June 19, 2024

Gausips – రక్తప్రసరణ వ్యవస్థ: రక్తపళ్ళెరాల (Blood Platelets) జన్యుసంబందిత లేదా ఇతరలోపాలు

రచన:  డా. జె. గౌతమి సత్యశ్రీ …  Ph.D              రక్తము లేదా నెత్తురు ద్రవరూపంలో ఉన్న శరీరనిర్మాణ థాతువు లేదా ఒక కణజాలము. ఇది జీవి మనుగడకి ఎంతో అవసరం. రక్తానికి సంబంధించిన ఈ అధ్యయనాన్ని ‘హిమటాలజీ (hematology)’  అంటారు. రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది ఒక ప్రోటీను. దానిని  హీమోగ్లోబిన్  (hemoglobin) అంటారు.  రక్తానికి మూలాధారం నీరు. రక్తంలో […]

“చీర “ సొగసు చూడ తరమా??

చీర .. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ సంప్రదాయపు వస్త్రాలంకరణ. వనితను నిలువెల్లా కప్పి ఆమెను దాచిపెట్టి, పెట్టకుండా మరింత అందంగా చూపిస్తుంది. ఈరోజుల్లో అమ్మాయిలు మరీ మాడర్న్ ఐపోవడంతో చీర కట్టడం  చాలా తగ్గించారు/ మానేసారు అని అంటారు కాని పెళ్ళిళ్లకు వెళ్లి చూడండి. రంగు రంగుల, తళుకు బెళుకుల చీర కట్టిన అమ్మాయిలతో కళకళలాడిపోతూ ఉంటుంది. నాడైనా, నేడైనా, భారతీయ వనితలకు మరింత వన్నె తెచ్చేది మేలైన చీర. ఎంత అభివృద్ధి చెందినా , ఎన్ని […]

ఇంకా నేను బతికే వున్నాను..

రచన: కృష్ణ అశోక్     అవును ఇంకా నేను బతికే వున్నాను.. మనసు అగాధమంత ఘాడంగా పూడుకుపోయింది గుండె గొంతు మధ్య శూన్యం చిక్కగా పేరుకుపోయింది… అయినా ఇంకా నేను బతికే వున్నాను…   అందంగా రంగులద్దుకున్న తెల్లని కాన్వాస్ మసి పట్టి నిశి వర్ణం పులుముకుంది.. స్టాండ్ లోని కుంచెలన్నీ వానపాముల్లా పొర్లుతున్నాయి.. అయినా ఇంకా నేను బతికే వున్నాను..   కమ్మని కల(ళ)ల ఆశలన్నీ కాలిపోయి కాంతిహీనమైనాయి… రెక్కలు తెగి పడివున్న ప్రాణం […]