March 29, 2024

అనగనగా బ్నిం కధలు – 4

రచన : బ్నిం  bnim

బంగారు పంజరం: ఝాన్సీ (గళం)

 

అనగనగా కథల బంచ్‌లో “బంగారు పంజరం” చాలా బర్నింగ్ సబ్జెక్టే. ఇది ఎన్నిసార్లు చర్చించినా, ఇంకా చర్చించవలసిన సబ్జెక్ట్‌లా ముందుకొస్తూనే వుంది.
తల్లిదండ్రుల “ఏంబిషన్” పిల్లలకి ఎంత బర్డెన్ అవుతోందో పెద్దవాళ్లు గమనించరు. అలాగే వయసు ముదిరిపోయాక పిల్లలు తల్లితండ్రులని కూడా భరించడం ‘బర్డెన్’గానే వుంటోంది. ఈ నలిగిపోతున్న సబ్జెక్ట్‌ని నేను కథ చెప్పడానికి ఎంచుకున్న పాత్రల మానసిక స్వభావాన్ని వాడుకున్నా.
ఈ ప్రేమలు కూడా ప్రకటించలేనివి, బాధించనివీ అని చెప్పాలి. ఇందులో కథని పాత్రలే లాక్కెళ్లాయి అనిపించింది.

నాకు ఈ కథలో శిల్పసౌందర్యం నచ్చింది. కానీ ప్రముఖ దర్శకుడు, కెమెరా, ఎడిటింగ్ శాఖలో విశిష్టుడు, నా శ్రేయోభిలాషి , నా ప్రియ మిత్రుడు శ్రీ Meer Syed ఈ కథని ఎపిసోడ్‌గా తీసాక నేను రాసిన తీరు ‘చిన్న గీత’గా అయిపోయింది. అంత గొప్పగా స్క్రీన్‌ప్లే వేసుకుని తీశారు. ముందుగా కథ విని, ఆ తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి. దాని వల్ల ఒక కథని  విజువల్ మీడియాకి మార్చటంలో కలిగే అందం, ఆనందం, … దాంట్లో మీరు చూస్తారు.
సరేనాండి…???
ఈ కథ వినేటప్పుడు కథ చదివిన ఝాన్సీని, ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మీర్‌గారికీ థాంక్స్ అందాం.
మరి ఈ లింక్ క్లిక్కండి.
మీ బ్నిం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *