March 29, 2023

మాలిక పత్రిక నవంబర్ సంచికకు స్వాగతం

అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు

ఎన్నో కొత్త కొత్త సీరియళ్లు, వ్యాసాలతో మాలిక పత్రిక మరింత మెరుగ్గా మీ ముందుకు వచ్చింది.ఈ వ్యాసాలు మీకు నచ్చుతాయనుకుంటున్నాము. మాలిక పత్రికకు ఎవరైనా తమ రచనలు పంపించవచ్చు. వీలువెంబడి తప్పకుండా ప్రచురిస్తాము. ఇక ఈసారి ఒక ప్రత్యేకమైన వ్యాసం మీకోసం .. “చీర – సొగసు చూడ తరమా ” అనే టాపిక్ మీద కొందరు మిత్రుల నుండి పద్యాలను సేకరించి, వాటిని విశ్లేషించి, పద్యాల శ్రవ్యకాలు చేయించి, అందమైన చిత్రంతో మీకు సమర్పిస్తున్నాము. చదవి మీ అభిప్రాయము తెలియజేయగలరు.. ఈ ప్రయోగానికి తమవంతు సహాయాన్ని అందించినవారందరికీ కృతజ్ఞతలు.

మీ రచనలు పంపవలసిన చిరునామా : editor@maalika.org

ఇక ఈ నెల మాలిక పత్రిక విశేషాలు..

1. దీపావళి పండగ అనే కాదు పండగలు గురించి సంపాదకీయం
పండగోయ్ పండగ

2.  చీర మీద ఎన్ని పద్యాలో. మీరు కూడా ఓ లుక్కేయండి.. ప్రత్యేక వ్యాసం

చీర సొగసు చూడ తరమా?

3. బాధల బందీ ఐన మనసు వేదన

ఇంకా నేను బతికే వున్నాను 

4.  కొత్తగా మొదలవుతున్న  మెడికల్, సైంటిఫిక్ సీరియల్.

Gausips 1

5. శ్రీమతి అంగులూరి అంజనాదేవిగారి కొత్త సీరియల్ ప్రారంభమవుతుంది.కోరుకున్నవి దొరకకపోయినా, పరిస్ధితులు అనుకూలించకపోయినా కష్టాలు వచ్చినా భయపడకుండా ” నాకింకా మంచి భవిష్యత్తు  ఉంది” అని ముందడుగు వేయాలని లక్ష్యాన్వేష్, దేదీప్య పాత్రల ద్వారా చెప్తున్నారు రచయిత్రి..

మౌనరాగం – 1

6. తెలుగు సినీ ప్రపంచంలోని మహానీయుల గురించి తన అనుభవాలతో కూడిన పరిచయాలను అందిస్తున్నారు ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు. ఈసారి వెన్నెలకంటి గారి గురించి ఏం చెప్తున్నారో మరి..
సరిగమలు – గలగలలు -2

7.  ప్రధానమంత్రి మీద హత్యాప్రయత్నం జరగబోతుందని కలగన్న దిశ ఈ విషయాన్ని అయన వరకు చేర్చడానికి ఎలా ప్రయత్నిస్తుందో సూర్యదేవర రామ్మోహనరావుగారి సంభవం సీరియల్ లో తెలుసుకోండి..

సంభవం -6

8. మీకు ఘజల్స్ అంటే ఇష్టమా?  మరి అబ్దుల్ వాహెద్ గారు ఈ నెలనుండి  ప్రారంభించిన సీరియల్ తప్పకుండా చదవండి. ముందుగా హిందీ కవి షకీల్ బదాయుని గారి గురించి తెలుసుకుందాం.

చిక్కని జ్ఞాపకం – షకీల్ బదాయుని

9.  కొన్ని నెలలుగా మాలికలో వస్తున్న పారశీక చందస్సు గురించి మీరు చదువుతూనే ఉన్నారుగా.. ఈసారి మన్నాడె గురించిన  పాటల గురించి ప్రస్తావిస్తున్నారు జె.కె.మోహనరావుగారు.

ఐ మేరే ప్యారే వతన్ – పారశీక చందస్సు – 6

10.  బ్నింగారి ఆడియోకధలు వింటున్నారా. ఎలా ఉన్నాయి.. ఈసారి ఒక బర్నింగ్ సబ్జెక్ట్ గురించిన కధను చదవండి అంతేకాదు ఆ కధ యొక్క వీడియోని కూడా చూడొచ్చు..

బ్నిం ఆడియో కధలు – 4

11.  సారంగ వారు ప్రచురించిన అనువాద నవల సూఫీ చెప్పిన కధ గురించిన సమీక్ష

‘అక్షర పదచిత్రాల మెటాఫర్ మళయాళ’ జాలం

12.  పాకిస్తాన్ జైలులో ఉన్న తన తండ్రిని కలుసుకుని , బయటకు తీసుకురావడానికి ప్రనూషతో వెళ్లిన ప్రముఖ నటుడు చైతన్య ఎంతవరకు సఫలీకృతుడయ్యాడో  యండమూరిగారి “అతడే  ఆమె సైన్యం” నవలలోని  ఈ భాగంలో చదవండి.

అతడే ఆమె సైన్యం – 5

13.  జయదేవ్ గారు దీపావళి కార్టూన్లతో మోత మోగించారో, నవ్వుల దీపాలు వెలిగించారో మీరే చూడండి.

జయదేవ్ గీతపదులు –  4

14.  మంధా నానుమతి

భానుమతిగారు సాహిత్యకధలను పరిచయం చేస్తున్నారుగా. ఈసారి విక్రమార్కుని విజయం గురించిన గాధ చెప్తున్నారు.

విక్రమార్కుని విజయం

15.  గతనెలలో ప్రారంభమైన లేఖాంతరంగంలో సరళ రాసిన ఉత్తరానికి సరోజ ఏమంటుందో మరి ఈ భాగంలో చూద్దాం..

లేఖాంతరంగం – 2

16. హిందూ పురాణాలలోనూ, రామాయణ మహాభారతాలలో కనబడే కొన్ని అభూతకల్పనల మీద ఒక satire. గురించి చెప్తున్నారు రవి..

ధూర్తాఖ్యానం 

17.  ఉత్తమ కధగా బహుమతి పొందిన ఒక కధ గురించి  సమగ్రంగా చర్చిస్తున్నారు చిత్ర (రామారావు) గారు.

ఉప్పెక్కడ తీపి

18. కొత్తపల్లి రాముగారు కొన్ని నీతిపద్యాల గురించి వివరిస్తున్నారు.

విద్యా వినితో రాజా హి ప్రజానాం వినయేరత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

November 2013
M T W T F S S
« Oct   Dec »
 123
45678910
11121314151617
18192021222324
252627282930