April 20, 2024

మాలిక పత్రిక ఆగస్ట్ 2014 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor & Content Head గత నెలలో మాలిక పత్రిక తరఫున చేసిన ప్రయోగం సఫలం కాదు. ఘనవిజయం సాధించింది. తండ్రి -కూతురు అంశం మీద మరి కొందరు రచయిత్రులు రాయడానికి ముందుకొచ్చారు. సంతోషం.  ఈ కధానికలన్నింటిని గుచ్చి మాలగా అచ్చు వేయించాలని నిర్ణయించడమైనది.. ఇంకా ఎవరైనా ఈ అంశం మీద రాయాలనుకుంటే తప్పకుండా రాసి మాకు పంపండి.. మీకు మాలిక పత్రికనుండి సదా స్వాగతం  లభిస్తుంది.. మీ రచనలుఅభిప్రాయాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org […]

మెహజబీన్ బానో – సాటిలేనిది

రచన: భువనచంద్ర “చలొ   దిల్‌దార్ చలో .. చాంద్ కే పార్ చలో…. అంటూ స్వచ్ఛమైన ధవళవస్త్రాలు ధరించి ఆ వెన్నెలలోనే కలిసిపోయిందా?? చుక్కలతో చేరి మాయమయిందా?? లేక ఈ మానవలోకాన్ని వదిలి ప్రేమలోకాలకు తరలిపోయిందా మీనాకుమారి. ఒకవైపు నైరాశ్యం, మరోవైపు నిరంతరం ప్రేమాన్వేషణ,  ఒకవైపు అందమైన కవితారచన, మరోవైపు జీవితాన అంతులేని విషాదం. ఈ నాలుగు స్తంబాలమీద కట్టిన పేకమేడలాంటి ప్రేమమందిరంలో కొలువైన అందమైన దేవత మాహెజబీన్ బానో… మరణించే ముందు “నూర్జహాన్” కవిత రూపంలో […]

చిరంజీవ… విజయీభవ

రచన: జ్యోతివలబోజు సుమ తల్లీ!!! నేను నీ నాన్నని.. కంగారు పడకు ఎప్పుడూ లేనిది ఇవేళ నేను ఉత్తరం రాయడమేంటి అని అనుకుంటున్నావా?? …    ఇలా మనసులోని మాటలు ఉత్తరంలా రాయడం అది కూడా స్వంత కూతురికి రాయడం  నాకు మొదటిసారి. తప్పులుంటే క్షమించమ్మా.. రచయిత్రివి కదా..  ఎందుకో నీతో నిజం చెప్పుకోవాలనిపిస్తుంది. మరీ టూ మచ్ అనుకోవద్దు. ఈ మాటలు నీతో చెప్పకుంటే నాకు స్తిమితంగా ఉండదు. నీ గురించి తలుచుకుంటే నాకు ఒకవైపు గర్వంగానూ […]

వర్షంలో గొడుగు (తండ్రి – కూతురు)

రచన :వాయుగుండ్ల శశికళ ”అయ్యో పొరపాటు జరిగింది . ఇప్పుడే సారె లో అది కూడా  పెట్టేస్తాము . తల్లి లేని పిల్ల కదా ! వాళ్ళ అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది . అదీ కాక మీ  పద్దతులు కొంచెం వేరుగా ఉన్నాయి . ఇప్పుడే సరి చేసేస్తాము ” మెల్లిగా బ్రతిమిలాడుతూ అన్న నాన్న మాటలు చెవినబడ్డాయి కొత్త పెళ్లి కూతురు  సుష్మ కి . అమ్మ లేని పిల్ల … మనసు బాధతో మూలిగింది . ఎంత నాన్న తల్లి ప్రేమతో అన్నీ చేస్తున్నా ఎక్కడో దగ్గర […]

చాందిని (తండ్రి – కూతురు)

రచన: మాలాకుమార్ గుప్పిళ్ళు రెండూ మూసుకొని , తలకు రెండుపక్కలా పెట్టుకొని ,ఉయ్యాలలో అమాయకంగా నిద్రపోతున్న బుజ్జిపాపని తదేకంగా చూస్తున్నాడు శ్రీహర్ష . పక్కన మంచం మీద పడుకొని వున్న శ్రీదేవి నవ్వుతూ “మీ అమ్మాయికి దిష్ఠి తగులుతుంది.”అన్నది ఆ మాట వినిపించుకోకుండా “ఎంత ముద్దుగా వుంది పాపాయి. చందమామలా వుంది. అందుకే నా పాప పేరు  ‘చాందినీ ‘ “మురిపెంగా అన్నాడు.శ్రీహర్ష. “అదేమిటి, నార్త్ ఇండియన్ పేరు పెడతారా?” అని ప్రశ్నించింది శ్రీదేవి. “నార్త్ ఇండియన్ […]

“శాంతి” (తండ్రి – కూతురు)

రచన: స్వాతి శ్రీపాద “కాఫీ తీసుకురానా నాన్నా” ఐదున్నరకే లేచి పేపర్ తిరగేస్తున్నతండ్రిని పరామర్శించి’౦ది శాంతి. అప్పటికే తండ్రి అలికిడి, బాత్ రూమ్ లో బ్రష్ చేసుకోడం విని లేచి పాలు స్టౌ మీద పెట్టి వచ్చి౦ది. సు౦దరరామయ్య తల ఊపాడు. ఎనభై దాటి రెండేళ్ళయినా  అద్దాలు అవసరం లేకుండా పేపర్ చదవగలడు. తన పనులు తను చేసుకుంటాడు. కాదంటే బయటకు వెళ్లి తిరగడం లాటివి తగ్గిపోయాయి. గడ్డం నిమురుకుంటూ కుర్చీలో కూచున్న తండ్రిని చూసి మనసులోనే […]

మాలిక పదచంద్రిక – ఆగస్ట్ 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి     ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: ఆగస్టు  25  2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org           ఆధారాలు    అడ్డం 1    ఆంద్రకేసరి ఇంటిపేరు 6    ఈ పిట్టలు మధురవాణి ని బలే నవ్వించాయి.. కన్యాశుల్కంలో 9    ఓ కన్ను వంకర.. వెనకనుండి 10    కంప్యూటరు లో ఉన్నది […]

“ముగ్గురు కొలంబస్ లు.”

రచన,  డా. సోమరాజు సుశీల సమీక్ష- డా. మంథా భానుమతి. కొలంబస్ ఆల్రెడీ అమెరికా ఎక్కడుందో కనిపెట్టెయ్యడం, ఆ ఊసట్టుకుని ఐరోపా వాళ్ళంతా దాన్ని ఆక్రమించేసి.. అక్కడున్న వాళ్ళలో చాలామందికి వేరే లోకానికెళ్ళిపొమ్మని దారి చూపించేసి, మిగిలిన వాళ్ళని అక్కడక్కడ మూలల్లో ఉండండర్రా అని ఉంచేసి.. ప్రపంచంలో అన్ని దేశాల వారికీ భూమ్మీద స్వర్గం అంటే ఇలా ఉంటుందోచ్ అని చెప్పేశాక.. ఆల్ ద రోడ్స్ లీడ్స్ టు రోమ్ లాగ, ఆల్ ద బ్రైన్స్ గో […]

అ…ఆ… చిత్రకవిత

చిత్రం : చిత్ర ఆర్టిస్ట్ కవిత: మాలతి దేచిరాజు సరస్వతీదేవి చేతిలో వీణలా ఒకప్పుడు చిన్నారుల చేతుల్లో నిలిచిన పలక.. నేడు నిస్సహాయమై ముక్కలై పోయింది…… బలపం పట్టాల్సిన పసిచేతులతో బలవంతంగా పని చేయిస్తోంటే .. చూడలేక ఆకలి బాధ “అ” అక్షరానికి బదులు.. శ్రమకు ఆయుధంగా వారిని మార్చేస్తే బదులు పలకలేక … బాలకార్మిక వ్యవస్థ దోపిడిలో అమాయకమైన బాల్యం భవిష్యత్తును కోల్పోతోంటే…… వాగ్దేవి నిలుచుంది…. బాధాతప్త హృదయంతో… తడిబారిన కళ్ళతో… బాల కార్మికచట్రాల మధ్య […]

” వెటకారియా రొంబ కామెడీయా” – 1

రచన: మధు అద్ధంకి సుబ్బారావు పెళ్ళిచూపులు   ఆ ఇంట్లో అందరూ చాలా హడావిడిగా ఉన్నారు.. కారణం  సుబ్బారావుకి పెళ్ళిచూపులు..సదరు సుబ్బారావు కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు..కొన్నాళ్ళు అమెరికాలో పనిచేసి మేరా భారత్ మహాన్ అని ఇండియాకి వచ్చేశాడు…మంచి ఉద్యోగం, మంచి జీతం.. త్వరలో సింగపూర్ పంపుతామని ఆఫీస్ వాళ్ళు చెప్పినా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు… ఇకపోతే సుబ్బారావు పెద్ద అందగాడు కాదు కాని అనాకారి కూడ కాదు… రాముడు […]