April 23, 2024

‘దివ్య ద్విగళగీతాలు’

 రచన:నండూరి సుందరీ నాగమణి మన సినీ వినీలాకాశంలో ఎన్నెన్నో తారలు. కొన్ని తారలు తెర ముందు అద్భుతమైన  అభినయాన్ని పండిస్తే మరి కొన్ని కనిపించని తారలు ఆ అభినయానికి రాగాల వన్నెలు అద్దుతాయి. వారే నేపథ్య గాయకులు. సీరియస్ గా సాగిపోతున్న చిత్రంలో అలవోకగా మెరిసే గీతాలు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తాయనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి మనోహరమైన  పాటల గురించి ముచ్చటించుకోవటం కూడా చక్కని విషయమే కదా. ఆ రోజుల్లో మహిళా గాయనీ మణులు […]

రాగలహరి – కళ్యాణి

రచన: భారతీప్రకాష్ సంగీత, సాహిత్యాలలో భావ సౌందర్యాన్ని అనుభవించగలమే కాని, నిర్వచించలేము. అటువంటి అనుభవము అప్రయత్నంగా, సహజంగా కలిగేది. మన భారతీయ సంగీత సాంప్రదాయంలో “రాగపధ్ధతి” అనేది ఒక అద్భుతమైన లక్షణం. ప్రతీ రాగానికీ కూడా కొన్ని నిర్దుష్టమైన లక్షణాలు వుంటాయి.దానితో పాటు ప్రతీ రాగమూ కూడా కొంత ప్రత్యేకత కలిగి వాటి గుర్తింపును కలిగి వుంటాయి. ఈ ప్రత్యేకతల వలన సంగీతంలో మంచి శిక్షణ కలిగినవారు ప్రతీ రాగాన్నీ సులభంగా గుర్తించగలుగుతారు. చెవికి యింపుగా వినపడే […]

వీణ

రచన: జయలక్ష్మి అయ్యగారి వీణ  అనిన  తంత్రీ  వాద్యమని  అర్ధము.  ప్రాచీన  గ్రంధములలో  వీణను  రెండు  విధములుగా  వర్ణింపబడినది.  దైవీ  వీణ,  మానుషీ  వీణ. దైవీ  వీణ  అనగా  భగవంతునిచే  నిర్మింపబడిన  మానవ  కంఠమందుగల  స్వరపేటిక  (Larynx) అనియు, మానుషీ  వీణ  అనగా  మానవ  నిర్మితమయి, నేడు  మనం  చూస్తున్న వీణ  అని  తెలియుచున్నది. వీణ కడు ప్రాచీన  వాద్యము. వేదకాలం  నుండి  వీణ ప్రస్తావన ఉంది.  వాగ్దేవి  చేతులలో   నున్నట్లు వర్ణింపబడినది.  అందువల్లే  మనము  సరస్వతీదేవిని  […]

మాలిక పత్రిక ఫిబ్రవరి 2015 సంచికకు స్వాగతం

పాఠకులను అలరించడానికి , కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ కొత్త కొత్త రచనలకు అందిస్తున్న మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక విడుదలైంది.. ఈసారి  మరిన్ని విశేషమైన వ్యాసాలు మీకోసం అందిస్తున్నాము… వచ్చేనెల మాలిక పత్రిక ప్రత్యేక సంచికగా విడుదల అవుతోంది.. మరి ఈ నెల పత్రికలోని వ్యాసాలు, కథలు, కవితలు, పద్యాలు ఏమేమున్నాయో చూద్దాం.. 01. తంగిరాల వెంకట సుబ్బారావు (ఇంటర్వ్యూ) 02. పద్యమాలిక 5 03. పద్యమాలిక 4 04. పద్యమాలిక 3 05. RJ వంశీతో […]

శ్రీ తంగిరాల వెంకట సుబ్బారావు .

ఇంటర్వ్యూ: విశాలి “క్రోధములేని సాధువు, అకుంఠిత నైతికశీలశాలియున్, ఆధునికాంధ్రవాజ్మయ మహార్ణవనౌక, కవిత్వమాధురీ శీధుపిపాసి, మిత్రజనసింధు సరిద్వర పౌరమాసియున్, సౌధములేని రాజునకు సాంద్ర నమస్సులు తంగిరాలకున్.. ” అని గుంటూరు శేషేంద్రశర్మ గారు ప్రశంసించిన తంగిరాల సుబ్బారావు గారు ప్రసిద్ధ తెలుగు రచయిత, కర్నాటక రాజధాని బెంగళూరు విశ్వవిద్యాలయములో  వివిధ ఉన్నతమైన పదవులలో  పని చేసి రిటైర్ అయినారు. 1971 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  పి.వి. నరసింహరావు గారికి లేఖ వ్రాసి మూడు లక్షల రూపాయల గ్రాంటు […]

పద్యమాలిక – 4 (2)

  Venkata Subba Sahadevudu Gunda 1. పగలంత పిల్లలెల్లరు తెగవాడగ కంప్యుటర్ను ,తిమిరపు వేళన్ సెగబుట్టెడు మంట లెగయ బెగడెడు బామ్మ చలిఁ గాచె బిగుసుకు పోకన్!   2. అహమందు నుగ్రవాదుల దహనమ్ముల వార్త దూరదర్శని జూపన్! తుహినపు తాకిడి నోర్వక యుహుహూ యని వడకు బామ్మ యుడుకును గాచెన్!   3. త్రీడీ టీవీ యైనన్! బోడీ! సెగఁగాచునటుల పోజేలమ్మా! కూడును వండగ పదవే వేడిసెగల వంటశాల వెచ్చగ నుండున్! 4. టీవీ […]

పద్యమాలిక – 4

J K Mohana Rao   పండుగ నాఁడీ రోజవ, నెండఁగ నా కడుపు వచ్చె – నేకాదశియున్, దిండిని వదలిన బుణ్యము, దండిగఁ దిన గల్గు ముదము, – ధర్మ మ్మేమో?   మీ రథమును లాగంగా నీ రమణీకి బలము లేదు – యిది నిజము సుమా ధారిత్రియె వచ్చెఁ గదలి యౌరా యా విష్ణుమాయ – లతిశయము గదా!   రాతిరి వేసిన ముగ్గును రాతిరి వర్షమ్ము తుడువ – రథము మరుగయెన్ […]

పద్యమాలిక – 3

    VoletiSrinivasaBhanu   పాల సంద్రము మథియించు వేళయందు ఉద్భవించిన కలశాలు మూడు తెలియ ఒకటి మోహిని చేతిలో నొదిగె నాడు రెండు అమరావతినియేలె నిండు గాను   రసికరాజా యంచు రాగాలు పండించి గాన తత్త్వమెరుగు జ్ఞాని యొకడు మధువనమ్మున రాధ యెద పొంగి నర్తించు పాట నాలాపించు మేటి యొకడు శివశంకరీ యంచు అవలీల దర్బారి కానడ చిలికించు ఘనుడొకండు దునియా కె రఖ్వాలె వినుమయ్య నా బాధ అనుచు గీతంబైన యార్తి […]