April 25, 2024

గౌసిప్స్!!! Dead people don’t speak-5

రచన:డా.శ్రీసత్య గౌతమి

ఏరన్..ఏరన్.. హలో..హలో… హలో…..
ఆ..ఆహ్… యస్.. ఐ యాం హియరింగ్… గొంతు పెగిలింది ఏరన్ కి.
ఇప్పుడు చెప్పండి ఏమి జరిగింది? అడిగింది అనైటా.
ఏరన్ మొత్తం జరిగినదంతా చెప్పాడు అనైటాకి. అనైటా ఆశ్చర్యపోయింది.
ఏరన్ ముఖం గంభీరంగా మారింది. ఎలాగైనా ఈ రహస్యాన్ని చేధించాలనే పట్టుదల కనబడింది ఆతని ముఖంలో.
“ఈ రోజు మనమిద్దరం రేడియోస్టేషన్ కి వెళ్దాం” అన్నాడు ఏదో తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా.
“మరి ఇవాళ సమాధి దగ్గరకు వెళ్దామన్నారు? “అడిగింది.
“లేదు. నిన్నటి నుండీ ఆ కుర్రాడు నాకు ఫోన్ చేస్తున్నాడు ఏదో చెబ్దామని. కానీ ఏమీ చెప్పలేదు. కేవలం చెప్పాలనుకుంటునట్లు గా మాత్రం హింట్ ఇచ్చినట్లున్నాడు” అన్నాడు ఏరన్.
అనైటా ” ఏం.. మీతో డైరక్ట్ గానే చెప్పొచ్చుగా” అంది.
అతను రేడియో స్టేషన్ కే డైరక్ట్ గా ఫోన్ చేస్తున్నాడు అంటే ఏదో వుంది. తానెక్కడ వున్నది, తనకు ఏమి జరిగినది అనే విషయం ప్రపంచానికి తెలియాలని కోరుకుంటున్నాడు. మరి తనకి ఎందుకు చేసినట్లు? అసలు నా హోటల్ ఫోన్ నెంబర్ ఎలా తెలుసు ఆ కుర్రాడికి? ఇదంతా మాయగా వుంది. అంటే ఆ కుర్రాడు చనిపోయి ఆత్మగా తిరుగుతున్నాడా? అసలు ఆత్మలు వుంటాయా? గాలిలో కలిసిపోవా? మనుష్యులతో మాట్లాడడమేమిటీ? తానేదో చెప్పాలనుకోవడమేమిటి? మనుష్యుల అడ్రస్సులు, ఫోన్ నెంబర్లు వెతికి పట్టుకుని మాట్లాడాలనుకోవడమేమిటి? ఇదంతా నిజమా?? …. ఏరన్ ని వేధించేస్తున్న ప్రశ్నలు.
అయినా ఇవేమీ అనైటాకి చెప్పలేదు. ఆమె అడిగిన ప్రశ్నకి…యస్.. డెరక్ట్ గా చెప్పొచ్చు. లోపల తనతో పాటు వేరే చాలా మంది వున్నారని, వాళ్ళు మాట్లాడనివ్వలేదని చెప్పాడుగా ఇంతకు మునుపు, మళ్ళీ అదే జరిగివుంటుంది అన్నాడు ఏరన్.
ఇక అనైటా గమ్మున అయిపోయి… సరే అని వప్పుకున్నది.
ఏరన్ ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు. ఆటోమేటిక్ గా డిటెక్టివ్ క్యాప్ నెత్తి మీదకొచ్చి చేరింది.

“ఇక్కడేదో కన్ ఫ్యూజన్ వున్నది, దాన్ని ముందు చేధిస్తే గాని ఈ కేసు ముందుకెళ్ళదు. వెంటనే తన డైరీ తీసుకున్నాడు. ఇప్పటివరకూ జరిగిందంతా ఒక స్కిమేటిక్ డయాగ్రం వేసుకున్నాడు. తనకు ఒకటి అర్ధమయినది. ఇక్కడ రెండు సెపరేట్ విషయాలు దాగి వున్నదని. ఎవరో తనని ఈ కేసు నుండి తప్పు దారి పట్టించడానికి కన్ ఫ్యూజ్ చేస్తున్నారని అర్దమయ్యింది. ఆ నెంబర్ తో రేడియో స్టేషన్ కి ఫోన్ చేస్తున్నది, అదే నెంబర్ తో తనకి ఫోన్ చేస్తున్నది ఒకరు కారు. ఇద్దరు. అందులో ఒకరుగా ఆ కుర్రాడి ఆత్మా????? అయితే తనతో మాట్లాడడానికి ప్రత్నించినది ఆత్మా? లేక రేడియో స్టేషన్ కి కాల్ చేసినది ఆత్మా? నేను రావడానికి ముందరే రేడియో స్టేషన్ కి కాల్స్ వస్తున్నవి. అంటే ఆ కాల్స్ తనకు సంబంధించినవి కావు. ఈ పాయింటు ఆ సమాధి నుండి రేడియో స్టేషన్ వరకు పరిమితం. ఇందులో తాను లేడు. ఇది అనైటా, ఎల్విన్, ఆ సమాధి అంతే.
రెండవ విషయం… నేను వచ్చాక. అనైటా, రూబి, నేను, అమాండా (?). హుం.. అమాండా ఇప్పటి వరకూ తెలియదు. ఈ రెండు విషయాలకి కామన్ గా వున్నది అనైటా. అనైటా చెప్పిన సమాధి స్టోరీ ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తున్నది. ఆత్మలు వుంటాయో లేవో తెలియదు, అవి మనుష్యులతో మాట్లాడతాయో లేదో తెలియదు గానీ… ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద సీక్రెట్ ఏదో వుంది. అది తాను చేధించాలి! యస్.. థేర్ ఈస్ ఎ సీక్రెట్ బిహైండ్ ఆల్ థిస్ !!!!” అనుకొని సీరియస్ గా ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
తీసుకోవాల్సిన స్టెప్పులన్నీఅ గబ గబా డైరీలో వ్రాసుకున్నాడు.
1. ఆత్మల గురించి కొంచెం చదవాలి, ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి.
2. అమాండా
3. అనైటా ఎవరు? ఎందుకు ఈ story ని follow చేస్తున్నది?
4. కుర్రాడి సమాధి, వాడి పుట్టుపూర్వోత్తరాలు
5. అమాండా, రూబీని కలిసింది. గత 12 గంటల పైగా హోటల్ లో నే వున్నాను. నా వివరాలు అడిగి తెలుసుకున్న అమాండా, నన్ను కులుసుకో ప్రయత్నం ఎందుకు చెయ్యలేదు?
6. అసలీ కుర్రాడి కేసుకి, అమాండాకి ఏదైనా సంబంధం వున్నదా?
7. ఈ కేసు వెనుక ఇంకెవరెవరు వున్నారు?
8. దీన్ని ఎక్కడి నుండి మొదలెట్టాలి? ఎవరితో మొదలెట్టాలి?
ఆలోచన.. ఆలోచన… ఆలోచన…
ఓకే.. సమాధి నుండి మొదలెడదాం !!!

******************

వెంటనే అనైటాకి కాల్ చేశాడు.
“హలో”… అనైటా గొంతు.
అనైటా…నేను ఏరన్ ని.
యస్.. చెప్పండి. అనైటా అన్నది.
ఏమి లేదు. ఇవాళ నేను నీతో రేడియో స్టేషన్ కి రాబోవడం లేదు. ఎందుకంటే.. నేను అమాండా కి అప్పాయిన్మెంట్ ఇచ్చాను. తనని వేరే ప్లేస్ లో కలవ బోతున్నాను. తానేదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటున్నది. అది ఏవిటో నాకు ఇంకా చెప్పలేదు.
ఈ కేసు కి ఆమె చెప్పబోయే విషయానికి ఏదైనా లింకు ఉన్నదంటారా? అడిగింది అనైటా.
అస్సలు తెలియదు. తానెవరో కూడా నాకు తెలియదు అన్నాడు ఏరన్.
ఓకె.. వెళ్ళండయితే అంది అనైటా.
మరి… ఇవాళ ఆ కుర్రాడు రేదియో స్టేషన్ కి కాల్ చేస్తాడంటారా? ఏరన్ అడిగాడు.
ఏమో… నాకు తెలియదు. ఇవాళ తానేమైనా వివరాలు చెప్పాలనుకుంటున్నాడో లేదో… అనైటా డౌట్ ని వ్యక్తపరిచింది.
ఏరన్ ఫోన్ పెట్టేశాడు. ఇక ఆలోచనలో పడ్డాడు. ఓకె.. అనైటాకి అబద్దం చెప్పాడు అమాండాని కలుస్తున్నానని. ఇప్పుడు తాను చేయాల్సిన పని, సమాధి మీద ఒక కన్ను వేసి వుంచడం. తనతో తెచ్చుకున్న లాప్ టాప్ ని తీసుకొని, రేడియో స్టేషన్ ప్రక్కన వున్న మెడికల్ షాప్ లో కూర్చోవడం.. గూగుల్ ఎర్త్ మ్యాప్ ద్వారా ఆ స్మాధి చుట్టూ ఏదైనా యాక్టివిటీ జరుగుతున్నదేమో జాగ్రత్తగా గమనించడం తాను చేయవలసిన మొదటి పని. దీనికి అనైటా వుండ కూడదు. తానే తెలుసుకోవాలి. కొంతవరకూ ఈ విషయాలను తనకు తాను గా తెలుసుకుంటే తప్ప.. ….ఎవరినీ నమ్మ లేని పరిస్థితి!!!
దీనికి ముందు తాను చెయ్యవలసిన్ పని.. ఆత్మల గురించి ఇంటెర్ నెట్ లో కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. గూగుల్ సెర్చ్ లో… “ఆత్మలు ఉన్నాయా?” అని టైప్ చేశాడు. వెంటనే ఒక క్రొత్త విండో ఓపెన్ అయ్యింది. రక రకాల విషయాలు కనిపించాయి. వాటిలో ఆకర్షణీయమైన టైటిల్ ” Life after death”.
చనిపోయాక కూడా మళ్ళీ లైఫా? తప్పకుండా చదివి తీరాలి అని నిర్ణయించుకున్నాడు. ఎలాగూ… తనకు ఇంకా రెండు గంటలు టైం వున్నది బయలుదేరడానికి… రేడియో స్టేషన్ ప్రక్కన మెడికల్ షాప్ లో కూర్చోవడానికి. అది 24 గంటలు ఓపెన్ వుంటుంది ఎలాగూ.
ఇక Life after death చదవడం మొదలు పెట్టాడు.

******************

మనిషి యొక్క భౌతిక శరీరం లోపల ఆత్మ, దాని చుట్టూ కొన్ని కీలకమైన శక్తులను ఆవరించుకొని వుంటాయనీ, మనిషి చనిపోయి భౌతిక కాయం మట్టిలో కలిసిపోయాక ఆ ఆత్మ ఆ కీలక శక్తులతో మిగిలి వుంటుందని చదివి ఆశ్చర్యపోయాడు. ఆ కీలక శక్తులతో ఆత్మకు లైఫ్ వుందా? అని మరింత ఆశ్చర్యం తో ఉత్సాహం తో చదవడం మొదలెట్టాడు.
మనిషి భౌతిక శరీరంలోపల ఆత్మ, బయట మొదటి తొడుగులా చుట్టూ వైటల్ ఎనర్జీ ఆవరించుకొని వుంటుంది. దాని చుట్టూరా అతీంద్రియ శక్తి (భావాలు, భావోద్వేగాలు, కోరికలను కలిగివున్న ఎనర్జీ), దాని చుట్టూ వుండే పొర మానసిక సామర్ధ్యము, ఆ పై సూక్ష్మ శరీరము అనే పొర ఆవరించబడివుంటుంది. ఒకసారి మనిషి చనిపోయాక అతని భౌతిక శరీరము ఆత్మ నుండి, దాని చుట్టూ ఆవరించుకొని వున్న కీలక శక్తుల నుండి వేరుపడి రిలాక్స్ అయిపోతుంది, భూమిలో కలిసిపోతుంది. కానీ దాని ఆత్మ, చుట్టూ ఆవరించుకొనివున్న పొరలన్నీ శాశ్వతం గా మిగిలే వుంటాయి. మరొక శరీరం దొరికాక, ఆ ఆత్మ ఈ తొడుగులతో క్రొత్త శరీరం లోకి ప్రవేశిస్తుందట. ఆ క్రొత్త శరీరం దొరికేవరకు ఈ తొడుగులన్నీ కలిగివున్న ఆత్మ గాలిలో మిగిలేవుంటుంది. ఇది చదివాక ఏరన్ అవాక్కయిపోయాడు. మరి ఆత్మ తన చుట్టూ వున్న ఎనర్జీస్ ని వుపయోగించి మాట్లాడుతుందా? ఇంకా కొన్ని పనులు చెయ్యగలదా? భౌతిక శరీరం లేకుండా ఎక్కడినుండి, ఎటువంటి సహాయాలు తీసుకోగలదు? ఎలా తను అనుకున్న పనులు చెయ్యగలదు? … ఏరన్ కు ఆలోచనలన్నీ ఈగల్లా ముసురుకుంటున్నాయి!

4 thoughts on “గౌసిప్స్!!! Dead people don’t speak-5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *