March 29, 2024

మాలిక పత్రిక డిసెంబరు 2015 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మరో సంవత్సరం వీడ్కోలు పలుకుతోంది. ఈ సంవత్సరపు చివరి సంచిక మీకోసం సిద్ధంగా ఉంది.. ఆసక్తికరమైన సీరియళ్లు, కథలు, వ్యాసాలు పాఠకులను అలరిస్తాయని మా నమ్మకం. మాలిక పత్రికలో మరిన్ని మార్పులు, చేర్పులు, ప్రయోగాలు చేయడానికి మీ సలహాలు సూచనలను ఆహ్వానిస్తున్నాం.. మీ రచనలు పంపడానికి చిరునామా: editor@maalika.org 1. చిగురాకు రెపరెపలు 10 2. మాయానగరం 21 3. శుభోదయం 3 4. జీవితం ఇలా కూడా […]

చిగురాకు రెపరెపలు – 11

మాచెర్లలో మా క్వార్టర్స్ కి ముందు చాల స్థలం, వెనుక కొంత స్థలం వున్నాయి. పెరటి తలుపు తీస్తే మరికొంత స్థలం వుంది. అటు నుండి కుడివైపుగా ముందు వైపుకి రావడానికి సందు వుంది. వెనుక కూరగాయల పాదులు సందంతా బెండ టమాటా వంగ లాంటి మొక్కలుండేవి. ముందు వైపంతా పూల మొక్కలు ప్రొద్దుతిరుగుడు, సంధ్యమల్లె, నిత్యమల్లె, బంగళాబంతి, బంతి, సీతమ్మవారి జడబంతి. అన్ని రంగుల్లోనూ వుండేవి. ముందు పెద్ద పున్నాగ చెట్టు వేపచెట్టు వుండేవి. మా […]

మాయానగరం – 21

రచన: భువనచంద్ర బిళహరి కామేశ్వరరావు అనబడే “కామేష్ ” ని అడిగింది…. “ఎన్నాళ్ళు ఇక్కడ పడుండమంటావు? ” అని. ప్రస్తుతం బిళహరి కామేశ్వరరావు వుంటున్న రెండు గదుల పెంకుటిల్లు ( ఓ చిన్న కిచెను, ఓ వరండా, ఇంటికి వెనక వైపు వున్న పూర్వకాలపు లెట్రీను అధనం) సర్వేశ్వరరావుది. సర్వేశ్వరరావుకి లోకంలో కనిపించే సర్వమూ ఒక్కటే .. దాని పేరు ‘లాభం ‘ . లాభం లేకపోతే ఏ పని జోలికీ వెళ్ళడు. కామేశ్వర రావు ఫోన్ […]

శుభోదయం 4

రచన: డి.కామేశ్వరి రేఖమీద అత్యాచారానికి పట్టణం అంతా కదిలిపోయింది. ఆడపిల్ల తల్లిదండ్రులు భయంతో గుండెలమీద చెయ్యి వేసుకున్నారు. అన్ని కాలేజీలలో, హైస్కూళ్లలో విద్యార్థినులు పెద్ద అలజడి లేవదీసి వీధిలో గుంపులుగా ఊరేగి తోటి విద్యార్థిని మీద జరిగిన అత్యాచారానికి ప్రతీకారం కావాలి, సమాజంలో స్త్రీకి వున్న రక్షణ ఏమిటంటూ ముఖ్యమంత్రి వద్దకు బారులు తీరి వెళ్లి మెమొరాండం సమర్పించారు. ఆ వార్త ముఖ్యమంత్రిని కలచివేసింది. ఆయన దోషులని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించుతామని స్వయంగా హామీ యిచ్చారు. […]

జీవితం ఇలా కూడా ఉంటుందా?? 2

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి మాధవీలత శూన్యంలోకి చూస్తూ ”ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో, తుఫానులో చనిపోయినవారిని టీ.వీలో చూపినప్పటి నుండి నాకు సతీష్‌చంద్ర గురించి భయం ఎక్కువైంది మోక్షా!” అంది. నివ్వెరపోయి చూసింది మోక్ష. ఎందుకంటే ఎప్పుడైనా మాధవీలత సతీష్‌చంద్రను పట్టించుకోదు. అతను చెప్పిన మాట వినడని ఆనంద్‌ ఒక్కడే తన మాటను, మర్యాదను నిలుపుతాడని చెప్పుకుంటుంది. అలాంటి ఆమె సతీష్‌చంద్ర గురించి భయపడటమా!! ”అయినా ఉత్తరాఖండ్‌ వరదలకి సతీష్‌చంద్రకి ఏమి అత్తయ్యా సంబంధం? సతీష్‌ అక్కడ […]

