April 25, 2024

జయహో మహిళా!!!

రచన: అజంతారెడ్డి..

ajanta

నాటికాలం ఆడవారిని వంటిళ్ళు దాటి బయటికి రానిచ్చేవారు కాదు

నీకు ఏమి తెలియదు నీ హద్దు ఇంతవరకే అని మర్యాదరేఖ గీసేవారు

90% ఆడవారు ఇదే మన జీవితం అని సర్దుకుపోయేవారు.

ఆడవారికి ఓర్పు ఎక్కువ ఓర్చుకునే కొద్ది వారిని వంచడం

అలవాటుగా మారింది సమాజానికి.

మెల్లిగా ఆడవాళ్ళు కూడా ఆలోచించడం నేర్చుకున్నారు

తమ ముందు తరాల ఆడపిల్లలు తమలా అణగద్రొక్కబడకూడదు

అన్న మంచి ఉద్దేశంతో చదివించటం మొదలుపెట్టారు.

వంటిళ్ళు దాటి పదుగురిలోకి అడుగుపెట్టారు, వచ్చిన అవకాశం

అందిపుచ్చుకున్నారు చంద్రమండలం వరకు వెళ్ళొచ్చారు

అన్నిరంగాల్లోను మగవారికి తీసిపోము అని నిరూపించుకున్నారు.

చదువుల్లో ఎక్కువశాతం ఆడపిల్లలే ఉన్నారు ఉత్తీర్ణత శాతం కూడా ఎక్కువే

మహిళలు మరో అడుగు ముందుకేసి ఇటు ఇంటిని , పిల్లలను చూసుకుంటూనే

ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటగెలిచి రచ్చగెలుస్తున్నారు ఎవరికి నచ్చిన రంగంలో వారు పనిచేస్తున్నారు.

ఎదురుదెబ్బలు తగిలినప్పుడు , అవమానాలు ఎదురైనప్పుడు

కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో పోరాడుతున్నారు.

ఇంటా బయటా విజయాలను పొందుతున్నారు. వారి దైర్యానికి

ప్రోత్సహం ఇచ్చేవారు చాల కొంతమంది ఉన్నారు. అడుగడుగునా

నిరాశపరిచేవారు కూడా చాలామందే ఉన్నారు. అయినా సరే వెనకడుగు

వేయకుండా నచ్చచెప్పుకుంటూ ముందడుగు వేస్తున్నారు.

వేదనలు పాలైయ్యే ఆడవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు,

వారిని ఆడుకుంటూ మేమున్నాం అంటూ చేయూతనిచ్చే

మహిళా సంఘాలు కూడా ఈనాటి మహిళలకు ఎంతో

మానసిక దైర్యాన్ని చేకూరుస్తున్నారు.

వంటిళ్ళు దాటినా మర్యాదను కోల్పోకుండా మరింత గౌరవంగా

లక్షల్లో ఒకళ్లుగా నిలుస్తూ తమకు తమచుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా

నిలుస్తున్నారు. వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఎందరో

మహిళలకు ఉపాదిని చూపిస్తూ సంగంలో మహిళ అనే పదానికి

హోదా పెంచుతున్నారు.

జయహో మాతృమూర్తి అన్న ఆప్యాయతలతో పాటుగా

జయహో ఆదర్శ మహిళా అనే నినాదాన్ని కూడా బలపరుకున్నారు

తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని సుస్థిరం చేసుకుంటూ కొందరు మగవారికి

ఈర్ష పుట్టించేలా ఉన్నతశిఖరాలను అందుకుంటున్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి మరో జన్మకు ప్రాణంపోస్తూ ఓర్పు , నేర్పులతో

ఇంటా బయట విజయాలను సాదిస్తూ ముందుకు దూసుకెళుతున్న

ప్రతి మహిళకు జేజేలు పలుకుతూ శిరస్సు వంచి వందనం చేస్తూ

5 thoughts on “జయహో మహిళా!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *