February 21, 2024

మౌనరాగం – 7

రచన: అంగులూరి అంజనీదేవి http://www.angulurianjanidevi.com anguluri.anjanidevi.novelist@gmail.com నేత్రా పత్రిక కొనటానికి కొంతమంది ముందుకొచ్చినా, రేటు దగ్గర వెనక్కి తగ్గటంతో ఆ టెండర్‌ అమృతరావుకి దక్కింది. ఆ పత్రిక చూసుకునే బాధ్యత తన కొడుక్కి అప్పజెప్పాడు అమృతరావు. పత్రికాఫీసులో పాత రికార్డులన్నీ పరిశీలించి, కొంతమందిని సమావేశపరిచాక, సుభాష్‌చంద్ర దగ్గర కీలకమైన వ్యక్తి దేదీప్య అని తెలియగానే దేదీప్యను పిలిపించారు. జాబ్‌లో జాయిన్‌ కమ్మని దేదీప్యను కోరారు. ప్రస్తుతం ఉద్యోగం అవసరం అయినందువల్ల ఆ ఆఫర్‌ దేదీప్యకి మండుటెండలో వెన్నెలవర్షంలా […]

వాళ్లు – ఒక పాదచారి అనుభవ విశేషాలు.

ఒక సమీక్ష : మంథా భానుమతి. హిమాలయ పర్వత సానువుల కేగిన ఒక యువకుని స్వానుభవ స్వగతం, స్వప్న మాసపత్రికలో వచ్చిన భువనచంద్ర రాజుగారి “వాళ్లు” ధారావాహిక. అది తన స్వానుభవమేననీ, అందులోని పాత్రలు నిజంగా తనకు తారసపడిన వ్యక్తులేననీ రచయిత చెప్తారు. ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, కట్టు బట్టలతో, చేత చిల్లిగవ్వ లేకుండా, హిమాలయ శీతల వాతావరణంలో నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.. పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమయిపోతాము. మరి ఎవరీ “వాళ్లు”.. […]

అమ్మ కథలు.

రచన: సమ్మెట ఉమాదేవి సమీక్ష: సుజల గంటి “అమ్మ” అన్న పదమే ఒక మధురానుభూతి.  మానులో మానుపుట్టి అన్నట్లుగా తన రక్త మా౦సాలను ప౦చి, విధాతకు సమానంగా ప్రతిసృష్టి చేసే అమ్మకు నిర్వచన౦ ఉ౦దా! “అమ్మ౦టే” అన్న మొదటి కథలో కొమరెల్లి అతని పిల్లలు మీ అమ్మ ఎలా ఉ౦టు౦ది అన్నప్పుడు, మాటలకన్నా ఆమెను చూపి౦చి, ఆమె తన రక్త మా౦సాలతో ఎలా పె౦చి౦దో ప్రత్యక్ష౦గా చూపి౦చాలనుకున్నాడు. సమ్మెట ఉమాదేవి తన మొదటి కథలో తన పిల్లల్ని […]

ఇద్దరు మిత్రులు – 1 ( వెండితెర నవల )

రచన: ముళ్లపూడి వెంకటరమణ హాసం ప్రచురణలు హైదరాబాదు అన్నపూర్ణవారి ఇద్దరుమిత్రులు   పైనున్న వాడు బహు కొంటెవాడు. పెద్దంత్రం, చిన్నంత్రం లేకుండా అందరినీ ఆడించి, ఆడుకుంటాడు. అరక్క వీడూ, దొరక్క వాడూ అవస్థపడగా, ‘వీడి’కి వజ్రాలూ, ‘వాడి’కి మరమరాలూ యిస్తాడు. ఉప్పుకి, కప్పురంలా గుబాళించాలన్న ఉబలాటం కలిగిస్తే, కప్పురానికి ఉప్పులా చవులూరాలన్న సరదా పుట్టించి తమాషా చూస్తాడు, జీవితం ఉప్పులా కరిగిపోయి, కప్పురంలా హరించిపోయేవరకు ఈ తీరని కోరికలతో కాలక్షేపం చేయించేస్తాడు. రామదాసు గారు (భద్రాచలం తాలూకా […]