April 20, 2024

మాయా నగరం – 1

రచన: భువనచంద్ర    ఆమె కంట్లోంచి ఓ కన్నీటి బిందువు రాలింది. ప్రపంచంలో వున్న విషాదమంతా ఆ కన్నీటి బిందువులోనే దాగుంది. మళ్లీ మరో చుక్క… ఇంకొకటి.. మరొకటి.. బుగ్గలమీద జారుతుండగా తెలిసింది. కాసేపయ్యాక నదిలో నీరు ఇంకినట్టు కళ్ళల్లో కన్నీరు ‘ఇంకి’పోయింది. కళ్ళు మూసుకుని నిర్లిప్తంగా పడుకుంది. వర్షం వెలిసిన భావన. “ఏ వర్షం? ఇది మనసు వర్షించిన వర్షం.. ఆలోచనల మబ్బులు ‘బాధ’ అనే ముసుగు ధరించి వర్షించిన వర్షం ఇది. అశృవులు మనోజనితాలా? […]

మాలిక పత్రిక ఫిబ్రవరి 2014 సంచికకు స్వాగతం

   JyothivalabojuChief Editor and Content Head మాలిక పత్రిక తరఫున రచయితలకు, పాఠకులకు   శుభాకాంక్షలు …హాసం ప్రచురణలనుండి వెలువడిన కొన్ని అపురూపమైన రచనలను మాలిక పత్రికలో సీరియల్స్ గా మొదలవుతున్నాయి అని మాట ఇచ్చినట్టుగానే ఈ నెల నుండి రెండు వెండితెర నవలలు ధారావాహికలుగా ప్రారంభిస్తున్నాము. అంతే కాక వనం జ్వాలానరసింహంగారు ఈ నెలనుండి అనుపమ దర్శక, నిర్మాత కె.బి.తిలక్ గారి అనుభవాలు – జ్ఞాపకాలను అందిస్తున్నారు ..    మిమ్మల్ని మెప్పించే మరిన్ని […]

బ్రహ్మపురాణమునందలి గోదావరీ మాహాత్మ్యము

రచన: విశ్వనాధశర్మ కొరిడె   అష్టాదశ పురాణములలోని ఒక్కొక్క పురాణము ఒక్కొక్క విశిష్టతను పుంజుకొన్నది. పురాణములన్నీ శ్రవణపేయములైన కథాత్మకములు కలిగినవి కావు. కొన్ని శాస్త్రములను విశ్లేషించునట్టివి కాగా మరికొన్ని మంత్రములను, వాటి విశిష్టతను, వాటి ఉపదేశ, ఆచరణాది విశేషములు పెర్కొన్నవి.  ఉదాహరణమునకు  గరుడపురాణము ఔషధశాస్త్రమునకు పెద్దపీఠ వేసినది. అగ్ని పురాణము మంత్రశాస్త్రమునకు విజ్ఞానఖని ఐనది . పురాణములన్నీ వ్యాసమహర్షి వ్రాసినట్టుగా అష్టాదశపురాణానాం కర్తా సత్యవతీ సుతః అని పేర్కొనబడినప్పటికినీ తరచి చూస్తే రచయితల బాహుళ్యం , కాలముల […]

హరికధా గానసార్వభౌమా.. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు

రచన: ఉషాబాల గంటి “రససిద్ధులైన సంగీత సాహిత్య కళాకోవిదుల యశః కాయమునకు జరామరణముల భయము లేదన్నది బుధోక్తి. ఈ విషయం నారాయణదాసుగారి జీవితం వల్ల మనకు అర్థమవుతుంది. ఈ పుంభావ సరస్వతి చలువ వల్లనే ఈ నాటికీ హరికధలు శారదాపీఠములై విలసిల్లుచున్నవి. దాసుగారు పుట్టేవరకు హరికధలను ఆశ్రయించి హరిదాసులు జీవించారనవచ్చు. నారాయణదాసుగారు గజ్జ కట్టి హరిదాసు అయిన తరువాత హరికధలే ఆయన్ను ఆశ్రయించి అందమైన రూపును దిద్దుకుని నిలబడ్డాయన్న మాట నిజం. పేరూరు ద్రావిడ దంపతులైన నరసమాంబ, […]

భార్యా భర్తలు – 1 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ హాసం ప్రచురణలు హైదరాబాద్ వెండితెర నవల అంటే సినిమా స్క్రిప్టు కాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవిహృదయాన్ని పాఠకుడికి విప్పి చెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా అనేక కళల సమాహారం, పండితుడినుండి పామరుడి వరకు వివిధ స్థాయిల్లో వుండే సినిమా ప్రేక్షకులకు రచయిత, దర్శకుడు ఉద్దేశించినవన్నీ చేరతాయన్న నమ్మకం లేదు. ఇటువంటి వెండితెర నవలలు ఆ ‘గ్యాప్’ను చక్కగా పూరిస్తాయి. […]

మురిసేవు విరిసేవు ముకురమ్ము జూచి – అమర (నటనా) శిల్పి (నాగేశ్వర) జక్కన్న

రచన: జెజ్జాల కృష్ణ మోహనరావు తెలుగు ఛందస్సుకు శార్దూలవిక్రీడితములాటి వృత్తములు సంస్కృతమునుండి సంక్రమించినవి. కందములాటి జాతి పద్యములు ప్రాకృత, సంస్కృత కన్నడములనుండి వచ్చినవి. సీసము, ఆటవెలది, తేటగీతి లాటి ఉపజాతులు తెలుగు భాషకు ప్రత్యేకములు. ఇవి దేశి ఛందస్సులు. అదే విధముగా ద్విపద కూడ తెలుగు దేశములో పుట్టినదే. శతాబ్దాలకు ముందు తెలుగు శాసనాలలో ద్విపద గలదు. రెండు ద్విపద పాదములు చేరిస్తే మనకు తరువోజ లభిస్తుంది. సామాన్యముగా పద్యములు చతుష్పాదులు. కాని ద్విపదకు రెండే పాదములు, […]

విజయగీతాలు – 2

సముద్రాల రాఘవాచార్య (సీనియర్) 1992 జులై 19 తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో పండిత వంశంలో పుట్టిన రాఘవాచార్య చిన్నపుడే అవదాన విద్యలో ప్రజ్ఞను ప్రదర్శించారు. 1934లో ప్రజామిత్ర పత్రికకు పని చేయటంతో గూడవల్లి రామబ్రహ్మంగారితో పరిచయం యేర్పడింది. 1937లో హెచ్.వి.బాబు వద్ద ‘కనకతార’ చిత్రానికి రచయితగా సినీరంగప్రవేశం చేసి ఆ మరు సంవత్సరం 1938లో హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ‘గృహలక్ష్మి’ కి పనిచేయటం మొదటి దశలో అనుభవంగా చెప్పుకోవాలి. వాహినీసంస్థకు వి.యస్.రెడ్డి తీసిన మూడు చిత్రాలకు (వందేమాతరం, […]

ఫిబ్రవరి 2014 మాలిక పదచంద్రిక

కూర్పరి : సత్యసాయి కొవ్వలి గతమాసంలోలాగానేఈసారికూడాపదచంద్రికసులభతరంచేసిపెట్టాం.  ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదేపూరించువచ్చు.  అతిపెద్దపదంలోకేవలం 5 అక్షరాలే.   మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ:  ఫిబ్రవరి 20 2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: జనవరి 20 2014 – See more at: http://magazine.maalika.org/2014/01/01/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95-%e0%b0%9c%e0%b0%a8%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf-2014/#sthash.XQRoS4FK.dpuf ఆధారాలు. అడ్డం […]

హ్యూమరధం – 2

రచన: రావికొండలరావు హాసం ప్రచురణ   చావు సెట్టింగ్   సినిమాల్లో అవుట్ డోర్ అనీ, ఇన్‌డోర్ అనీ రెండు వుంటాయి. ఆ రోజుల్లో స్టూడియోలో,  ఫ్లోర్‌లో షూట్ చేస్తే – ఇన్‌డోర్. బయట ఎక్కడ తీసినా అవుడ్డోరే. ఆ లెక్కల్లో చూస్తే ఇవాళ అన్నీ అవుడ్డోర్లే. స్టూడియో ఫ్లోర్‌లో తక్కువ. అల్లాంటిదే ఒక అవుడ్డోర్ మద్రాసులో – ఒకరింట్లో, ఇల్లు ఊరికి చివర. షూటింగ్ ఏమిటంటే – ఆ(ఇంటి) ఇల్లాలు మరణించటం, ఆమెను పాడెమీదకట్టి, తీసుకువెళ్ళడం, […]

వెలుగునీడలు – 1 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ ప్రచురణ: హాసం పరిచయాలు అక్కర్లేని సుప్రసిద్ధ రచయిత, సినీనిర్మాత శ్రీ ముళ్లపూడి వెంకటరమణ. ’50లలో ప్రస్థానం ప్రారంభించిన శ్రీయుతులు రమణ, బాపు తమ రాత-గీతల ద్వారా, సినిమాల ద్వారా ఒక తరాన్ని మెస్మరైజ్ చేసేశారని చెప్పవచ్చు. వారిమీదనున్న అపారగౌరవం చేతనే ‘హాసం’ నడిచినంతకాలం మేము ‘బాపురమణీయం’ అనే శీర్షిక నడిపాం. రమణగారి 8 సంపుటాల సాహితీసర్వస్వంలో చోటు చేసుకోని మూడు వెండితెరనవలలను ‘హాసం ప్రచురణలు’ ద్వారా వెలువరిద్దామన్న సంకల్పం మాకుంది. ‘ఇద్దరు మిత్రులు’ […]