April 25, 2024

నిద్ర

రచన: అనురాధ( సుజల గ౦టి) ఆ రోజు వనితా మ౦డలిలో వరలక్ష్మీవ్రత౦ అని బయలుదేరి౦ది ప్రియ.దుర్గాబాయ్ దేశ్ ముఖ్ గారు ప్రతీ పట్టణ౦ లో ఆ౦ధ్ర వనితామ౦డలి స్థాపి౦చారు.అలాగే ఢిల్లీలో కూడా ఉ౦ది.ఉత్తర భారత దేశ౦లో ఉన్నా మన స౦స్కృతి,సా౦ప్రదాయాల్ని మర్చిపోకు౦డా అన్ని ప౦డుగలూ అ౦దరూ కలిసి చేస్తారు వనితా మ౦డలి సభ్యులు. సామూహిక౦గా సభ్యురా౦డ్ర౦దరూ కన్నులప౦డువగా వరలక్ష్మీపూజ,కృష్ణాష్టమి కలిపి పురోహితుడ్ని పిలిచి శాస్త్రోక్త౦గా జరుపుకు౦టారు.వనితల౦దరూ శ్రమకోర్చి ఎ౦తో దూరాలని౦చి ఈ ఫ౦క్షన్ జరపడానికి పొద్దున్నే పదిగ౦టలకల్లా […]

మాలిక పత్రిక అక్టోబర్ 2015 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head అందరినీ అలరిస్తున్న రచనలతో అక్టోబర్ మాలిక పత్రిక విడుదలైంది. ప్రమదాక్షరి కథామాలిక పేరుతో ఒకే అంశం మీద మహిళా రచయితలతో చేస్తున్న ప్రయోగం సఫలమైంది. ఎన్నో విభిన్నమైన కథలు వచ్చాయి.. మీ రచనలను పంపవలసిన చిరునామా: editor@maalika.org అక్టోబర్ 2015 సంచికలో: 00. అక్షర సాక్ష్యం 01. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ 02. అ’మ్మా’యి 03. నిరంతరం నీ ధ్యానంలో 04. తొలగిన మబ్బులు 05. ఇదో పెళ్లి […]

అక్షర సాక్ష్యం

రచన: రంగనాథ్ 1. తల : తలపులకు నిలయం …. తల తలపెట్టే పనులకు కార్యాలయం…. తల! మంచిపనులు చేసి మహాత్ములలో తలమానికంగా బ్రతికేవారు కొందరు- తలతిరుగుడుడెక్కువై తలతిక్క పనులు చేసి తలవంపులకు గురయ్యేవారు కొందరు- కళ్ళు తలకెక్కి తలెగరేసుకుంటూ తలపొగరు పెంచుకొనేవారు కొందరు- తలవంచుకు బ్రతకాల్సిన కాని పనులు పూనుకోక తగిన పనులు తలవడి తలవాల్చేసేలోగా తలెత్తుకొని జీవించడం మేలు! 2. అవగాహన కనిపిస్తుంది జీవితం తలకో తీరుగ – సరైన రీతిలో చూడలేరు అందరూ […]

లైఫ్ ఈజ్‌ బ్యూటిపుల్ – (తరాలు – అంతరాలు)

రచన: మణి వడ్లమాని “చదువులు కూడా కొత్త తరం భార్యభర్తల్లో కాస్తంత సర్దుబాటు తత్వాన్ని నేర్పించలేకపోతున్నాయి. లక్షల సంపాదన ఇద్దరిలోనూ ‘నేను’ అనే అహంభావాన్ని పెంచి పోషిస్తోందేమో తెలియదుగాని. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూడటం… ‘నువ్వెంతంటే నువ్వెంత’ అంటూ ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకోవడం… ఇక కలిసుండలేమంటూ కోర్టు మెట్లెక్కడం.. వెరసి పెళ్లైన మూణ్ణెల్లకే విడాకులకు అర్జీ పెట్టుకోవడం. వాస్తవాలకు దూరంగా ఆలోచించడం. ఊహా ప్రపంచంలో విహరించడం వల్ల ఇద్దరి ఆలోచనల మధ్య […]

‘అమ్మా’ యి – (తరాలు – అంతరాలు)

రచన: విశాలి పెరి కావేరికి అమ్మని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంది. పదిరోజుల నుండి అమ్మ దగ్గరే ఉండటంతో ప్రపంచాన్నే మరచిపోయింది. అలా అని కావేరి చిన్న పిల్లేమీ కాదు. ఇద్దరు పిల్లల తల్లి. కావేరి పది రోజులు సంక్రాంతి శెలవలకని పుట్టింటికి వచ్చింది. తనకి ఏడాదికి ఒకసారే పుట్టింటికి రాడానికి కుదురుతుంది. అదీ సంక్రాంతి శెలవలకే. ఈ పది రోజులు పది నిమిషాల్లా గడచిపోయాయి. తనతో బాటు బాబయ్యలు, పిన్నులు, వాళ్ళ పిల్లలు, నాన్నగారి చెల్లెళ్లు(అత్తయ్యలు), […]

నిరంతరం నీ ధ్యానంలో (తరాలు – అంతరాలు)

రచన: కోసూరి ఉమాభారతి ‘యువరాజ్ ‘ గురించే ఆలోచిస్తూ తయారవుతున్నాను. ఎప్పటిలా మౌర్య గార్డెన్స్ లో కలుస్తానని, పొద్దున్నే మెసేజ్ పంపాను. రాజ్ కి నచ్చేలా ముస్తాబవుదామని, కాస్త ముందుగానే అద్దం ముందు చేరాను. అతన్ని కలిసి వారమయింది. లాలనగా దగ్గర చేరి, “నాకంతా అర్ధమయింది రాజ్, నాకిప్పుడు ఏమాత్రం కోపం లేదు. నిన్ను క్షమించేసాను. యూ ఆర్ మై ప్రిన్స్ చార్మింగ్, ఐ లవ్ యూ,” అంటూ అతని చేతుల్లో వొదిగిపోవాలని ఆత్రుతగా ఉంది. రాజ్ […]

తొలగిన మబ్బులు (తరాలు – అంతరాలు)

రచన:నాగలక్ష్మి కర్ర ఆగకుండా మోగుతున్న డోరు బెల్లు శబ్దానికి నిద్రా భంగం కలిగిన మహేందర్ వీధి తలుపు వైపు నడిచేడు. హాలులోని గడియారం సమయం ఆరు చూపిస్తోంది. యీవేళప్పుడు యెవరొచ్చేరో అనుకుంటూ తలుపు తీసేడు. ఎదురుగా శివాని … చేతి మీద గిల్లుకు చూసుకున్నాడు. అమ్మో నొప్పి అంటే తను కలగనటం లేదు నిజంగానే శివానీ వచ్చింది. తన జీవితం, తన సర్వస్వం. పది సంవత్సరాలు ప్రేమించుకొని మూడు ముళ్ళతో యేకమై, ఏడాది తిరగకుండా తూ…తూ…….. మై……..మై……. […]

ఇదో పెళ్లి కథ (తరాలు – అంతరాలు)

– డా ॥ గురజాడ శోభా పీరిందేవి పెళ్లి హాల్ అత్యంత ఆధునికంగా,అట్టహాసంగా వెలిగిపోతోంది . లైట్ల తోరణాలు, పూలపందిళ్ళు నయనానందాన్ని కలిగిస్తూ కట్టి పడేస్తున్నాయి ఆ అందాన్ని వైభవాన్ని తిలకించాలని సూరీడు తెగ ఆరాటపడుతూ తూర్పు తలుపు తీసుకుని వొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు . ఆయన వొస్తే తమకి చూసే చాన్స్ పోతుందని మబ్బుల గుంపులు అడ్డుకుంటూ వున్నాయి అయినా వొస్తానంటున్న సూరీడు మీద ఆగ్రహం వొలక బోస్తూ వురుముతున్నాయి . వారిద్దరి మధ్యా నిశ్శబ్ద […]

గెలుపు కోసం

రచన: స్వాతీ శ్రీపాద ప్రియాతి ప్రియమైన ప్రియా ఆశ్చర్యపోతున్నావా? మూడు ముళ్ళువేసి మూడున్నర గంటలు దాటలేదు, అప్పుడే ఇంత ప్రియాతి ప్రియమైన దానను అయిపోయానా అని. సంవత్సరాలు నెలలు గంటలు ఎందుకు ప్రియా, మూడు క్షణాలు చాలదూ… ఎక్కడో తప్పిపోయిన ఆత్మను వెతుక్కునేందుకు? నువ్వు మధుప్రియవే కావచ్చు ఎవరికైనా, మధు కావచ్చు కానీ నా ఒక్కడికి మాత్రం ప్రియవు. ఇవి పెదవుల చివర తేనె రాసుకుని పలుకుతున్న చిలకపలుకులు కావు. తొలిచూపు ప్రేమ పైత్యమా అంటావేమో, కాదు […]

శంభునటనము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు మొట్ట మొదట – పతంజలి, శివుని వాహనమైన నంది – వీరిరువరికి సంబంధించిన ఒక చాటుకథను చెప్పాలి. పతంజలి యోగశాస్త్రమును రచించిన మహాముని. అతనికి ఒకనాడు పరమేశ్వరుని సందర్శించాలనే అభిలాష కలిగినది. కైలాస ద్వారమునకు వెళ్లాడు. ఎవరు ఈశ్వరుని చూడవలయు నన్నను, నంది అనుమతి తీసికొని వెళ్ళవలసినదే. నేటి పరిభాషలో నంది ఈశ్వరునికి పీ. ఏ. అన్న మాట. ఎందుకో గాని ఆ రోజు నంది పతంజలికి శివుని దర్శనానికి […]