April 20, 2024

రాగమాలిక – ఆభేరి

colorful-music-notes_085490

శివుని ఢమరకము నుండి అకార, ఉకార, మకారం యొక్క కలయిక అయిన ‘ఓం ‘ కారము పుట్టినది. ఈ ఓంకారాన్నిఅనుష్ఠించడంలో, అనుసంధానించడంలోనూ నాదము వస్తుంది. ఆ నాదమే సంగీతానికి మూలము. అందుకే శివున్ని ‘నాదా తనుమనిశం ” అని కొడియాడాడు త్యాగరాజ స్వామి. ప్రకృతిలోని జంతువుల పక్షుల అరుపుల నుండి సప్త స్వరాలు పుట్టించాడు మానవుడు. ఈ సప్త స్వరాలతో సామవేద సారమైన సంగీతము పుట్టింది.

స : షఢ్జం అంటారు అంటే సముద్రము. ఈ షడ్జం నెమలి క్రేంకారం నుండి ఉద్భవించింది. దీనికి అధిష్టాన దేవత బ్రహ్మ.
రి = ఋషభం అంటే ఎద్దు. ఋషబం ఎద్దు రెంకె నుండి ఉద్భవించిన ధ్వని. అధిష్టాన దేవత అగ్ని.

గ = గాంధర్వం అంటే గగనము. మేక అరుపు నుండి ఉద్భవించిన ధ్వని , అధిష్టాన దేవత రుద్రుడు.

మ = మధ్యమం అంటే సమ దూరములో ఉండేది. క్రౌంచపక్షి కూత నుండి వచ్చిన ధ్వని , అధిష్టాన దేవత విష్ణువు.

ప = పంచమం అంటే ఐదవది, కోయిల కూత నుండి ఉద్భవించింది. అధిష్టాన దేవత నారదుడు.

ధ = ధైవతం అంటే భూమి. గుర్రం సకిలింత నుండి పుట్టిన ధ్వని, అధిష్టాన దేవత వినాయకుడు.

ని = నిషాదం అంటే బోయవాడు. ఏనుగు ఘీంకారం నుండి పుట్టిన ధ్వని. అధిష్టాన దేవత సూర్యుడు.

ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి – ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
ఉదా: స రి గ మ ప ధ ని స.

అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.

ఉదా: స ని ధ ప మ గ రి స.
ఈ ఆరోహణ , అవరోహణలనే మూర్ఛన అంటారు.

యోయంధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః |

రంజకోజన చిత్తానాం సరాగః కధితోబుధైః||

స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల మనస్సును ఆనందింపచేయునట్టి శబ్ధమును ‘రాగము ‘ అంటారు.
ఈ స్వరాలని చక్కగా అలంకరించినట్టుగా ఒక వరుసలో నిలిపి వీనుల విందు చేసేదే ‘రాగము ‘. రాగాలలో ముఖ్యమైనవి 72 జనక రాగాలు .ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమఖి, పురందర దాసు గారు.
జనక రాగాలనే ‘మేళకర్త ‘ రాగాలని కూడా అంటారు. వీటికే మాతృక, ఆధార , మూల , ప్రాతిపదిక రాగములని కూడా పేర్లు. మేళకర్త రాగాలకి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. మొదటిది ఈ రాగ ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలుండాలి. అంటే అది సంపూర్ణ రాగమైయుండాలి. ఇక రెండవ ముఖ్య లక్షణం, ఆరోహణ, అవరోహణలో సప్తస్వరాలు వరుసక్రమంలో ఉండాలి. జనక రాగాల మరో లక్షణం ఆరోహణావరోహణము లందు ఒకే జాతి స్వరములుండుట.

ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను ‘శుద్ధ మధ్యమ రాగాలు’ అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను ‘ప్రతి మధ్యమ రాగాలు’ అంటారు.

ఎన్నో రాగాలకు మూలము ఈ జనక రాగాలే. ఇలా పుట్టిన కొత్త రాగాలని జన్య రాగాలు (చైల్డ్ రాగాస్) అంటారు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు. జనక రాగాల నుండి అనంత మైన జన్య రాగాలు పుట్టాయి. ఇలా ఎన్నో జన్య రాగాలను సృష్టించినది త్యాగ రాజ స్వామి వారు. చిన్న చిన్న మార్పులతో ఎంతో చక్కనైనా రాగాలు పుట్టించారు. కొన్ని సార్లు జనక రాగాల కన్న జన్య రాగాలే చాలా ఆహ్లాదంగా ఉంటాయి. తల్లితండ్రుల కన్న పిల్లలు ఎక్కువ అందంగా ఉన్నట్లు. ఒక జనక రాగము నుండి ఎన్నైనా జన్య రాగాలు ఉద్భవించవచ్చు. అటువంటి జన్య రాగాలు అనంతాలు. కనీసం నాలుగు స్వరాలతో ఒక రాగం ఏర్పడుతుందంటారు. కానీ డా. బాలమురళీకృష్ణ ” స మ1 ప (మూడే మూడు) ” స్వరాలతో ‘ సర్వశ్రీ ‘ అనే స్వంత రాగాన్ని సృష్టించి అద్భుతంగా కీర్తన (స్వరకల్పన చేసి మరీ) పాడారు.
కర్ణాటక సంగీతములో 22 వ మేళకర్త రాగము ఖరహర ప్రియ. ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నవి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, శ్రీ, ఉదయరవిచంద్రిక, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, బృందావన సారంగ,శివరంజని, కాఫీ, మరియు శ్రీరంజని.

ఆభేరి రాగము :

మూర్ఛన : సగ2మ1పని2స —– సని2ద2పమ1గ2రి2స.

” నగుమోము గనలేని” అన్న కీర్తన త్యాగరాజ స్వామి వారు ఈ రాగములోనే స్వరపరిచినారు. ఈ రాగం ఆద్రత తెలుపుటకు బాగా ప్రశిస్తమైనది. ఈ కీర్తనని ఎం.ఎస్. సుబ్బు లక్ష్మి గారి గాత్రములో వింటే గజేంద్ర మోక్షములో ‘ నీవే తప్ప ఇహ పరంబెరుగా.. కావవే వరదా.. రక్షింపవే బద్రాత్మకా..”గజేంద్రుడి యొక్క శరణా గతి కళ్ళముందు కదలాడుతుంది.

సంగీతము యొక్క స్వరజతులతో అలవోకగా ఆడుకొన్న బాల మురళీ కృష్ణ గారి నగుమోము…

కొనై కూడి వైద్యనాథన్ గారు ఇదే కీర్తనని తనదైన శైలిలో వాయించారు. ఆ ఆలపన వింటే ఆభేరి రాగంలో ఉన్న సినిమా పాటలన్నీ ఒక్క లిస్ట్ లో మనకే స్ఫురిస్తాయి.

తెలుగు సినిమా లో ఈ రాగములో ఉన్న పాటలు కొన్ని చూద్దాము.

1. ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
3. ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందామామా(పరువు-ప్రతిష్ట)
4. వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)
5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)
6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)
7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)
8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)
9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌)
10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క)
11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)
12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)
13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)
14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)
15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)
16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)
17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)
18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)
20. ఉయ్యాల జంపాల లూగరావయా… (చక్రపాణి)
21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)
22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)
23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌)
24. మా తెలుగు తల్లికి
25. హాయమ్మ హాయి మా పాపాయి… (రావు బాల సరస్వతి ప్రైవేటు రికార్డ్‌ )
26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌)
27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌)
28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)
29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)
30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)
31. మల్లెల్లు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా (ఇంటింటి రామయణం)
32. కోవెల ఎరుగనీ దేవుడు కలడని (తిక్క శంకరయ్య)
33. కుశలమా ఎటనుంటివో ప్రియతమా(శ్రీకాకుళపు ఆంధ్ర మహావిష్ణువు కథ)
34.రేపంటి రూపం కంటి(మంచి-చెడు)
35.అనురాగము విరిసేరా ఓ రేరాజా(దొంగ రాముడు)
36.నరవరా ఓ కురువరా(నర్తనశాల)
37. ప్రియా ప్రియతమా రాగాలు(కిల్లర్)
38. ఓ నిండు చందమామా నిగ నిగలా భామా(బంగారు తిమరాజు)
39. సపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ (ఆకలి రాజ్యం)
40. జీవితమే సఫలమూ(అనార్కలి)
41.నన్ను ఎవరో తాకిరి(సత్తెకాలపు సత్తెయ్య)
42.కనులు కనులు కలిసెను(మురళి కృష్ణ)
43.తనువా.. ఉహు హరి చందనమే(కథానాయకురాలు)
44.మనసు గతి ఇంతే(దేవదాసు)
45.పగటి పూట చంద్ర బింబం కనిపించెను ఏదీ ఏదీ…(చిక్కడు-దొరకడు)
46. హాయి హాయిగా ఆమని పాడే ( (మొత్త కాదు)సువర్ణ సుందరి )
47. ముద్దబంతి నవ్వులో మూగబాసలు ( అల్లుడుగారు )
48. నీవుండేది ఆ కొండపై ( భాగ్య రేఖ )
49. కలయా … నిజమా ( కూలీ నెం 1)
50. తనివి తీరలేదే ( గూడు పుఠాని )
51. పయనించే ఓ చిలుకా ( కుల దైవం )
52. అహో ఒక మనసుకి నేడే ( అల్లరి ప్రియుడు )
53. కన్నులతో చూసేది గురువా ( జీన్స్ )
54. ఓహో … ఓహో … ఓహో … బుల్లి పావురమా ( బృందావనం – రాజేంద్ర ప్రసాద్ సినిమా )
55. చెప్పకనే చెబుతున్నది ( అల్లరి ప్రియుడు )
56. ఎక్కడ వున్నా … ఏమైనా… ( మురళీ కృష్ణ )
57. అందమే ఆనందం ( బ్రతుకు తెరువు )
58.నీ మది చల్లగా … స్వామీ నిదురపో ( ధనమా ? దైవమా ? )
59. ఏమని వర్ణించను ( డ్రైవర్ రాముడు )
60. తెలిసిందిలే ( రాముడు … భీముడు )
61. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌)
62. పూసింది పూసింది పున్నాగా ( సీతా రామయ్య గారి మనవరాలు)
63. మంచు కురిసే వేళలో ( అభినందన )
64. ఏలే ఏలే… మరదలా ( అన్నమయ్య )

***************************************
హింది సినిమాలో కొన్ని పాటలు ఆభేరి రాగం లో ( భీం పలాసి లో)

* ఆ నీలె గగన్ తలె ప్యార్ హ కరే ( బద్ షా- 1956)
* ఆజ్ మెరె మన్ సఖి బన్సురి బజాయె కొఇ(ఆన్ – 1952)
*బీనా మధుర్ మధుర్ కచ్హు బోల్(రాం రాజ్య – 1943)
* ఏ అజ్ఞబి తూ భీ కభీ ఆవాజ్ దే కహీ పే ( దిల్ సే – 1998)
*దిల్ కె తుక్డే తుక్డె కర్ కే (దాదా – 1979)
*దిల్ మే తుఝే బిటాకే.. కర్ లూంగీ మై బంధ్ ఆఖే ( ఫకీరా -1976)
* ఖిల్తే హై గుల్ యహా ఖిల్ కే బిచడ్ నే కో (షర్మిలి – 1971)
* కుచ్ దిల్ నే కహా ( అనుపమ – 1966)
* మాసూం చెహర ఖాతిల్ అదా ( దిల్ తేరా దివానా – 1962)
* నగ్మ ఓ షేర్ కి సౌగాత్ కిసే పేష్ కరూ (ఘజల్ – 1964)
* నైనో మే బద్ర ఛాయే ( మేర సాయ – 1966)
*ఓ బెకరార్ దిల్ (ఖొర – 1964)
* ఓ నిర్దయే ప్రీతం ( స్త్రీ – 1961)
* సమయ్ ఓ ధీరే చలో ( 1993)
* తూ హై ఫూల్ మేరే గుల్షన్ కా ( ఫూల్ మేరే గుల్షన్ కా – 1974)
*

5 thoughts on “రాగమాలిక – ఆభేరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *