రచన: క్రిష్ణ వేణి, ఢిల్లీ.

kvc

“నాన్నగారు”- ఈ రోజే అని కాదు, ఆయన నాకు గుర్తు రానిదెప్పుడు! ఆడపిల్లలకి సహజంగానే తల్లికన్నా తండి వద్దే చేరిక ఎక్కువ. నేనూ మినహాయింపేమీ కాదు.
నాన్నగారు ఫిసిక్స్ రంగంలో ఉండేవారు. ఆయన ప్రభావం ఇప్పటికీ నామీద చాలా ఉంది. ఆయననుండి అంది పుచ్చుకున్న నా రంగుతో సహా, ఆయననుంచి పుణికి పుచ్చుకున్న లక్షణాలూ, అలవాట్లూ చాలానే ఉన్నాయి. న్యూమరికల్స్ అంటే ప్రాణంగా ఉండేదప్పుడు నాకు. 11వ తరగతిలో డిస్టింక్షన్ తెచ్చుకున్నది కూడా ఇంగ్లీష్తో పాటు ఫిసిక్స్‌లోనే. అది బహుశా నాన్నగారే మీదేకాక ఆయన సబ్జెక్ట్ మీద ఉన్న అభిమానం వల్లేనేమో అనిపిస్తుందిప్పుడు.

ఆయనకి పక్కనే ఉన్న కూరల మార్కెట్కి వెళ్ళి సలాడ్ కోసం అని తాజా కూరలు తెచ్చే అలవాటుండేది. పక్కనే సంచీ పుచ్చుకుని నడిచే అసిస్టెంట్ని నేనే అని చెప్పక్కరలేదు కదా! తమ్ముళ్ళు ఆయనతో నా అంత చనువుగా ఉండేవారు కారు.

భేషజం అంటే అర్థం కూడా తెలియని మనిషి నాన్నగారు. ఎదురుగా కనిపించిన ఉతికి, ఇస్త్రీ చేసిన బట్టలేవో వేసుకునేవారు తప్ప “ఈ సందర్భానికి ఇవి బాగుంటాయి” అని అనుకోగా నాకెప్పుడూ గుర్తు లేదు. ఎవరు ఏ సహాయం కావాలన్నా చేతనైనంతకన్నా ఎక్కువగానే చేసే అలవాటు.

ఆయనకి చదరంగం అంటే మహా ప్రీతి. నా చిన్నప్పుడు మేము కరోల్ బాగ్లో ‘దేవ్ నగర్’ అనే ప్రాంతంలో ఉండేవాళ్ళం. అప్పుడు చుట్టుపక్కల తెలుగు కుటుంబాలు చాలానే ఉండేవి. సాయంత్రం ఎవరో ఒకరు “ఒక ఎత్తు వేద్దామా స్వామిగారూ” అంటూ రావడం, అప్పటికే చదరంగం బోర్డ్ తయారుగా ఉండటం కూడా జరిగిపోయేవి. ఎత్తులకి పైఎత్తులూ, వాటితోపాటు అమ్మ కాఫీ సప్లై కూడా సాగుతూనే ఉండేవి సాయంత్రాలు.

ఒక రోజనుకుంటాను. ఆయన పార్ట్‌నర్లెవరూ రాలేదు. నాన్నగారు చిరాకుపడుతూ పచార్లు చేస్తున్నారు. హటాత్తుగా ఏదో తోచినట్టు ఆగి, “వేణూ, చదరంగం నేర్చుకోవాలి తల్లీ, అది మెదడుని షార్ప్ గా ఉంచుతుంది” అంటూ కిందకి ఆటలకి వెళ్ళబోతున్న నన్ను కాస్తా ఆపి, బల్లకి అటూ ఇటూ వేసి ఉన్న కుర్చీల్లో ఒకదాన్లో కూలేసేరు. ఆట ఆడడం నాకు కొత్తేమో కానీ ప్రాధమిక ఎత్తులూ వాటినీ రోజూ గమనించే నాకు, మూవ్స్ కొత్తేమీ కాదు. అలా ప్రారంభం అయింది నా చదరంగపు ప్రస్థానం. ఆ రోజు మొదలుకొని- ఎవరొచ్చినా, రాకపోయినా, టైమవగానే ఠంచనుగా మేమిద్దరం మొదలుపెట్టేసేవారిమి. తరువాత వచ్చిన వాళ్ళకి మాత్రం నాన్నగారు “ఇదిగో, ఇప్పుడే అయిపోయింది రామారావుగారూ(లేకపోతే ఇంకే ‘మూర్తిగారో’), మరో ఎత్తు వేసుకుందాం” అంటూ ఇంటికొచ్చిన అతిథులని పట్టించుకోకుండా నాతో కలిపి ఆటలో ములిగిపోయేవారు.

