April 20, 2024

చివరి కొడుకు

రచన:  కృష్ణ మణి

వీడు

ఏ ధర్మాన్ని ఆచరించాలో చెప్పు

ఏ బట్టకట్టాలో

ఎలాంటి తిండి తినాలో

అదీ … ఎలా తినాలో చెప్పు

 

వీడు

సమాజంలో ఇప్పుడు

ఒక ఆనాదలా కంటతడి పెడుతున్నాడు

కరెంటు తీగలపై ఒంటరి పిట్టలా

రాలుతున్నాడు

 

వీడు

మనషుల మధ్య మమతల కోసం గుండె

మండి గుడి గంట కొడుతున్నాడు

దర్గా మెట్లెక్కి ‘’యా అల్లా’’ అంటున్నాడు

చర్చికెళ్ళి ‘’జీసస్’’ అని రోదిస్తున్నాడు

వీడిప్పుడు పరాయివాడు

వీడ్నిఎవడూ మావాడనడు

 

వీడు

బూతద్దంలాంటివాడు

వీడ్నుంచి చూసుకుంటే నీ మనసూ

దర్శనమిస్తుంది పెద్దగా

పక్కవాడు నవ్వుకునేలా

 

వీడు

పరిగెడుతున్నాడు

మనం మనుషలమని

ఒలంపిక్ కాగడలా చేతిలో దివిటిని చేతబూని

అందకారాన్ని తరిమేద్దామని

 

వీడు

మానవత్వానికి చివరి కొడుకు

వీడు చస్తే లోకం చచ్చినట్లే

మనిషిని బూతద్దం పట్టి వెతకాలప్పుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *