March 28, 2024

మాలిక పదచంద్రిక – జులై 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి  satyasai

ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: జులై  25  2014

సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

july padachandrika

ఆధారాలు         అడ్డం

1        కవిత్రయంలో మధ్యవాడు

3        ఈవిడకి కూడా చెప్పకుండా వెళ్ళాడట విష్ణుమూర్తి .. గజేంద్రుడి కోసం

4        ధర్మసాధనం.. శరీరం ఉంటేనే

6        పెద్ద

8        కోమలి విశ్వాసం లాగే .. వీటితో చెలిమి కూడా అబద్ధం సుమతీ

10       ఎలుక యిల్లు

11       1000 నవలలు రాసినాయన యింటి పేరు

14       బ్యాట్మింటనాడమ్మా అంటే ఇంటి పేరు తిరగేయమందిటీ జ్వాల?

15       నిజం ఇలాంటిది

16       విశ్వకర్మ

17       చిన్నప్పుడు ఇదే, పెద్దయాక కీకరయిందట

19       పిల్లి అని పిల్లలకి ఇలాగే చెప్తాం

20      వీధిభాగవతం .. ఈగానం యక్షులు పాడరు, మనుషులే

21       ద్వారకా శంకరాచార్య పీఠం స్వాములోరు ఈయన మీదేదో అన్నారట

23      దీంట్లో మనని మనం ఎంతసేపైనా చూసుకుంటూ ఉండచ్చు. మన అందం గురించి ఇదెప్పుడూ

          అబద్ధం చెప్పదు

24      అప్సరస .. అలర్కుడి తల్లి. 1948 నాటి అంజలీదేవి సినిమా కూడా

25      దామెర్ల  లోక నాధం.. పొడిగా.. పొట్టిగా

26      సిరిదావచ్చిన .. ఇదడ్డుపెడతారా, అందులోనూ తిరగేసి

28      స్వర్గం

29      స్థానికం

30      ఆధారం

33      ఈ జాతి స్త్రీ ..శంఖం ఊదుతుందా?

36      ప్యూపా అవ్వక ముందు సీతాకోక చిలక

37      జలాశయం

ఆధారాలు         నిలువు

1        డబ్బులున్న వారికే కానీ ఈయనకి ఇద్దరాండ్రా

2        గోరుతగిలి గాయమైతే, ఈ క్షతం అంటారు

5        మాయం

7        తాడుతో నేసిన మంచం

8        దేవదాసు ప్రియురాలు

9        చర్మమే

11       ఈ ఆవకాయ పోయిన వారమే పెట్టాం

12       పిట్ట.. తలకిందులుగా

13       అప్పు చేసి తినే కూడు

15       నియమం తోడిదే

16       వేగంగా

18       శతృవు మీద ఉండేది

21       దానాలూ, ధర్మాలూ కాదు..నాల్గు ఉపాయాల్లో మొదటి రెండూ..

22      గుడి యెనకా నా సామి గుర్రమెక్కి కూచున్నాడు అని పాడింది ‘యీ’లోకంలోనా.

23      ఇదుంటేనే వడ్డీ

27      పూలకీ, కాయలకీ కింద ఉండేవి.  26 డ్డంఅ మధ్యలో ‘డ’ప్పేస్తే చాలు

30      చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ హీరోయిన్

31       కృష్ణుని భార్య

32      మన మొక్కపాటి వారి బారిష్టరే. ఎటొచ్చీ, 1234 కాస్తా 1423 అయ్యాడు

34      హిందీ కోట

35      37 అడ్డంలో ఉండేది

1 thought on “మాలిక పదచంద్రిక – జులై 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *