April 24, 2024

మాలిక పదచంద్రిక – జులై 2015

కూర్పరి: సత్యసాయి కొవ్వలి
సమాధానాలు పంపించడానికి ఆఖరు తేదీ: 25 ఆగస్టు
సమాధానాలు పంపించడానికి చిరునామా: editor@maalika.org

padachandrika august 15

అడ్డం ఆధారాలు
1. ప్రజల రాష్ట్రపతిగా కొనియాడబడ్డ వ్యక్తి ..
4. వెనుతిరిగిన గూని
5. 1 అడ్డం లోని చివరి రెండక్షరాలలాగే.. కానీ రాత పరికరం
6. పెరుమాళ్ళకి మాత్రమే తెలిసిన రహస్యం
8. అందమైన పద్య వృత్తం.. పేరుబట్టి చూస్తే తప్ప దురదుండదు
9. లక్ష్మీదేవి.. ఒక్క అక్షరంలో
10. ఇలా ఆజ్ఞాపిస్తే ఆగిపోవలసినదే
12. తాటాకులు కప్పు ఉన్న యిల్లు
14. రామారావు సినిమా.. కలాంగారి మిస్సైలున్న రాముడు
16. రావణుడి ఊరు
19. కలాం గారి స్వంత ఊరు
20. కలాం గారి పేరులో భాగం.. అ తో మొదలు
22. ప్రింటింగు పద్ధతుల్లో ఒకటి.. సెట్ అవుతుందిగా
23. ప్రేమ వ్యవహారం .. ఆంగ్లంలో
24. ఆత్రం.. ఆబర్గర్ లో ఉండేది
26. ప్రపంచ ప్రసిధ్ధ క్రికెట్ స్టేడియం
27. అతిగా మాటాడక పోయినా కూడా అమ్మాయే
29. 19 అడ్డం వెళ్ళినా కూడా తప్పనిది
31. ధర్మరాజుని సంబోధించడం ఇలాగే
33. గుడిలో మోగేది
34. ఇప్పుడు నడుస్తున్న యుగం

నిలువు ఆధారాలు
1. పాతకాలంలో రేడియోలో తెలుగు వార్తలు చదివిన నాగేశ్వరరావు ఇంటిపేరు
2. మాయాజాలం లాంటి విద్య.. కని ఆశ్చర్యపోతాం అలాఆ కట్టు కుంటాడు మాయలోడు
3. తోక.. లాంగుగా ఉంటుందని అలా అంటారా
6. ప్రపంచం
7. మలద్వారం
10. అఆ లు .. దిగువ క్రమంలో
11. అగ్గిమీద ఇది అవడం అంటే కోపంతో చిందులు తొక్కడం అని
12. సర్పం
13. ఇది ఉండేది జానెడు. కానీ దాన్ని నింపడానికి మనం వేసేవి బహుకృతవేషాలు
15. రండి రండి రండి. తమరి – – మాకెంతో సంతోషం సుమండీ
17. బొంబాయి రవ్వతో చేసే మరాఠీ స్వీటు
18. సంగీతంలో ఉండేవి ఏడు.. వాటిలో ఏదైనా ఒకటి
20. కలాం గారి మిస్సైల్ పేరు
21. కలాం గారి ఆంగ్ల ఆత్మకధ పేరు
23. ఆంగ్ల ప్రేమ పక్షులు
24. తెల్లదనం కోసం అలా వాడేది.
25. భీతి
27. అశ్వాన్ని వాడి చేసేయాగం
28. మి తిలేని తిమిరం
29. బాణంతో సాటి వచ్చే వేగం
30. బాబాల కుమారుడు
32. కర్త, క్రియల తోడిదే..పాపం ఖర్మకాలి తలకిందులయింది.

2 thoughts on “మాలిక పదచంద్రిక – జులై 2015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *