April 25, 2024

తరుణి…

చిత్రం, గేయరచన: వారణాసి నాగలక్ష్మి

 

varanasi

పల్లవి :

తరుణి నీవు సాగాలి తారాపథానికి

తేవాలి బహుమతి – ప్రమదావనికి

ప్రథమ బహుమతీ  – భరతావనికి   //

 

చరణం  1.

సృజన నీకు సహజ గుణం, సహన శక్తి నీకు ఆభరణం

క్షమాగుణం దయాగుణం కలబోసిన వ్యక్తిత్వం

జోహారు జననీ జోతలివే మహిళామణి

జగతి లోని  అత్యుత్తమ సృష్టి నీవె , స్రష్ట నీవె !   //

2.

సద్గుణాలు కారాదు నీ ప్రగతికి ఆటంకం

కాకూడదు కరుణ నీ ఎదుగుదలకు అవరోధం

సహజమైన ఔన్నత్యం కారాదు అబలత్వం

బలహీనత కానీయకు, నీదైన సుగుణధనం        //

3.

అఖండమైన శక్తివమ్మ అబలవు కానేకావు

అతివ నీవు అంతులేని ఆత్మ విశ్వాసానివి

ఎంచుకో గమ్యాన్ని అందుకో అంబరాన్ని

చేష్టలుడిగి వీక్షించగ నిఖిలజగతి నిన్నుగని    //

4.

భారత కోకిలవు సరస్వతీ పుత్రికవు

దుష్టుల పాలిట నువ్వు కాళికవు చండికవు

పదవి ఏదైనా నువ్వు ప్రతిభతో నడిపేవు

ప్రగతి శీలవై మహిళల ప్రతిష్టనే పెంచేవు   //

5.

బిడ్డల శిక్షణలో భరతావని రక్షణలో

సంగీతం సాహిత్యం వైద్యమూ వాణిజ్యం

ఏ రంగమందైనా ఏ శాఖలోనైనా

నీ ప్రతిభ అసమానం, హద్దు నీకు ఆకాశం  //

7 thoughts on “తరుణి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *