February 21, 2024

మాలిక పత్రిక మే 2014 సంచికకు స్వాగతం..

Jyothivalaboju Chief Editor and Content Head కొన్ని అనివార్య కారణాలవల్ల మాలిక పత్రిక ఏప్రిల్ సంచిక విడుదల చేయలేకపోయాం. అలాగే మాలిక పదచంద్రికకు సంబంధించిన బహుమతులను కూడా చాలా త్వరలో పంపడం జరుగుతుంది.   మే నెల సంచిక  ఎప్పట్లాగే  మరిన్ని హంగులతో, మీకు నచ్చిన కధలు, సమీక్షలు,వ్యాసాలు,  సీరియల్స్ తో మీ ముందుకు వచ్చింది.. మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org ఈ మే 2014 సంచికలోని విశేషాలు..  1. ఉదారవాదం vs తత్వవాదం 2. […]

ఉదారవాదం Vs. తత్వవాదం (The HIndus: An Alternative History)

    వెండీ డానిగర్ పుస్తకం పై సురేశ్ కొలిచాల ఈమాట.కామ్‍లో వ్రాసిన వ్యాసం పై విమర్శ ముందుమాట ||శ్రద్ధావాననసూయశ్చ శృణుయోదపి యో నరః…. కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ|| పై పేర్కొన్న రెండు వాక్యాలు భగవద్గీతలోనివి. ఆ రెంటినీ పలికింది కృష్ణుడే. మొదటి వాక్యం వినగోరేవారి (శ్రోతల) యొక్క లక్షణాలను పేర్కొంటే రెండవది విన్న తరువాత ఏది ఉంటుంది, ఏది పోతుందని చెబుతున్నాయి. వినగోరేవారికి శ్రద్ధ, అనసూయత్వం (అసూయ లేకపోవడం) అన్న గుణాలతో బాటు మిగతా […]

మాలిక పదచంద్రిక – మే 2014

  కూర్పరి : సత్యసాయి కొవ్వలి               గత మాసంలో లాగానే ఈసారి కూడా పదచంద్రిక సులభంగానే చేసిపెట్టాం. ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.  మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ:  మే 25  2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org  ఆధారాలు. అడ్డం 1          తిథి, వార, నక్షత్ర,యోగ, కరణాలుండే పుస్తకం. 3          వసంతకాలపు పక్షి కూత 4          ముందునుండి గెలవలేక […]

తుమ్మెద పద్యములు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆ కాలములో ఉండే దేశీయ ఛందస్సులను గుఱించి ఈ విధముగా చెప్పాడు – పదములు, తుమ్మెద – పదముల్, ప్రభాత పదములు, శంకర – పదముల్, నివాళి పదములు, వారేశు – పదములు, గొబ్బి పదములు, వెన్నెల – పదములు, సంజ వర్ణన మరిగణ – వర్ణన పదము … ఇందులో తుమ్మెద పదములు అనేవి బహుశా ద్విపద ఛందస్సులోని ఒక ప్రత్యేకత యేమో?  ఇప్పటికి […]

అనగనగా బ్నిం కధలు 9 – పాల యాదగిరి

రచన: బ్నిం చదివింది : ఝాన్సీ…   ఫాక్టరీ స్ట్రైకులో పడింది మిడిల్ క్లాస్ బతుకుబండి గతుకుల్లో పడింది… యాజమాన్యానికి, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్‌కీ మధ్య జరిగే పోరాటంలో మధ్యతరగతి వర్గం నలుగుతూనే వుంటుంది. అవసరమైన ఖర్చులు కూడా నియంత్రించుకోవాల్సిన ఆపత్కర పరిస్థితిలో.. హేమ అనే తల్లికీ… కిట్టూ అనే చిట్టిబాబుకీ.. రోజూ పాలు పోసే యాదగిరికీ మధ్య జరిగిన మనసు కథ… మనసులు నలిగే కథలో మమతలు విరిసిన కథ… ఇష్టపడి చదివింది – ఝాన్సీ… […]

అండమాన్ డైరీ – 4

రచన: దాసరి అమరేంద్ర             మూడు రోజులు గడిచిపోయాయి. హేవలాక్‌లో ఇరవై గంటలు. చనువు వచ్చేసింది. కొత్తదనం దూరమయింది. గైడు గారి కోసం ఎదురు చూడ్డం అన్న ప్రసక్తే లేదు. నా అలవాటు ప్రకారం ఆ నాలుగో నాడు ఉదయం అయిదున్నరకల్లా రూంలోంచి బయటపడ్డాను. రోడ్డును పక్కన బెట్టి తిన్నగా ఉండీ లేని కాలి దారుల్లో సముద్ర తీరం చేరాను. ప్రకృతి నిజంగా వరప్రసాదిని. ఎర్లీ పక్షులకు కీటకాలు దొరకడం సంగతి ఎలా ఉన్నా నాకు […]

మౌనరాగం – 6

రచన: అంగులూరి అంజనీదేవి http://www.angulurianjanidevi.com anguluri.anjanidevi.novelist@gmail.com http://www.angulurianjanidevi.com/ anguluri.anjanidevi.novelist@gmail.com – See more at: http://magazine.maalika.org/2014/02/01/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-4/#sthash.iMqJo7rG.dpuf http://www.angulurianjanidevi.com/ anguluri.anjanidevi.novelist@gmail.com – See more at: http://magazine.maalika.org/2014/03/10/%e0%b0%ae%e0%b1%8c%e0%b0%a8%e0%b0%b0%e0%b0%be%e0%b0%97%e0%b0%82-5/#sthash.nzAr66KW.dpuf సుభాష్‌చంద్ర మరణం దేదీప్యకి పెద్ద షాకయింది. దేదీప్యను ఎలా ఓదార్చాలో అర్థం కాక, ఆ స్థితిలో ఆమెను ఒంటిరిగా వదిలెయ్యలేక, తన ఇంటికి తీసుకొచ్చుకొని, ఆ రాత్రికి తన గదిలోనే పడుకోబెట్టుకొంది యశోదర. దేదీప్యలోని నిరాసక్తత చూస్తుంటే సుభాష్‌చంద్ర చావు ఆమె మీద ఎంత ప్రభావం చూపిందో అర్థమవుతోంది.  ఏ […]

మాయానగరం – 3

రచన: భువనచంద్ర ఆనందరావు ఆలోచిస్తున్నాడు. “మూడో యింటివాళ్లు అకస్మాత్తుగా కాఫీ టిఫెన్ పంపడంలోని  అంతరార్ధం ఏమిటా” అని. వాళ్లకి పెళ్ళీడుకొచ్చిన కూతురున్నట్టు ఎలాంటి దాఖలాలూ లేవు. మరెందుకీ ‘ఉచిత’ కాఫీ టిఫెన్ పథకం? ఆంధ్రదేశంలో బ్రహ్మచారులకి ‘ప్రత్యేక’ సదుపాయాల్నీ’సంసారులు’ సమకూర్చడంలో ఎన్నో అర్ధాలుంటాయి. పెళ్లి కావలసిన కూతురో, చెల్లెలో, మరదలో ఉంటేగానీ ఇలాంటి ‘అర్ధాంతర ఆప్యాయతల  వర్షం  కురవదు’. ఇది అతని నిశ్చితాభిప్రాయం. కాఫీ తాగటం, కప్పూ సాసరూ, టిఫెన్ ప్లేటు తిరిగివ్వడం ఎప్పుడో జరిగిపోయినా, ఆలోచనలు […]

అలా మొదలైంది….

రచన: డా. జె. గౌతమి సత్యశ్రీ     రాజ్, జూలీ తమకున్నంతలో హాయిగా, ప్రేమగా జీవించే జంట. జూలీకి జీవితం లో పెద్దగా కంప్లైంట్స్ లేవు, ఆశలు లేవు. కాబట్టి రాజ్ కూడా చాలా హ్యాపీ గా జీవితాన్ని   నెట్టుకొచ్చేస్తున్నాడు. ఎవరో తెలిసిన వాళ్ళు డిపార్ట్ మెంటల్ స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామంటే జూలీ స్టోర్ లో చేరింది, ఏదో కొంచెం ఎక్స్ ట్రా మనీ ఇంటికి వస్తుంది కదా అని. ప్రతిరోజూ  […]

అనుపమ దర్శక నిర్మాత కె. బి. తిలక్ – అనుభవాలు-జ్ఞాపకాలు-3

రచన: వనం జ్వాలా నరసింహారావు పొట్టి శ్రీరాములును బలి చేసారు సమాజంలో గుర్తింపు వచ్చిన వ్యక్తికి, రాని వ్యక్తికి కూడ, వారివారి గత చరిత్రల్లో స్పూర్తి దాయకమైన కొన్ని సంఘటనలు వుండటం సహజం. ఆ వ్యక్తి ధనవంతుడు కావచ్చు, పేదవాడూ కావచ్చు. జీవన పోరాటంలో స్వయం కృషితో ఓ సముచిత స్థాయికి వచ్చిన వారెందరో వున్నారు. అలాంటి వారిలో తాను సహితం ఒకడిని అవునో కాదో ఇదమిద్ధంగా తేల్చి చెప్ప లేకపోయినా, తన జ్ఞాపకాలను మాత్రం ఇతరులతో […]