June 14, 2024

Gausips – గర్భాశయపు సమస్యలు-1

రచన: డాక్టర్ జె. గౌతమి సత్యశ్రీ   పి.హెచ్.డి.     పాతికేళ్ళ కీర్తన క్రొత్తగా పెళ్ళి చేసుకుని భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. పెళ్ళైన నాలుగు నెలలకి విపరీతంగా బరువు పెరిగింది. దీనికంతటికీ కారణం పెళ్ళైన దగ్గిరనుండి ఇంట్లోనే ఉండి కూర్చుని తినడం, పెద్దగా అలసిపోయే పనులేవీ లేకపోవడం వల్లనే అనుకుని, రోజూ ఎక్స్ ర్సైజులకని బయలుదేరింది. ఈలోపున నెలసరి తప్పడంతో, తనకు గర్భం వచ్చిందని తలచి హాస్పిటల్ కు వెళ్ళింది. వాళ్ళ primary care physician, Dr. […]

“కొంచెం ఇష్టం కొంచెం కష్టం”

                               సమీక్ష: జి.ఎస్.లక్ష్మి.. తెరచిన ఈ పుస్తకము నెప్పుడు మూయవదేమని మా అమ్మ కసరగా ఇదిగో చదవమని ఆ చేతుల పెట్టిన పొత్తము వదలదు మాయమ్మ ముదము మొగమున మెరయన్.. నిజంగానే ఈ పుస్తకం ఒకసారి చేతిలో పట్టుకున్నామంటే మరింక వదలకుండా చదివేస్తాం. అంత శక్తి వుంది పొత్తూరి విజయలక్ష్మిగారు  రాసిన ఈ “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” పుస్తకానికి. హాస్యరసం రాయడం చాలా కష్టం. అంతటి కష్టాన్నీ యెంతో ఇష్టంగా మన ముందుకు తెచ్చేసారు ఆవిడ ఈ […]

ఏక వాక్యం రసాత్మకం “శ్రీ” వాక్యం .

సమీక్ష: జగద్ధాత్రి దాదాపు గత రెండు దశాబ్దాలుగా ఎక్కువగా మన్నన పొందిన కవితా రూపం మినీ కవితలు లేదా చిన్న కవితలు . వీటికి పేర్లు ఛందస్సులు కూడా జోడించి కొన్ని ప్రక్రియలు చేస్తున్నారు . ఏది ఏమైనప్పటికి వీటన్నిటికి ఒక తాటి కిందికి తీసుకు వస్తే వాటిని చిన్న కవితలే అనగలం. అలాంటి చిన్న కవితల్లో ఏక వాక్య కవితలుగా , వాటిని ఒక్కచోట చేర్చి  శ్రీ వాక్యం అనే పుస్తకాన్ని విడుదల చేసారు.    . […]

యాత్రా దీపిక – హైదరాబాద్ నుంచి ఒక రోజులో (దర్శించదగ్గ 72 ఆలయాలు)

సెలవురోజుల్లో కుటుంబంతోనో, స్నేహితులతోనో కొంతసేపు సరదాగా గడపాలని అందరూ కోరుకుంటారు.  అవకాశమున్నవాళ్ళు ఆటవిడుపుగా నూతన ప్రదేశాలకి వెళ్ళాలని కూడా అనుకుంటారు.  అయితే దానికి సమయం, తోడు, డబ్బు, ఇలా అన్ని అవకాశాలూవున్నా సమయానికి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేవారెందరో. దూర ప్రదేశాలకి వెళ్ళిరావటానికి అనేక కారణాలవల్ల అందరికీ సాధ్యం కాకపోవచ్చు.  అలాంటివారు కొంతమార్పు కోసం ఉదయం వెళ్ళి సాయంకాలానికి ఇంటికి తిరిగొచ్చేయాలనుకుంటారు.  అయితే మళ్ళీ పెద్దవారు ఆలయానికెళ్దామంటే పిల్లలు ఆడుకునే ప్రదేశాలు కావాలంటారు.  ఇంటి పెద్దకి […]

సరిగమలు గలగలలు – 3 పెండ్యాల నాగేశ్వరరావు

రచన: మాధవపెద్ది సురేష్  పెండ్యాల నాగేశ్వరరావుగారు అద్భుతమైన సంగీత దర్శకుడు. మొట్టమొదటిసారి ఆయన్ని విజయవాడలో దుర్గా కళామందిరంలొ ‘జగదేకవీరుని కథ’ శత దినోత్సవ సభలో చూశాను. నా జీవితంలో ఎంతో అనుభూతి పొందిన క్షణాలు అవి. అమ్మ, నాన్న, అన్నయ్యలతో వెళ్లాను. మా చిన్నాన్నగారు గోఖలే (కళాదర్శకుడు) గారితో అందరం వెళ్లాం. ఆ సినిమాలో అన్ని పాటలూ బావున్నా ‘శివశంకరీ‘ పాట నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. పింగళిగారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు ఎంత […]

సంభవం – 7

రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/   ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన టాక్సీకి దారిలో ఎన్నో అవాంతరాలు. దానిక్కారణం ర్యాలీ… జన సందోహం… టాక్సీలో కూర్చున్న దిశకు నిజంగా గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నట్టుగా వుంది. వెళ్ళాల్సింది ప్రైంమినిస్టర్ రెసిడెన్స్‌కి కాబట్టి అప్పటికీ టాక్సీ డ్రయివరు మెయిన్‌రోడ్లో కాకుండా సందుల్లోంచి టాక్సీని పోనిస్తున్నాడు. వంటిమీద పడుతున్న చెమటను తుడుచుకుంటూ “ప్లీజ్… క్విక్క్… అర్జంట్…” హెచ్చరిస్తూనే వుంది టాక్సీ డ్రయివరుని దిశ. ఆమె గొంతు తడారిపోయింది- అకస్మాత్తుగా కమ్మేస్తోన్న నీరసం. […]

అతడే ఆమె సైన్యం – 6

రచన: యండమూరి వీరేంద్రనాధ్ జీపుల తాలూకు ముందు వుండే రేకులు (బోయినెట్లు) విప్పి, కత్తియుద్ధంలో ఉపయోగించే “డాలు” లాగా తమని తాము రక్షించుకుంటూ వస్తున్నారు సైనికులు. ఆ దృశ్యాన్ని చూస్తున్న అజ్మరాలీ, వాళ్ళ మూర్ఖత్వానికి నవ్వుకున్నాడు. మరోవైపు కోపమూ, విసుగూ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే “డాళ్ళు” రైఫిల్ బుల్లెట్లకి అడ్డు నిలబడవు. వంతెనకి కాస్త ఇటువైపుకి దగ్గరకి రాగానే చైతన్య ఇస్మాయిల్ పేల్చే కాల్పులకి అందరూ నల్లులా మాడిపోతారు. అయితే అతని అంచనాని తప్పుచేస్తూ సైనికులు […]