March 29, 2024

మాలిక పత్రిక ఏఫ్రిల్ 2015 సంచికకు స్వాగతం

   Jyothivalaboju Chief Editor and Content Head పాఠకుల ఆదరాభిమానాలతో మరిన్ని ఆకర్షణీయమైన, పఠనీయమైన వేర్వేరు అంశాల మీద రాయబడిన రచనలను మీకోసం అందిస్తోంది మాలిక పత్రిక. ఈ నెలనుండి మాలిక పత్రికలో నాలుగు విభిన్నమైన సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి.  మరిన్ని కొత్త ప్రయోగాలకు మాలిక పత్రిక ఎప్పుడు ఆహ్వానిస్తుంది. మీరు రాయాలనుకుంటున్నారా? రాయండి.  ఈ చిరునామాకు పంపండి. editor@maalika.org ఈ నెల విశేషాలు: 00.  మండా సుధారాణి   01. ధీర 2 02. అంతా […]

మండా సుధారాణి

రచన, ఇంటర్వ్యూ: విశాలి పెరి శ్రీమతి మండా సుధా రాణి గారు..  ఇప్పటి సంగీత విదుషీమణులలో అగ్రగణ్యురాలు. పల్లవి పాడటంలో ప్రవీణురాలు.  ప్రస్తుతం విశాఖలో ఎందరో సంగీత అభ్యాసకులకు మార్గదర్శిగా ఉంటున్నారు. ఈవిడ 1964 లో విజయనగరం లో శ్రీమతి కల్యాణి, రమణ మూర్తి గార్ల దంపతులకు ఆ వీణాపాణి సరస్వతీదేవి పుట్టినరోజుగా చెప్పబడుతొన్న వసంత పంచమి నాడు జన్మించారు. విజయనగరం మహరాజా కాలేజి నుండి బి.ఎస్.సి. పట్టభద్రులైనారు. ఆ తరువాత  ఆంధ్ర యూనివర్సిటిలో సంగీత డిప్లమా […]

ధీర – 2 (కళ్యాణి)

ప్రభుత్వం వారో, లేదా మరే ఇతర సంస్థ వారో అవార్డులు, రివార్డులు ఇచ్చి సన్మానిస్తేనే గొప్పవారు అవుతారా? పేపర్లూ, పత్రికలూ వారి గురించి రాస్తేనే ప్రముఖులా? సఫలత కి కొలమానం ఏమిటి? మనలో ఒకరుగా కనిపిస్తూ, సామాన్యంగా అనిపిస్తూనే తమ పరిధిలో విజేతలుగా నిలిచిన మహిళలందరూ ధీరలే కదా!. అలాంటి మరొక మహిళ గురించి ఈ నెల ‘ధీర’ లో ఆమె కోడలు సుభద్ర మాటల్లో తెలుసుకుందాం. పుట్టినది కోనసీమలోని అందమైన చిన్న గ్రామం. నెమ్మదిగా సాగే […]

అంతా రామమయం….

రచన: నండూరి సుందరీ నాగమణి ప్రకృతి మాత వసంతపు వలువలను ధరించింది… నిండుగా పూచిన గున్నమావి వేదికపై, కోకిలమ్మ గాయని కూర్చుని, పంచమ స్వరంతో గానకచేరీ ఆలపిస్తోంది… ఈ సంతోష సంబరాలు ఎందుకంటారా? ఇందుకే…   చైత్ర శుద్ధ నవమి! శ్రీ రామ నవమి…పునర్వసు నక్షత్ర లగ్నమున  దశరథ తనయుడై రామచంద్రుడు ఇనవంశాంబుధిలో ఉదయించిన పవిత్రమైన పర్వదినం ఈనాడే… కోదండ రాముడు, కౌసల్యా తనయుడు సీతను చేపట్టి, సీతారాముడైన శుభదినం కూడా ఈనాడే… అందుకనే వాడవాడలా పందిళ్ళు, […]

అంతిమం (నవల) 1

రచన: రామా చంద్రమౌళి         ప్రవేశిక: ప్రేమ తత్వాన్ని ఔత్సాహిక, పరిణత దశలతో పోలుస్తూ. .  నిజమైన ప్రేమ లోతును తెలియజేస్తూ ‘ నువ్వు నాకు కావాలి కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ‘ దశనుండి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు కావాలి ‘ స్థితివరకు ఎదగమని ప్రఖ్యాత జర్మన్ మానసిక శాస్త్రవేత్త ఎరిక్ ఫ్రాం అన్నాడు. ఔను. . ప్రేమ అగ్ని. . హిమాగ్ని. . అదృశ్యంగా దహిస్తూ వ్యాపిస్తూ ఆక్రమిస్తూ […]

చిగురాకు రెపరెపలు – 2

రచన: మన్నెం శారద   ఈ ఉదంతం ఏ మీడియా సహాయం లేకుండా చుట్టాలందరికీ తెలిసి పోయింది. అందుకోసం తెల్లారగానే “అక్కా” అంటూ వచ్చి మా దొడ్డమ్మ దగ్గర కాఫీ తాగి ఊళ్ళో కబుర్లన్ని మోసుకొచ్చే మా ఎదురింటి అప్పారావు మావయ్య కష్టపడి సైకిల్ తొక్కి మరీ చెప్పొచ్చేడు. అతను ఎలాంటి చుట్టమో- లేదా ఇరుగింటివారో మాకిప్పటికీ తెలియదు. ఆయన ఫైరాఫీసులో పని చేసేవాడు. అప్పుడిలా చీటికి మాటికి అగ్నిప్రమాదాలు లేవుకదా! అందుకని కాళ్లు బార జాపుకుని […]

మాయానగరం : 13

రచన: భువనచంద్ర   మనుషులు ఎందుకు తగుతారు? జీవితంలో ఓటమి భరించలేకా? అది ఎటువంటి ఓటమైనా కావచ్చు.. తాగినంత మాత్రాన ఓటమి గెలుపుగా మారుతుందా? ఆలోచిస్తోంది మిసెస్ మాధవి రావు. తాగుడు వల్లే గుడిసెలో, సిటీలో జనాలు శలభాల్లా రాలిపోయారని తెలుసు. కానీ దాన్ని ‘కలరా ‘ కి ముడిపెట్టారు. అన్నీ వున్న సుందరీబాయ్ ఇక్కడకి వచ్చి మరీ ఇంత చిత్తుగా ఎందుకు తాగింది? ప్లాష్ బాక్ అంతా మళ్ళీ రివైండ్ అయ్యింది.   **********   […]

గౌసిప్స్!!! Dead people Don’t speak !!! 3

రచన: శ్రీసత్యగౌతమి ఎలాగయితే ఏం.. మొత్తానికి రోడ్డు దాటి స్టోర్ చేరుకుని నాలుగు మంచి నీళ్ళ బాటిల్స్ కొన్నాడు. ఆ క్షణం ఎవరో టేప్ రికార్డర్ బటన్ ప్లేయర్ ఆపేసినట్లు చెవిలో చర్చి పాట ఆగిపోయింది. స్టోర్ లో డబ్బులిచ్చి వెనుదిరిగాడు, మళ్ళీ రోడ్డు దాటాలి. ఈ లోపున వాహనాల సందడి. ఆ సందడిలో చెవిలో చర్చి పాటలు, మదిలో గుడి గంటలు ఏవీ వినబడలేదు. ఏరన్ కి క్యూరియాసిటీ….చర్చి పాట అగిందా లేక రోడ్డుమీద వాహనాల […]

వెటకారియా రొంబ కామెడియా 8

రచన: మధు అద్దంకి అమ్మలక్కలాయణం.   “కుక్కకాటు” వారింట్లో సందడి మొదలయ్యింది.. అంతా హడావుడిగా పని ఉన్నా లేకున్నా తెగ తిరిగేస్తున్నారు.. అప్పుడే ఒక ఆటో వచ్చి ఇంటి ముందాగింది..అందులోంచి ఒక భారీ శాల్తీ ఉస్సూరంటూ దిగింది.. ఆ శాల్తీ దిగంగానే ఆ ఆవరణలో ఉన్న జనాలందరు ఒక్కరు కూడ మిగలకుండా పరిగెత్తారు.. ఆటో డ్రయివర్ బిత్తరపోయాడు. ఉస్సూరంటూ దిగిన సదరు శాల్తీ పేరు “జెమ్ గాళ్” ..ఇదేంటి వెరైటీ పేరనుకుంటున్నారా.. ఆవిడకి టెంగ్లీష్ మీద మక్కువతో […]

మాలిక పదచంద్రిక ఏప్రిల్ 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి ఆఖరు తేదీ: ఏప్రిల్ 15 పంపవలసిన చిరునామా: editor@maalika.org ఆధారాలు: అడ్డం 1    ఈఏడాది మన దేశానికి రిపబ్లిక్ డే అతిధి 4    ‘లక్కు’లేని పురుగుల స్రావాల నుండి వచ్చేది .. సీలు వేయడానికి వాడేది 5    ఉప్పు తయారు చేయడం కోసం గాంధీగారు చేసిన యాత్ర 6    ఈరోజు.. తిరగేస్తే ఒక తెలుగు దినపత్రిక 8    ఆకాశము.. నాగార్జున సినిమా 10    బొమ్మనా బ్రదర్సులో తెలుగు డాల్ 11    శ్రీనివాసుడు కొలువున్న […]