీ మధ్య ఆ […]
చిక్కని జ్ఙాపకం – షకీల్ బదాయూని
రచన: అబ్దుల్ వాహెద్ పాత హిందీ పాటలంటే చెవులు కోసుకోని వారు ఎవరైనా ఉంటారా? గజల్ శైలిని అనుసరిస్తూ, కొద్దిగా సినిమాలకు అనుగుణంగా మార్చుకుంటూ, ఉర్దూ సొగసులను అద్దుతూ పాటలు రాసినవారు చాలా మంది ఉన్నారు. అందుకే పాత హిందీ పాటల మాధుర్యం ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. పదే పదే వినాలనిపిస్తుంది. గజల్ ప్రక్రియను సినిమాపాటకు ప్రతిభావంతంగా వాడుకున్న కవుల్లో […]
ఐ మెరే ప్యారే వతన్ – పారసీక ఛందస్సు – 6
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు ఈ వారము ప్రముఖ హిందీ చిత్రగాయకుడు శ్రీ […]
అనగనగా బ్నిం కధలు – 4
రచన : బ్నిం బంగారు పంజరం: ఝాన్సీ (గళం) అనగనగా కథల బంచ్‌లో “బంగారు పంజరం” చాలా బర్నింగ్ సబ్జెక్టే. ఇది ఎన్నిసార్లు చర్చించినా, ఇంకా చర్చించవలసిన సబ్జెక్ట్‌లా ముందుకొస్తూనే వుంది. తల్లిదండ్రుల “ఏంబిషన్” పిల్లలకి ఎంత బర్డెన్ అవుతోందో పెద్దవాళ్లు గమనించరు. అలాగే వయసు ముదిరిపోయాక పిల్లలు తల్లితండ్రులని కూడా భరించడం ‘బర్డెన్’గానే వుంటోంది. ఈ నలిగిపోతున్న సబ్జెక్ట్‌ని నేను కథ చెప్పడానికి ఎంచుకున్న పాత్రల మానసిక స్వభావాన్ని వాడుకున్నా. ఈ ప్రేమలు కూడా […]
‘అక్షర పదచిత్రాల మెటాఫర్ మళయాళ’జాలం – సూఫీ చెప్పిన కథ
సమీక్ష: సాయి పద్మ శ్రీ కే.పి.రామనున్ని రాసిన “ సూఫీ పరాంజే కథ’ ( మలయాళంలో ఈ నవల పేరు ) ని తెలుగులో శ్రీ. ఎల్.ఆర్ .స్వామి గారు ‘సూఫీ చెప్పిన కథ’ గా అనువాదం చేసారు . అది ఇప్పుడే చదివి ముగించాను . లేదు .. లేదు గత పదిహేను రోజులుగా ముందుకీ , వెనక్కీ చదువుతూనే ఉన్నాను . కథలోకి పూర్తిగా […]
అతడే ఆమె సైన్యం – 5
రచన: యండమూరి వీరేంద్రనాధ్ ఆ మరుసటి రోజు ప్రోగ్రాం సైనికాధికారుల కోసం! మధ్యాహ్నం మూడింటికి అజ్మరాలీ వచ్చి చైతన్యని స్టేజి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. లైట్స్ అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయి. సైనికులు ఖైదీలతో ఏర్పాటు చేయిస్తునారు. కొందరు యుద్ధ ఖైదీలు తెరలు కడుతున్నారు. మరికొందరు స్టేజీమీదకు దూలాలు మోసుకు వెళుతున్నారు. పూర్వకాలం రోమన్ రాజులు బానిసలతో పనులు చేయించినట్లు సైనికులు ఆ ఖైదీలతో పనులు చేయిస్తున్నారు. అజ్మరాలీ నవ్వేడు… “మీ దేశపు సైనికులే.. […]
జయదేవ్ గీతపదులు – 4
“విక్రమార్జున విజయం” – చారిత్రక సాహిత్య కథలు – 7
రచన: మంథా భానుమతి “భారతమా!” కొలువులో ఆసీనులయిన విద్వాంసులు కనుబొమ్మలు పైకి లేపి, కించిత్ సందేహంగా మహారాజుని చూశారు. ఆదిపురాణ కావ్యకర్త పంపనార్య్డుడు క్రీగంట అందరినీ పరికించాడు. మహరాజు మాత్రం చిరునవ్వును చెక్కు చెదరనియ్యక పంపన్ననే చూస్తున్నారు. గంధేభ విద్యాధర, ఆరూఢసర్వజ్ఞ, ఉదాత్త నారాయణ ఇమ్మడి అరికేసరి సభ అది. వేములవాడ చాళుక్య రాజులలో బహు ప్రసిద్ధి పొందినవాడు అరికేసరి. రాష్ట్రకూటులకు సామంతుడుగా ఉన్నా, స్వతంత్రంగా తన రాజ్యంలోని అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినవాడు. […]
ఇటీవలి వ్యాఖ్యలు