April 23, 2024

మాలిక పత్రిక నవంబర్ 2015 సంచికకు స్వాగతం..

Jyothivalaboju Chief Editor and Content Head కొత్త కొత్త కథలు, సీరయల్స్, కవితలు, వ్యాసాలతో మీముందుకు వస్తోంది నవంబర్ మాసపు మాలిక పత్రిక. మీ సలహాలు, సూచనలు మాకు సర్వదా ఆమోదమే.. మీ రచనలను పంఫవలసిన చిరునామా: editor@maalika.org ఈ మాసపు విశేష రచనలు: 01. వెన్నెల పురుషుడు 02. అవును వాళ్లు చేసిన తప్పేంటి? 03. కాలమే దీనిని పరిష్కరించాలి 04. చిగురాకు రెపరెపలు 10 05. మాయానగరం 20 06. జీవితం ఇలా […]

వెన్నెల పురుషుడు (తరాలు – అంతరాలు)

రచన:వనజ తాతినేని ఉదయం తొమ్మిది గంటలైనా కాలేదు సూరీడు మహా వేడిమీద ఉన్నాడు వంట గదిలో విజిల్ వేస్తూన్న కుక్కర్ తో పోటీ పడుతూ కిటికి ప్రక్కనే పెరిగిన మామిడి చెట్టుపై కోయిల కూస్తుంది . తనూ స్వరం కలపబోయిన ఆమె అత్తమామలు ఉన్నారన్న సంగతి గొర్తుకొచ్చి ఉత్సాహాన్ని గొంతులోనే అణిచేసుకుంటూ “వసంతంలో కూయాల్సిన కోయిల ఆషాడం చివరిలో కూడా కూస్తుంది వానకారు కోయిల అంటే ఇదేనేమో !” అనుకుంటూ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి కిటికీ […]

అవును, వాళ్ళు చేసిన తప్పేమిటి? (తరాలు – అంతరాలు)

రచన: గౌతమి ఏ కాలమయినా కులాంతర వివాహాన్ని ఆ ప్రేమికులు మాత్రమే గౌరవిస్తారు తప్ప వారివురి కుటుంబాలు మాత్రం ఆ వివాహాన్ని గౌరవించకపోవడం అనేది సర్వ సాధారణం. కొంతమంది విషయాల్లో అమ్మాయి వైపు నుండో, అబ్బాయివైపునుండో కొన్ని లోపాలు వుండడం వల్ల కుటుంబాలలో కలవలేకపోవచ్చు, అటువంటి పరిస్ఠితిలో వారివురి మధ్యనే సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది విషయాల్లో ఎంత వెతికినా సరియైన కారణం కనబడదు, ఒక్క “కుల వివక్షత” తప్ప. కాలాలతో పనిలేకుండా ఆధునిక యువత ఆలోచనా ధోరణిని […]

కాలమే దీనిని పరిష్కరించాలి (తరాలు – అంతరాలు)

రచన:వడ్లమాని బాలా మూర్తి “భవ్యా ఇంత లేట్ అయిందేమ్మా?” “ఆఫీస్ లోనే లేట్ అయిందమ్మా.” “చప్పున కాళ్ళు కడుక్కురామ్మా భోజనం చేద్దాం.” “అక్కడే టిఫిన్ తిన్నాను ఇప్పుడేం వద్దు.” అనీ నేరుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది భవ్య. “ఏమిటో ఈ పిల్లా ఈ మధ్య రోజూ ఆలస్యంగా రావడం, భోజనం చెయ్యకుండా పడుక్కోవడం. ఎమౌతోందో అర్ధం కావడం లేదు”, అని సణుక్కుంటూ కంచంలో వడ్డించుకుని గబగబా రెండు ముద్దలు తిని లేచింది సీత. మంచం మీద వాలి ఆలోచనలో […]

చిగురాకు రెపరెపలు-10

రచన: మన్నెం శారద మా స్కూలు పక్కన ఒక మల్లెపూల తోట వుండేది. అక్కడ ఎండలెక్కువ కాబట్టేమో మల్లెపూలు చాలా కాలం పూసేవి. అక్కడ ఒక పధ్నాలుగేళ్ళ అబ్బాయి తోటకి ఏతా వేసి నీరు పెడుతూ, కాలవలు తీస్తూ, తోట పనిచేస్తూ వుండేవాడు. మా స్కూలుకి తోటకి మధ్య బార్బ్‌డ్ వైర్ ఫెన్సింగ్ వుండేది. అక్కడ ఖాళీ స్థలంలో నేను తొక్కుడు బిళ్ళ ఆడుతుండేదాన్ని. ఆ అబ్బాయి నన్నే తదేకంగా చూస్తుండేవాడు. ఒకరోజు నాకొక తుమ్మముల్లు గుచ్చుకుంది. […]

మాయనగరం – 20

రచన: భువనచంద్ర “మీకు ఎవరూ స్నేహితులు లేరా? ” అడిగింది మదాలస “ఉన్నారు.. ఉన్నారనుకుంటే! లేరు… నిజం చెబితే! ” నవ్వాడు ఆనందరావు. “అదేంటీ? ” కొంచం అయోమయంగా అడిగింది మదాలస. “మీరూ, మాధవి గారు, శోభ మీరంతా స్నేహితులే! కాదన్ను. కానీ ఏవొక్కరితోనూ నా గుండె విప్పి చెప్పుకోగలిగేంత చనువు లేదు. అందువల్ల లేరన్నాను. మదాలస గారు .. స్నేహం అనేది ఓ గొప్ప వరం. స్నేహితులు దొరుకుతారు. ఆ స్నేహితుల్లో మన మంచి కోరేవారు […]

జీవితం ఇలా కూడా ఉంటుందా..? – 1

రచన: అంగులూరి అంజనీదేవి ప్రేమంటే ఒక లోతైన అవగాహన. అది ఎవరి మధ్యనైనా పుట్టొచ్చు. అది వుంటేనే జీవితం సంతోషంగా, అద్భుతంగా వుంటుంది. ఎప్పుడైనా తర్కం (లాజిక్‌) గుడ్డిదేమో కాని ప్రేమ గుడ్డిది కాదు. అదొక మౌన తరంగిణి. దాన్ని ‘నువ్వు నాక్కావాలి’ అని ఎవరూ అడగలేరు. ‘నేను నీతోనే వుంటాను’ అని ప్రేమ కూడా ఎవరితో చెప్పదు. అలాంటప్పుడు ప్రేమతో ‘నువ్వు ఎక్కడికీ వెళ్లకు, నాతోనే వుండు’ అని ఎలా చెప్పగలం… అదొక అనంతం. శక్తివంతం. […]

Gausips – Dead ppl don’t speak-10

రచన: డా. శ్రీసత్య గౌతమి ఏరన్ వెంటనే డోర్ తీసి బయటకు వచ్చి, “ఏం జరిగింది అనైటా? ఎందుకా కేకలు? లోపల ఏం జరిగింది” అని ఏరన్ అడిగాడు. అనైటా వణికిపోతూ.. “ఏరన్, ఒకసారి లోపలికి వెళ్దాం రా” అంది. పరిగెత్తుకుని వెళ్ళారు. ఆమె ఇంట్లోవున్న పనమ్మాయి నేల మీద పడి వుంది. క్రిస్టల్ తో చేసిన అందమైన పెద్ద టేబుల్ డెకరేషను టేబుల్ మీద నుండి నేలమీద పడి ముక్కలయిపోయి వుంది. అనైటా కాలింగ్ బెల్ […]

సహజీవనం

రచన: వై.ఎస్.ఆర్. లక్ష్మి “ఏమాలోచించారు “అని అడిగాడు రామారావు గుడిలో తనను కలసిన జానకిని. ఆమె కాసేపు ఏమీ మాట్లాడలేదు. అసలు విషయం ఏమిటంటే రామారావుకి భార్య చనిపోయి సంవత్సరం గడిచింది. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అక్కడకు వెళ్ళి ఉండలేక ఇక్కడే ఉంటూ ఒకరోజు చెయ్యి కాల్చుకుంటూ వీలు కానిరోజు కర్రీ పాయింట్ కూరలతో కాలక్షేపం చేస్తున్నాడు. పనమ్మాయి వచ్చి పని చేసి వెళుతుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా ఒక రోజు […]