Dead ppl don’t speak-11

రచన:డా. శ్రీసత్య గౌతమి పోలీస్ స్టేషన్ వచ్చింది. ఇద్దరూ లోపలికి వెళ్ళేరు, జేసన్ ఏవో ఫైళ్ళు చూస్తున్నాడు. జేసన్ తలెత్తి అనైటాని చూసి సాదరం గా నవ్వాడు. అనైటా ఏరన్ ని ప్రయివేట్ డిటెక్టివ్ గా పరిచయం చేసింది. ఏరన్, జేసన్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అందరూ కూర్చున్నారు. తాను పాత ఫైళ్ళన్ని వేరే స్టేషన్ నుండి తెప్పించినట్లు, వాటిలో ఈ కేసు వివరాలకోసం గత 2-3 రోజుల నుండి వెతుకుతున్నట్లు తాము ఎంత కష్టపడుతున్నదీ […]

ఓ అబ్బాయి పెళ్లి కథ .!! (తరాలు – అంతరాలు)

రచన: సమ్మెట ఉమాదేవి “వివాహమన్నది మధ్యలో ఆరంభమయిన ప్రయాణమే అయినా చివరి వరకు సాగేదే ఆ యానం. అలా మనతో కలసి నడవడానికి ఎక్కడో ఎవరో మనకోసం పుట్టే ఉంటారన్న భావనే అద్భుతంగా ఉంటుంది కదూ..” సందీప్ అన్నాడు. “అవును ఒక నిర్ణయం మన జీవితాలను మార్చేస్తుందిస్తుంది కదూ.” నాటక ఫక్కీలో అన్నాడు మనోజ్. సందీప్ మనోజ్ బీ టెక్ నుండి మంచి మిత్రులు ఇపుడు రూమ్మేట్స్ కూడా “రేపు అమ్మా నాన్నా వస్తున్నారు మనోజ్ . […]

అవధులెరుగని ప్రేమ!

“బియాండ్ లౌ!” అన్న ఈ కథను మొదట ఇంగ్లీషులో రాసినది : శ్రావ్య. జి తెలుగులోకి స్వేచ్చానువాదం చేసినది : వెంఫటి హేమ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుని పెన్నుల స్టాండు లోంచి ఒక పెన్ను తీసుకుని ఆమె రాయడం మొదలుపెట్టింది. ఆ పెన్నులో సిరా చాలా తక్కువ ఉంది, కాని అది ఆమె చూసుకోలేదు. తన దారిన తాను చకచకా రాసుకుంటూ పోయింది ….. “ఇదిగో, ఇటు చూడు! ఈ లేఖ నేనేం నీ పేరుతో […]

మార్పు. .

రచన: ysr లక్ష్మీ “అత్తయ్యా”అన్న పిలుపు విని వంటింట్లో నుంచి ఇవతలికి వచ్చాను. కోడలు రోజా పిలుపు అది. “ఏమిటమ్మా “అన్నాను. “భువికి వంట్లో బాగున్నట్లు లేదు పాలు తాగిస్తే మొత్తం వాంతి చేసుకున్నది”అన్నది. భువి నా మనవరాలు. ఏడాది పిల్ల. నెల రోజుల క్రితం అమెరికా నుండి ఇండియా వచ్చారు నా కోడలు, మనవరాలు. పుట్టింట్లో ఒక వారం, ఇక్కడోక వారం గడుపుతున్నారు. రెండు రోజుల క్రితమే పుట్టింటి నుంచి ఇక్కడకు వచ్చింది. రాత్రి పడుకోబోయే […]

కీరవాణి – రాగమాలిక

రచన: విశాలి పెరి కీరవాణి రాగము కర్ణాటక సంగీతంలో 21వ మేళకర్త రాగము. కీరవాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో కళ్యాణ వసంతం, సామప్రియ, వసంత మనోహరి ముఖ్యమైనవి. ఈ రాగం లోని స్వరాలు చతుశృతి ఋషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకళి నిషాధం. ఇది 57 మేళకర్త సింహేంద్ర మధ్యమ రాగానికి శుద్ధ మధ్యమ సమానము. ఈ రాగము రాత్రి వేళలలో వినదగిన రాగము. ఆరోహణ : స […]