కాకపోతే ఒక తంటా మాత్రం ఎదురయింది. మొదటమొదట్లో అయితే అరగంటలో నా ఆట కట్టు అయేది కానీ తరువాత్తరువాత నేనూ అలవాటు పడ్డాక, ఆట మూడు రోజులు కూడా సాగేదే. మరి నేను రోజూ గల్లీలో ఆడుకుంటూ ఉండే ఆటలూ నాకంత ప్రియమైనవే కదా! అప్పటికే నా స్నేహితులందరూ కిందనుంచి పేరు పెట్టి పిలిచీ, ఈల వేసీ, బాల్కనీలోకి కంకరరాళ్ళు విసిరీ నన్ను కిందకి రమ్మన్న హెచ్చరికలు పంపుతూనే ఉండేవాళ్ళు. “ఆటల్లేకపోతే బతకలేరా ఏమిటి మీరూ” అని విసుక్కుంటూనే “నువ్వు వెళ్ళి రామ్మా, ఇదిగో గోపాలం గారొస్తారుగా! మనం మళ్ళీ రాత్రి ఒక ఎత్తు వేసుకుందాంలే” అని అనుమతిచ్చేవారు. అదేదో చదరంగం లేకపోతే ఈయన ఉండగలిగేటట్టు. నేను పోయి హాయిగా లంగడీ టాంగ్, ఖో ఖో –ఇలాంటి ఆటల్లో పడేదాన్ని.

నా పదకొండో తరగతి బోర్డ్ పరీక్షల్లో నా పరీక్ష సెంటర్ ఇంటికి 30—35 కి.మీటర్ల దూరంలో పడింది. అప్పుడు మాత్రం అమ్మకీ నాన్నగారికీ పెద్ద వాదనే జరిగింది. “ఆడపిల్ల, వెళ్ళి దించి రావొచ్చుగా” అన్నది అమ్మ వాదనైతే, “ఆడపిల్లా, ఆడపిల్లా అంటూ దాన్ని వట్టి పనికిమాలినదానిగా చేయకు. నువ్వు నీ వనితా మండలి మీటింగులంటూ అంత దూరమూ వెళ్ళగలవూ? దాన్ని మాత్రం చేతకానిదానిగా తయారు చేస్తావా ఏమిటి? ఆడపిల్లేమిటీ, మొగపిల్లాడేమిటీ? అందరూ అన్ని పనులూ చేయగలగాలి. నోరుంది. బస్సుకి డబ్బులు ఉన్నాయి. అయినా స్కూల్ అయిపోయిన తరువాత స్నేహితులతో కనాట్ ప్లేస్ వెళ్ళి ఐస్ క్రీములూ, సమోసాలు తినే వస్తుంది. దానికేమైనా ఊరు కొత్తా? అంతగా కావాలంటే ఒకరోజు ముందెళ్ళి ఆ సెంటరెక్కడ ఉందో కనుక్కుంటుందిలే” అన్నది ఆయన సమాధానం.

వేసవి సెలవుల్లో మా ఇద్దరి తాతగార్ల ఇంటికీ వెళ్ళేవాళ్ళం. మాతామహులైతే “పూర్ణా (మా అమ్మ), నీ కూతురికి కొంచం గొంతు తగ్గించి, అరవకుండా ఆడటం నేర్పించు. క్లినిక్కొచ్చే పేషంట్లందరికీ వేణు గొంతే వినపడుతోంది. ఏమిటో స్వామి- మరీ మగరాయుడిలాగా తయారు చేసేడు దీన్ని!” అంటూ గొణుక్కునేవారు. అప్పుడు నాకు మహా అయితే పన్నెండేళ్ళుంటాయేమో!

సరే, ఇంతకీ చెప్పొచ్చేదేమంటే- నాన్నగారికి లౌక్యం అంటే ఏమిటో కూడా తెలియదు. పోణమి లేదు. అబద్ధం చెప్పడం రాదు. అవినీతికి పాల్పడలేదు. పెద్దా, చిన్నా-హోదా ఎరగరు. కానీ, “స్వామిగారా! మహానుభావులు. ఆయన సంగతే వేరు” అన్న పేరు మాత్రం తెచ్చుకున్నవారు. అందుకే ఆయన ఆకస్మిక మరణం తరువాత పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు లెక్కపెట్టలేనంతమంది.

ఇప్పుడాయన మరణానికి వస్తే…

నాన్నగారు 58 సంవత్సరాల వయస్సులో రిటైర్ అయి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిట్లో కన్సల్టెంటుగా చేరేరు. హటాత్తుగా సెప్టెంబర్లో ఆయన ఆకలి మందగించడం ప్రారంభించింది. నాన్నగారు ఆరోగ్యకరమైన భోజనం చేసేవారు. రోజుకి –ఆరేడు కిలోమీటర్లు సునాయాసంగా నడిచేవారు. ‘సరే’ అని ఆయన్ని శ్రీ గంగారాం హాస్పిటల్‌కి తీసుకు వెళ్తే కొన్ని టెస్టులు చేయాలనడంతో, అమ్మ ఇంటికి వచ్చి బట్టలూ అవీ పట్టికెళ్ళింది. నేనప్పటికి ఎయిర్ పోర్టులో పని చేస్తూ ఉండాలి. ఆయనక్కడ పది రోజులున్నారు. దినదినం క్షీణించిపోవడం ప్రారంభించేరు. ఏ టెస్టులూ ఏ రిసల్టులూ చూపించలేకపోయేయి.

ఇంక లాభం లేదనుకుని శ్రీ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో చేర్చేం. అక్కడా అన్ని టెస్టులూ అయేయి. వైద్యపరంగా చూస్తే ఏ లోటూ లేదు. ఆఖరికి డాక్టర్లకి అయోమయం, ఇంట్లో అందరికీ బెంగా.

అప్పుడు దూరపు బంధువులైన డాక్టర్ గోపీనాథ్ AIMS లో చేర్పించమనీ తనే కేస్ జాగ్రత్తగా చూసుకుంటాననీ అనడంతో మళ్ళీ హాస్పిటల్ మార్చేం. ఈ హాస్పిటళ్ళు మారడానికి సహాయం చేసిన నాన్నగారి స్నేహితుల లిస్టేమీ చిన్నది కాదు. రోజుకి కనీసం పదిమందైనా ఆయన్ని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చేవారు. నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకీ దిగజారడం మాత్రం తగ్గలేదు.

ఒక వారం రోజులు నేనాయన్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళలేకపోయేను. పది రోజులు సెలవుపెట్టి అమ్మని ఇంటికి పంపించి, నాన్నగారి వద్దే ఉందామని బట్టలూ అవీ సర్దుకున్నాను. అక్కడికి వెళ్ళి నాన్నగారిని చూసినప్పుడు గుండె చెరువే అయింది. అంత నీరసంగా పడుక్కుని ఉన్నారు.

నాన్న గారి కళ్ళల్లో నన్ను చూడగనే వెలుగు కనిపించింది. నేను పక్కనున్న పాలు తీసుకుని నాన్నగారి తలని నా చేత్తో ఎత్తి పట్టి స్పూన్ తో తాగించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక చుక్క తాగగానే ఆయన సరిగ్గానే అయిపోయారన్న సంతృప్తితో, అమ్మ నిశ్చింత గా టీ తాగడానికి వెళ్ళింది కింద అంతస్ఠుకి.

నాన్నగారు నీరసం గా వున్న చూపుడు వేలుతో గోడపై మూడో అంకె రాయడానికి ప్రత్నిస్తూ, “టైం ఎంతయింది” అంటూ సైగ చేస్తున్నారు. “ఎందుకు నాన్నగారూ?” అనడిగితే తన మణికట్టు చూపించి సరిగ్గా మూడు గంటలకి తన ప్రాణం పోతుందని పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి మూడు స్పూన్స్ తరువాత ఆయన్ పాలు మింగడం లేదనీ, అవి నోట్లోకి వెళ్ళడం లేదనీ గమనించి, ఆయన్ని కుదిపేను. చలనం లేదు. బెల్ కొట్టగానే డాక్టర్ వచ్చి నన్ను వెళ్ళి బయటవుండమన్నారు. కొంతసేపటికి తరువాత డాక్టర్ గదిలోంచి వచ్చి ‘నాన్నగారు పోయారని’ చెప్పారు. మా అమ్మ కాఫిటీరియా నుండి తిరిగి వస్తూ నన్ను దూరం నుండే చూసి సంగతి అర్ధం చేసుకుని, వరండాలోనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. “ఏ వైద్యపరమైన కారణాలూ లేకుండానే నాన్నగారు పోయారనీ, అది కూడా సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకే’ అనీ రిపోర్ట్ లో రాసారు. మరి అదాయన మూఢ నమ్మకమో, తనెప్పుడు పోతానో అని ఆయనకి ఎలా తెలిసిందో అన్నది ఇప్పటికీ అర్ధం కాదు. కానీ అఖరి నిముషం లో ఇన్నేళ్ళు కాపురం చేసిన తను దగ్గిర లేకపోవడం ఏమిటో, నా చేతుల్లో నాన్న గారు ప్రాణం విడవడం ఎందుకో అని అమ్మ ఇప్పటికీ బాధ పడుతూనే ఉంది.

నాకు మాత్రం మా నాన్నగారు మాతో లేరన్న ఊహే కలగదు. నేనే తప్పటడుగూ వేయకుండా చూస్తూ, ఆయన నా మనస్సులో ఇప్పటికీ సజీవంగానే ఉన్నారనిపిస్తుంది.

By

59 thoughts on “నాన్నగారు!!! నా డైరీ లో ఒక పేజీ….”
 1. Sorry to note that you lost him at his 58. That is too young age for him. It is very hard to loose father at young age. I lost my father at the age of 3. I dont have any memories.. A vague memory of his dead body on a table in a photo with garlands. He went to see Lalbahadoor sastry during 1965 December at rajahmundry and gave war fund he collected from his area of schools. After coming back he got a fever and died in two days. Later they identified it as Brain fever (medaDu vaapu vyaadhi)..which kills in 3 days a healthy person. Did you find out what was the disease which killed your Dad. BTW I am a physicist (Physics Ph D) and I love chess. Your father is great. I am 56 but I dont know how long but I am sure that I do not cross 68. means just 12 more years to go. THanks for sharing a very heart touching experience. You are lucky to serve him. I did not even serve to my mom at her last minutes. I went after everything is over just to perform final rites. It took a long long time to recover from that loss. It is very hard. I am sure that you also might have faced it hard to overcome that sad memory

  1. That is fine. Nothing to worry much about. After all, he lived his life and fulfilled his duties. With time- memories dim and the intensity of the pain diminishes.
   I feel that after a certain age ( not at 58 or 59 which was in my father’s case) it is better to go rather be a burden on children in old age. I may sound cruel alright.
   At least, I would not live after a certain age myself. What use will I be to anyone then?
   Having said that, not having a father in one’s formative years is bad. I can empathize with you.
   As about your Mom, that is really sad. But then what happens always does for a reason.
   Thanks a lot for such a nice comment.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *