June 14, 2024

ఉమ్మడిశెట్టి సాహితీ ఎవార్డు 2013

ఉమ్మడిశెట్టి సాహితీ ఎవార్డు 2013 కోసం రాష్ట్రంలోని కవులనుండి కవితా సంపుటాలని ఆహ్వానిస్తున్నట్టు ఎవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ రాధేయ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎవార్డు పరిశీలన కోసం 2013 లో ప్రచురింపబడిన కవితాసంపుటాలను మాత్రమే పంపాలి. ఎంపికైన ఉత్తమ కవితాసంపుటికి మూడువేల రూపాయల నగదు మరియు షీల్డుతో కవికి సత్కారం ఉంటుంది. 28-02-2014 తేదీ లోగా నాలుగు ప్రతులు డాక్టర్ రాధేయ, కవితానిలయం, 13-1-606-1, షిర్డీ నగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురము అనే చిరునామాకు పంపగలరు. వివరాలకోసం […]

మాలిక పత్రిక జనవరి 2014 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రిక తరఫున రచయితలకు, పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు …హాసం ప్రచురణలనుండి వెలువడిన కొన్ని అపురూపమైన రచనలను మాలిక పత్రికలో సీరియల్స్ గా మొదలవుతున్నాయి.  ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని మెప్పించే మరిన్ని మంచి రచనలు అందించగలమని హామీ ఇస్తూ ఈ జనవరి నెల సంచికలోని అంశాలు.. మీ రచనలు ఫంపవలసిన చిరునామా  editor@maalika.org 1. స్తుతమతియైన ఆంధ్రకవి 2.  విజయగీతాలు – 1 3.  అండమాన్ […]

స్తుతమతియైన యాంధ్రకవి

  రచన: ఏల్చూరి మురళీధరరావు ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని చమత్కారపూరణ       తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన కథ ఇది: ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు నిండుసభలో మహాకవి ధూర్జటి కావ్యగానం విని అపూర్వమైన పారవశ్యాన్ని పొంది, ఆ కూర్పులోని తీయదనానికి కారణం తెలిసికొనగోరి విద్యాపరిషత్తులోని విద్వత్సభ్యులను ఉద్దేశించి ఈ పద్యపరిప్రశ్నను అడిగాడట: “చ. స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గె నీ యతులితమాధురీమహిమ?” అని. రాయల వారిచ్చినది చంపకమాల పద్యంలో ఒకటిన్నర పాదాలకు […]

విజయగీతాలు – 1

అంకితం   ఆయన చాలా నిరాడంబరులు, నిగర్వి. వైద్యరంగంలో అధునాతనమైన, మహత్తరమైన ఆరోగ్య పరిరక్షణ ఉత్పాదనలను శాంతా బయోటెక్నిక్స్ ద్వారా సామాన్యులకు సైతం అందించడం. ప్రభుత్వపరంగా ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని పొందడం. ‘హాసం’ పత్రిక నిర్వహణలో అటుపోట్లను యెదుర్కొన్నా, ఉత్సాహాన్ని చంపుకోకుండా, ‘హాసం ప్రచురణలు’ పేర అనేక పుస్తకాలు ప్రచురించి, పలువురు రచయితల్ని ప్రోత్సహించడం. జంటనగరాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు చేయూత నందించడం – యివన్నీ గమనించి యెవరైనా యే కొద్దిగా ప్రశంసించినా, ‘బాపు-రమణ’ల స్టాయిల్లో ‘పోదురూ మీ […]

అండమాన్ డైరీ – 1

(నీలాల ద్వీపాలూ-పగడాల సంద్రాలూ!) రచన: దాసరి అమరేంద్ర               అండమాన్-నికోబార్ ద్వీపాల గురించి మొదటిసారిగా విన్నదెపుడూ!! సుమారు ఏభై ఏళ్ల క్రితం. విజయవాడ సివీయార్ లో ఎనిమిదో క్లాసు – థర్డ్ ఫారం -చదువుతున్నప్పుడు. అది పాఠాలలో భాగం కాకపోయినా మా సోషలు మాష్టారు వెంకారెడ్డిగారు (ఆయన ఆ రోజుల్లోనే, ఆ విజయవాడలోనే, శశికపూర్ అంత సుందరంగా ఉండేవారు !) మాటల మధ్య చెప్పారు! “మన దేశం కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకూ […]

హ్యూమరధం – 1

రచన: రావి కొండలరావు   వరప్రసాద్ హృదయలేఖిని నుండి… “హాసం, హాస్య-సంగీత పత్రిక’ ద్వారా మూడేళ్లపాటు హాస్య, సంగీత ప్రియులను అలరించిన అనుభవం ఆలంబనగా ఈ ప్రచురణల రూపంతో పాఠకుల ముందు తిరిగి వస్తున్నాం. హాస్యం, సంగీతం అనే అంశాలతో కూడిన పుస్తకాలను సాధ్యమైనంత తక్కువ ధరకు పాఠకులకు అందించాలన్న సద్దుద్దేశ్యంతో ప్రారంభించబడిన మా సంస్థ వెలువరించిన ఐదవ ప్రచురణ తృతీయ ముద్రణ ఇది. ‘హ్యూమరథం’ రచించిన శ్రీ రావి కొండలరావు పరిచయాలు అక్కర్లేని సుప్రసిద్ధ రచయిత, […]

మాణిక్యవీణాముపలాలయంతీం – పారసీక ఛందస్సు – 7

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు       సంస్కృత కావ్యములలో ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర అనే వృత్తములు విరివిగా వాడబడ్డాయి. ఇంద్రవజ్రకు గురు-లఘువులు – UUI UU – IIUI UU (త/త/జ/గగ ).  ఇందులో మొదటి గురువుకు బదులు లఘువును ఉంచితే లభించిన అమరికకు ఉపేంద్రవజ్ర అని పేరు, అనగా ఉపేంద్రవజ్రకు గురు-లఘువులు – IUI UU – IIUI UU (జ/త/జ/గగ ).  ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రలను వేరువేరు పాదములలో ఉంచి వ్రాసిన పద్యమును […]

మాలిక పదచంద్రిక – జనవరి 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి           అందరికీ నూతన వత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. రెండు నెలల తర్వాత పదచంద్రికని సులభతరం చేసి ప్రవేశపెట్టాం.  ఇందులో 4 చిన్న మినీ గడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.  అతి పెద్దపదంలో కేవలం 5 అక్షరాలే. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: జనవరి 20 2014 అడ్డం    ఆధారం 1.            మన జానపద విలన్..ఎప్పుడూ రాజవాలని […]

సంభవం – 8

రచన: సూర్యదేవర రామ్మోహనరావు suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/ – See more at: http://magazine.maalika.org/2013/12/04/%e0%b0%b8%e0%b0%82%e0%b0%ad%e0%b0%b5%e0%b0%82-7/#sthash.Fdr0xOmb.dpuf suryadevaranovelist@gmail.com http://www.suryadevararammohanrao.com/ ఆ తర్వాత భారతి క్రయోనిక్స్ గురించి ప్రశ్నించడం మొదలెట్టింది. మరో పదినిమిషాల తర్వాత దూరంగా వెండి వెలుగుల తోరణంలాంటి దీపాల మధ్య వేంకటేశ్వరస్వామి దేవాలయం కనిపించింది. “తిరుపతి వచ్చేశాం… ఎటు వెళ్ళాలో చెప్పింది దిశ. “మనం వస్తున్నట్టు సవ్యసాచికి తెలుసా?” ప్రశ్నించాడు నవనీత్. “నేను ఫోను చేసి చెప్పాను…” చెప్పింది దిశ. మరో పదిహేను నిమిషాల తర్వాత నెరబైలు గ్రామం […]

అనగనగా బ్నిం కధలు – 6 (లిఫ్ట్)

రచన: బ్నిం లిఫ్ట్ (కథ గురించి) తరచి తరచి చూస్తే… ఆలోచిస్తే… “ఇలవృత్తులెన్ని వున్నను కులవృత్తికి సాటిరాదు గువ్వలచెన్నా.” అనే పద్యపాదం నిజమనిపిస్తుంది. “స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మోభయావః ” అన్న భగవద్గీతా వాక్యం కూడా అదే చెప్తోంది. రాని పనులకోసం ఆరాట పడుతూ వచ్చిన స్కిల్స్‌నీ, అలవాటైన అనువంశీక వృత్తుల్నీ వదిలేసే.. ఆత్రంగాళ్లని చూస్తే నాకు జాలి.. చిరాకు.. ఆసహ్యం కూడా! అది చెప్పాలనే ఈ కథ…   అతను చక్కాగా “దర్జీపని” నేర్చుకున్న షార్ప్ అయిన […]