April 19, 2024

మాలిక పత్రిక జూన్ 2015 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రికను ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు మనఃపూర్వక ధన్యవాదాలు. మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org ఈ నెల సంచికలోని విశేషాలు: 1. సప్త(వర్ణ) స్వరాలు 2. మనసు తెలిసిన చందురూడా 3. స్పేస్ షిప్ 4. సంతృప్తి 5. బొమ్మల పెండ్లి 6. రేలపూలు – ఓ వీక్షణం 7. చిగురాకు రెపరెపలు – 4 8. శోధన – 3 9. అంతిమం – 3 […]

సప్త(వర్ణ)స్వరాలు

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి ఉదయించే సూర్యబింబం ఎఱ్ఱని వర్ణం… గాలికి తలలూపే పంట చేలు ఆకుపచ్చని రంగు… పసుపు పూసిన గడపమీద ఎరుపు రంగు కుంకుమ బొట్లు…పచ్చని చెట్ల మధ్య పూచిన రంగురంగుల పూవులు… ఉభయ సంధ్యలలో నింగి వాకిలిలో రంగు రంగుల కెంజాయ ముగ్గులు… ఆకాశం నీలాల నింగి వన్నెలలో ఆవిష్కృతమైతే, వాన విల్లు ఏడు రంగుల చాపమై కనులకు ఎంతో ఆహ్లాదాన్ని, పరవశాన్ని కలిగిస్తుంది…ఆకుపచ్చని చిలుకకు ఎర్రని ముక్కు ఒక చక్కని […]

మనసు తెలిసిన చందురూడా ( తరాలు – అంతరాలు )

రచన: మాలాకుమార్ చేతిలోని నవలను మూసి టైం చూసుకుంది వర్ష. ఎనిమిదిన్నర కావస్తోంది. ఇంకో అరగంటలో వూరు చేరుతాము. ఆఫీస్ మానేసే అవసరం లేదు వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఎదురు సీట్ వైపు చూసింది. ఎదురు సీట్ లో వున్న అతను లాప్ టాప్ లో పని చేసుకుంటున్నాడు. ఎక్కినప్పటి నుంచీ లాప్ టాప్ లో తల దూర్చే వున్నాడు మహానుభావుడు అనుకొంది. ఇంతలో సెల్ రింగైంది. అమ్మ! “ఊ చెప్పమ్మా ” అంది. “వర్షా నేను చెప్పిన […]

”స్పేస్ షిప్ ” ( తరాలు – అంతరాలు )

రచన: శశి తన్నీరు కాలింగ్ బెల్ మీద వేలు ఉంచబోతూ లోపలి నుండి గట్టిగా వినవచ్చే మాటలకు ఆగి భర్త వైపు చూసింది పవిత్ర. అప్పటికే భాస్కర్ చెవులు శ్రద్ధగా అటు వైపు ఉంచి వింటున్నాడు. ” కుదరదు నీ సమస్య నీకు ముఖ్యం అయితే, నా సమస్య నాకు ముఖ్యం. నీ పరిష్కారం నువ్వు చూసుకోవాలి. నన్ను అడిగితే ఎలా ? ” గొంతులో కోపం మాటను వణికిస్తుంది మనస్వికి. ”అది కాదు మనూ ” […]

సంతృప్తి

రచన: కామేశ్వరీదేవి చెల్లూరి ప్రొద్దున్న పది గంటలు దాటింది. మంచి వంటపనిలో ఉన్నా, నా ఆలోచనలన్నీ లత మీదే ఉన్నాయి. మా ఇద్దరిదీ ఇంచుమించు అర్థ శతాబ్దపు స్నేహం. ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం. స్కూలుకి నడుస్తూ వెళ్ళాలంటే మా ఇద్దరికీ అరగంట పైన పట్టేది. చేతినిండా పుస్తకాలు పట్టుకుని, కబుర్లు చెప్పుకుంటూ, త్రోవలో చింత చెట్ల క్రింద చింతకాయలు ఏరుకుని తింటూ, నవ్వులతో, త్రుళ్ళింతలతో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మా లోకంలో మేము వుంటూ, […]

బొమ్మల పెండ్లి

రచన: ” ఎన్నెల” నేను మెల్లగ నడుస్తున్న. గౌను అంచు పైకి వట్టుకున్న. నోటు బుక్కు మీదున్న క్రిష్నుని బొమ్మ ఎంత గుండూరుగ కట్ జేసుకొచ్చిన్నో అండాల్ చూసి పరెషాన్ అయితది. మెల్లగ లంబడోల్ల గుట్ట మీదికి నడిచిన. ఆల్లు జాకెట్ల మీన అద్దాలు కుడతరు. గుట్ట పురాగ ఎక్కక మునుపే రెండు అద్దం ముక్కలు దొరికినయి. గౌన్ల ఏసుకొని ఆండాలోల్ల ఇంటికి నడుస్తున్న. ఒక గాజు పెంక కాలికి తలిగింది. మందు సీసాది కావొచ్చు. అది […]

‘రేల పూలు’ – ఓ వీక్షణం

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి రేల పూలు! పసుపు పచ్చని వర్ణంతో గుత్తులు గుత్తులుగా పూచి, ఆకాశం అందిస్తున్న కాసులపేర్లల్లే భూమివైపు వంగుతున్న ఈ పూలు… రేల పూలు! ఎంత బావున్నాయో కదా!! వీటిని చూస్తూంటే మనసంతా ఎంత ఆనందంతో నిండిపోతుందో… ఈ మనోహరమైన సుమాల వంటి గిరిజన తండాల గురించిన కథలే ఈ ‘రేలపూలు’ – శ్రీమతి సమ్మెట ఉమాదేవి కథాగుఛ్చం. ఈ కథలు చదువుతూ ఉంటే కూడా, అదే ఆనందం, అదే సంతృప్తి… […]

చిగురాకు రెప రెపలు – 4

రచన: మన్నెం శారద నాకు స్పృహ వచ్చేసరికి మంచమ్మీద పడుకుని వున్నాను. ఎదురుగా హరి డాక్టరు గారు. ఆయన భలే వుండేవారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. తెల్లగా పొట్టిగా గుండెల మీదకి టై చేసుకుని, తెల్లగా ఎగురుతున్న జుట్టుతో…ముఖ్యంగా ఎన్నడూ వీడని చిరునవ్వుతో.. నీరసంగా తేల్చినట్లు మాట్లాడుతూ…! మా దొడ్డమ్మ కి తరచూ కడుపు నొప్పి వచ్చేది. ఆయన మా ఫామిలీ డాక్టరు! వెంటనే మా మామయ్య లేకపోతే.. జగన్నాధపురం శివాలయానికి ఎదురుగా వున్న ఆయన […]

శోధన – 3

రచన: మాలతి దేచిరాజు ఒక మెరుపు మెరిసి మురిసినట్టు సడెన్ బ్రేక్ వేసి లిప్త కాలం చిన్న ఉద్వేగానికి లోనైంది శోధన. ఎదురుగా వైదేహి. . . సడెన్ బ్రేక్ వేసింది బ్రేక్ వేసి ఉండకపోతే రెండు వెహికల్స్ గుద్దుకుని ఉండేవి. తను పొరపాటున మూల మలుపు చూసుకోలేదు. ఎదురుగా వున్న వైదేహి వైపు చూసింది. . . చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాలని అనిపించే రూపం. వెహికల్ ఆపి స్టాండ్ వేసి వైదేహి దగ్గరికి […]

అంతిమం 3

రచన: రామా చంద్రమౌళి సుమ రమణవైపు సాలోచనగా చూచి. . ఇతనేం అమాయకుడు కాదు అనుకుంది. “స్పష్టమైన ఆలోచనలే ఉన్నాయికదా రమణా నీకు. ఇంకేం ముందుకు పోవడమే. . చెప్పు నువ్విప్పుడేమి చేయాలనుకుంటున్నావో” “ఎప్పుడు కూడా భార్య భర్త మధ్య ప్రొఫెషనల్ కాంగ్రుఎన్సీ ఉండడం అవసరం అని నేను భావిస్తా సుమా. ఒక డాక్టర్ భర్త. . డాక్టర్ భార్య. . ఏకత ఉంటుంది కదా. పరస్పరం అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కూడా. అందుకే […]