February 21, 2024

మాలిక పత్రిక జూన్ 2014 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రిక  జూన్ నెల సంచిక మరిన్ని హంగులతో, మీకు నచ్చిన కధలు, సమీక్షలు, సీరియల్స్ తో మీ ముందుకు వచ్చింది.. వచ్చే నెల మాలిక పత్రికలో ఒక విశేషముంది.. కాస్త ఓపిక పట్టండి… మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org ఈ జూన్  2014 సంచికలోని విశేషాలు.. 01. తెలుగులో సుదీర్ఘమైన సమాసం ఏది? 02. మాలిక పదచంద్రిక – జూన్ 2014 03. చంపకమాలనుండి మత్తేభవిక్రీడితము […]

తెలుగులో అత్యంత సుదీర్ఘమైన సమాసం ఏది?

రచన: ఏల్చూరి మురళీధరరావు   కొంత కాలంగా నన్ను ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇది. పద్యమైనా, గద్యమైనా  వినీవిన్నంతనే పదమూ, అర్థమూ అభిహితాన్వయం కలిమి వల్ల గులాబీ మొగ్గ ఒక్కొక్క రేకూ విచ్చుకొని విప్పారి గుప్పుమని గుబాళించినట్లు గుండెలకు హత్తుకొనిపోవాలి. పదము యొక్క అర్థం, అర్థం వెనుక దాగివున్న భావం, భావంలోని రసస్ఫూర్తి, మనస్సులోని మాలిన్యాన్ని క్షాళించివేయగలిగినంత జీవశక్తితో వెలుగులీనాలి. ఆ మాటనెవరూ కాదనలేరు. కవిత్వానికి పరమార్థం అదే. అంతేకాదు. వక్తవ్యమైన ఏ విషయాన్నైనా అరటిపండును ఒలిచి చేతిలో […]

మాలిక పదచంద్రిక – జూన్ 2014

కూర్పరి : సత్యసాయి కొవ్వలి  ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.  మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ:  మే 25  2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org – See more at: http://magazine.maalika.org/2014/05/07/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ae%e0%b1%87-2014/#sthash.B4om5mwD.dpuf ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: జూన్ 25  2014 […]

చంపకమాలనుండి మత్తేభవిక్రీడితము – ఒక కేళిక

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు          పరిచయము – మేము చిన్నప్పుడు ఒక ఆట ఆడుకొనే వాళ్లము.  ఒక పదములో ఒక అక్షరం చొప్పున మార్చి, లేక తొలగించి, లేక అదనముగా తగిలించి మరొక పదముగా చేయాలి.  ఇది ఏ భాషలోనైనా, ఆంగ్లము కాని తెలుగు కాని, సాధ్యము. ఆంగ్లములో ఉదాహరణ – man to moon: man -> moan -> moon; car to bus: car -> bar -> ban […]

అనగనగా బ్నిం కథలు 10 – ఇదో వ్యధ

చదివింది .. మోహనరావు చదివించింది.. ఝాన్సీ రాసింది మాత్రం.. బ్నిం   ఈ కధ గురించి చెప్పలేను..! ఇందులో పాత్రలు మాత్రం ఓ మావగారూ, అల్లుడు.. ఓ స్కూటరు.. అల్లుడు .. మేనల్లుడిగా వున్నప్పుడు, (అంటే అల్లునింగారి చిన్నప్పుడు) బుడిబుడి అడుగుల నడక నేర్పి,, అడుక్కి 5 పైసల నాణెం లంచం ఇస్తానని 10 అడుగులకే రూపాయిచ్చేసి మురిసిపోతూ, ముద్దు పెట్టించుకున్న మావయ్యా… మావగారైయాక అడుగుకి ఎంత ముడుపు కట్టాడు? అనేదే ఈ కధ.. తమాషాగా నడిపిన […]

అండమాన్ డైరీ – 5

రచన:  దాసరి అమరేంద్ర    చూసిన అడవులూ, ‘తెలిసిన’ రోడ్లే గదా నిర్లిప్తంగా సాగుతోన్న వానులో కలవరం ` క్షణకాలం. రోడ్డు పక్కన ఓ జరవా జంట! మరి అందరి కన్నూ ఎలా కప్పారో తెలియదు. ఆ క్షణంలో మా వానుమేట్లు సాక్షాత్తూ తిరుపతి దేవుడూ పద్మావతీ దిగివచ్చి  కనిపించినా అంతగా సంతోషపడేవారు గాదేమో! జన్మ ధన్యమయిందన్నంత పరవశం! అతి ఉత్సాహంతో ఒకళ్ళిద్దరు కెమెరాలు సంధించబోతోంటే మిగిలిన వాళ్ళం ఆపాం. కొంత సామాజిక స్పృహవల్ల, మరికొంత భయం […]

సరిగమలు-గలగలలు – 6

రచన: మాధవపెద్ది సురేష్ (సినీ సంగీత దర్శకుడు) జె.వి.డి.ఎస్.శాస్త్రి (జంధ్యాల వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్యశాస్త్రి) నాకు 1969లో పరిచయమయ్యాడు. అన్నయ్య రమేష్ పరిచయం చేశాడు. అన్నయ్య కోసం అప్పుడప్పుడు మా యింటికి వచ్చేవాడు. తమ నాటికల్లో హీరో. పైగా రచయిత కూడా. గుండెలు మార్చబడును, సంద్యారాగంలో శంఖారావం లాంటి పాప్యులర్ నాటికలు రాసి హీరోగా యాక్ట్ చేసేవాడు. వాటికి నేను కూడా కొన్ని సార్లు ఎకార్డియన్ వాయించాను. అన్నయ్యకీ, జె.వి.డి.ఎస్.కీ కామన్ ఫ్రెండ్స్ ఎక్కువ. అన్నయ్య, […]

మాయానగరం – 4

రచన: భువనచంద్ర రాజు   మిస్ శోభారాణి బియ్యస్సీ పనిచేసే ప్రయివేటు స్కూలుకి యజమానీ, కరెస్పాండెంటూ, రెక్టారూ కూడా శామ్యూల్ రెడ్డే. వాళ్ల పూర్వీకులు రెడ్లయినా ‘మతం’ పుచ్చుకున్నారు.  పెళ్ళిళ్ళూ, చావులూ కూడా ‘మతం’ పద్ధతిలో జరుగుతై. లెటర్‌హెడ్‌లో మటుకు K.S.రెడ్డి అని వుంటుంది. అనగా, కాటమరెడ్డి శామ్యూల్ రెడ్డి అని అర్ధం. K S రెడ్డికి ‘ప్రాఫిట్ మోటివ్’తో బాటు ‘పైకి ఎగబాకాలనే ఆశలూ వున్నాయి. ‘నిచ్చెనలు’ ఎలా వేయాలో బాగా తెలిసినవాడవటం చేత ‘గుడిసెల […]