March 29, 2024

” ఎప్పుడూ నాతోనే, సజీవంగా….!” (తండ్రి – కూతురు)

రచన: మన్నెం శారద ఎదురుగా సూర్యుడు పెరుగుతున్న కొద్దీ ఎండ వేడెక్కుతోంది. ఎండ చుర్రుమనేసరికి పద్మజ కుర్చీలో అసహనంగా కదిలింది. అప్పటికి రెండు గంటల పైనే అయ్యింది. అలా కూర్చుని. తాగిన కాఫీ కప్పు మీద చీమలు పారుతునాయి. బాల్కనీ లో అమర్చిన పూలమొక్కలు నీళ్ళు లేక తలలు వాల్చేసాయి. తొట్టెలో మట్టి నెర్రెలు యిచ్చింది. అక్కడే నీళ్ళ పంపున్నా పోయాలనిపించని నిరాసక్తత..  మాటి మాటికి కన్నీళ్ళొస్తున్నాయి పద్మజకి. ఒక్కసారి ఏదో శూన్యత ఆవరించింది. సెల్ రింగయింది. […]

మాలిక పత్రిక అక్టోబర్ 2014 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠకులందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు. మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మరిన్ని ఆసక్తికరమైన కథలు, వ్యాసాలతో ముస్తాబై మీ ముందుకు వచ్చింది.. మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org ఈ సంచికలోని విశేేషాలు: 01. ఎప్పుడూ, నాతోనే 1. పోతన నన్నెచోడుడు  2. ఆరాధ్య – 1 3. హిమగిరి సొగసుల నేపాల్ 4. పదచంద్రిక 5. రహస్యం 6. మొదటి మహిళా సెనెట్ 7. తేడా (తండ్రి […]

పోతన – నన్నెచోడులు చిత్రించిన మన్మథుని రథనిర్మాణం

రచన:ఏల్చూరి మురళీధరరావు   ఆంధ్ర జాతీయ మహాకవి బమ్మెర పోతనామాత్యుల వారి వీరభద్రవిజయ కావ్యంలో పరమశివుడు దక్షయజ్ఞఫలంగా తనకేర్పడిన సతీవియోగానికి వికలమనస్కుడై  హిమవత్పరిసరప్రాంతానికి వెళ్ళి తపోమగ్నుడైనప్పుడు దేవతలు తారకాసుర వధను కావింపగల కుమారోదయం నిమిత్తం పార్వతీపరమేశ్వరులకు పరిణయాన్ని ఘటింపగోరి శివతపోభంగానికి మన్మథుని అభ్యర్థించిన సన్నివేశం ఉన్నది. మన్మథుడు పరమశివుని యోగదీక్షను భగ్నం చేయటానికి సర్వసన్నాహాలతో రథారూఢుడై బయలుదేరుతాడు. ఆ సమయంలో మన్మథునికోసం కామధేనువు తెచ్చిన పుష్పరథాన్ని మహాకవి వర్ణిస్తున్న పద్యం ఇది:   సీ. కమలషండము నున్నఁగాఁ […]

ఆరాధ్య – 1

రచన: అంగులూరి అంజనీదేవి http://www.angulurianjanidevi.com  anguluri.anjanidevi.novelist@gmail.com     కడప నుండి వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కూర్చుని ఎంతో ఉద్విగ్నంగా ప్రయాణం చేస్తోంది ఆరాధ్య. ట్రైనెక్కినప్పటి నుండి ఆమె ఆలోచనలు ట్రైన్‌లాగే కదులుతున్నాయి. మనసు వేగంతో పోటీ పడుతున్నాయి. ఆమె చేస్తున్నది రైలు ప్రయాణం కాబట్టి చెట్లు, అడవులు, పొలాలు, కొండలు దాటి వెళ్తున్నాయి. అదే జీవిత ప్రయాణమైతే ఈ ప్రకృతి, ఈ ఆహ్లాదం ఉంటుందా? ప్రతి ప్రయాణం వెనుక ఒక రహస్యం, ఒక అర్థం, ఒక […]

“హిమగిరి సొగసుల నడుమ నేపాల్”

రచన:  మంథా భానుమతి.  ఉపోద్ఘాతం-   ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా పేరుపొందిన నేపాల్  అందాలని సందర్శించాలని వేలాదిగా సందర్శకులు ఆరాట పడుతుంటారు. మేము కూడా ఉత్సాహంగా బయలుదేరుదామని నిశ్చయించుకున్న వెంటనే ముందుగా.. ఆ ప్రదేశం గురించిన అవగాహన ఉండాలని శోధన మొదలు పెట్టాను. అనేక కథలు, కథల్లాంటి నిజాలు కంట పడ్డాయి. వాటిని మా యాత్రా విశేషాలతో సహా పంచుకోవాలనేదే ఈ చిన్ని ప్రయత్నం. హిమవత్పర్వత పాదాల వద్ద పరచుకున్న నయపాల దేశం గురించి ప్రధమంగా […]

మాలిక పదచంద్రిక అక్టోబర్ 2014

 కూర్పరి: సత్యసాయి కొవ్వలి                                  ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: 20th అక్టోబర్ 2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org ఆధారాలు అడ్డం 1    లీడరు .. కమల్ హసన్ 4    ఇంట్లోంచి నీళ్ళు బయటికి […]

“రహస్యం “

రచన: -భవానీ ఫణి ఆదివారం సాయంత్రం  తీరిగ్గా కూర్చుని  టీవీ చూస్తుంటే సెల్ ఫోన్ మోగింది . ఎవరా అని చూస్తే పరమేశు . “శేఖర్ గాడి రహస్యం తెలిసిపోయింది రా ”  ఫోన్ లిఫ్ట్ చెయ్యడంతోనే  ఉద్విగ్నంగా అన్నాడు వాడు. ఇరవై అయిదేళ్ళ నుంచి తెల్సుకోవాలని ఎంతగానో ప్రయత్నించి, చివరికి ఇక ఎప్పటికీ తెలియదు అని నిర్ధారణకి వచ్చేసి ఊరుకున్న రహస్యపు చిక్కుముడి  అనుకోకుండా వీడింది  అనేసరికి వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్ధం […]

మొదటి అమెరికా మహిళా సెనేట్ – హిల్లరి రోధమ్ క్లింటన్

రచన: డా. జె. గౌతమీ సత్యశ్రీ       రాబోయే 2016 ఎన్నికలకు అమెరికా అధ్యక్షురాలి గా పోటీ చేయడానికి ఏకైక సర్వసమర్ధురాలు హిలరీ రోధం క్లింటన్. రోజు రోజుకీ ఎక్కువైపోతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా మానవ అక్రమ రవాణా మీద అప్రమత్తంగా తీసుకోవలసిన చర్యల గురించి యునైటడ్ మెథాడిస్ట్ వుమెన్ కన్వెన్షన్ (ఏప్రిల్ 16, 2014)  లో మాట్లాడుతూ ఇలా అన్నారు…. “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూర్చునే తరుణం మించిపోయింది,  దీనిని […]

తేడా (తండ్రి – కూతురు)

రచన –డా.లక్ష్మి రాఘవ “నాన్నా నా కొత్త ఫ్రెండ్ సుమన…” పరిచయం చేసింది కార్తీక. “కాలేజీ లో కొత్తగా చేరావామ్మా?”అన్నాడు రామూర్తి సుమనతో “అవునంకుల్ , నిన్ననే జాయిన్ అయ్యాను.” “”సరే కార్తీకా, నేను ఆఫీసు కేడుతున్నా కొన్ని కేసులు చెక్ చెయ్యాలి. వస్తానమ్మా సుమనా be good friends. Friendship always counts…”   కార్తీక తలమీద చిన్నగా కొట్టి  బయటకి వెళ్ళబోయాడు. “వస్తున్నా నుండు నాన్నా” అంటూ  కార్తీక వాళ్ళ నాన్నతో బయటకు వెళ్లి ఆయన […]

ముఖపుస్తకాయణం: … వెటకారియా రొంబ కామెడియా-3

రచన: మధు అద్ధంకి ముఖపుస్తకాయణం:   ఈ మధ్య అందరూ ఏదో చాల బిజీ గా ఉంటున్నట్టు గమనించాడు సుబ్బరావు… ఎవ్వరినీ చూసినా మొబైల్లో, కంప్యూటర్లో చాలా చాలా బిజీగా ఉంటున్నారు.. ఆఫీస్లో కొలీగ్ అప్పుడప్పుడు మాట్లాడేవాడు అతను కూడ వీటిల్లో చాలా బిజీ అయిపోయాడు.. అప్పుడప్పుడు  నవ్వుతూ వెర్రి వెర్రి పోజులు పెట్టి తన ఫోన్లో ఫొటోలు తీసుకుంటున్నాడు కొలీగ్.. ఇదంతా కంగాళీ గోంగూరలాగ అనిపించింది మన సుబ్బడికి.. ఇంట్లో కూడ అదే పరిస్థితి.. భార్య […]