శంకరాభరణం:

రచన: వైశాలి పేరి

ధీర శంకరాభరణం రాగాన్నే వాడుకలో శంకరాభరణం అని అందురు. ఇది 29 వ మేళకర్త రాగము.

ఆరోహణ : : S R2 G3 M1 P D2 N3 S
అవరోహణ : S N3 D2 P M1 G3 R2 S

సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం ఐదవ బాణ చక్రంలో ఐదవ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ అని, పార్శవదేవ ‘రాగాంగ రాగ’ అని కొనియాడారు. ఈ రాగము సంపూర్ణ రాగము. నలభైకి పైగా జన్య రాగాలు గల విశిష్ట మైన రాగము శంకరాభరణము. అందులో ముఖ్యమైనవి : ఆరభి, అఠాన, బిళహరి, దేవనాగరి, కదనకుతూహలం, హంసధ్వని, సుద్ధ సావేరి, పూర్ణచంద్రిక, కేదరం.

ఈ రాగానికి అన్ని స్వరాలు మూలస్తంభాలై నిలచి రాగాన్ని రక్తి కట్టిస్తాయని సుబ్బరామ దీక్షితార్ అభిప్రాయపడ్డారు. ఈ రాగాన్ని ఔపోసన పట్టిన సంగీతకారునిగా తంజావూర్ ఆస్థానానికి చెందిన ‘ నరసయ్య ‘ అని చెప్పుకొంటారు. శంకరాభరణ రాగ, భావాలను ఎంతో అద్భుతంగా గానం చేయగల నేర్పరితనం, ఆ రాగమందు ఆయనకు గల ప్రతిభను గుర్తించి తంజావూరు ఆస్ధానాధీశుడు శరభోజీ ఈయనను ‘శంకరాభరణం నరసయ్య’గా గౌరవించారు. నాటినుండి శంకరాభరణం ఆయన ఇంటి పేరైనది. ఎక్కడ నరసయ్యగారు సంగీత కచేరీలు చేసినా శంకరాభరణ రాగంలో తప్పక ఒక కృతిని ఆలపించేవారు. ఒకసారి పాడిన సంగతిని మరోసారి పాడకుండా గంటల తరబడి ఆయన శంకరాభరణ రాగంలో పాడేవారట.
ఈ రాగము ఉదయం రెండో భాగము ( 9 నుండి మధ్యాహ్నం వరకు) వినే రాగము అయినప్పటికినీ అన్ని వేళలా వినదని రాగము. ప్రేమకు, భక్తికి, ఆధ్యాత్మితకు , గంభీరానికి, శృంగారానికి , ఆలోచనలకి అణువైన రాగము.
శంకరాభరణం రాగాన్ని హిందుస్తానీ సంగీతములో బిలావల్ రాగానితో పోల్చవచ్చు. జాతీయ గీతం “జనగణమణ ” ఈ రాగములో స్వరపరిచారు.

ప్రముఖ కీర్తనలు :

1. ఎదుట నిలచితే – త్యాగరాజ స్వామి
2. మరియాద గాదురా – త్యాగరాజ స్వామి
3. స్వర రాగ సుధ – త్యాగరాజ స్వామి
4. ఎందుకు పెద్దలవలె బుద్ధినీయవు – త్యాగరాజ స్వామి
5. మనసు స్వాధీనమైన – త్యాగరాజ స్వామి
6. బాగు మీరగను (వేంకటేశ పంచరత్రాలలో ఒకటి) – త్యాగరాజ స్వామి
7. సుందరేశ్వరుని జూచి సురలఁ జూడ మనసు వచ్చునా – త్యాగరాజ స్వామి
8. అలరులు కురియగ – అన్నమయ్య
9. ఇతడేనా ఈ లోకములో గల – రామదాసు
10. తగునయ్య దశరథ రామచంద్ర దయ తలుపవేమి నీవు – రామదాసు
11. ఎంతో మహానుభావుడవు నీవు – రామదాసు
12. దశరధరామ గోవింద నన్ను- రామదాసు
13. రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా – రామదాసు
14. రక్షింపు మిది యేమొ రాచకార్యము పుట్టె – రామదాసు
15. నారాయణ నారాయణ జయ గోపాల హరే కృష్ణ – రామదాసు
16. అక్షయలింగ విభో – ముత్తుస్వామి దీక్షితార్
17. శక్తిసహిత గణపతిం – ముత్తుస్వామి దీక్షితార్
18. సదాశివం ముపాస్మహే – ముత్తుస్వామి దీక్షితార్
19. దక్షిణామూర్తే – ముత్తుస్వామి దీక్షితార్
20. దేవి మీన నేత్రి – శ్యామశాస్త్రి
21. సరోజదళ నేత్ర – శ్యామశాస్త్రి
22. శారదే సదాస్రయే – కృష్ణస్వామి అయ్యర్
23. శంభో జగదీశ – రామస్వామి దీక్షితార్
24. పశ్యతి దిశ్యతి (అష్టపది) – జయదేవుడు
25. శంకరాచార్యం – సుబ్బరాయ దీక్షితార్

శంకరాభరణ రాగములో ఉన్న కొన్ని తెలుగు సినిమా పాటలు :

1. బుద్ధేనాంజలి నమామి – విప్రనారాయణ
2. ఆనందం అర్ణవమైతే – కన్యాశుల్కం
3. ఓంకార నాదానుసంధానమౌ గానమే – శంకరాభరణం
4. మరచి పోరాదోయ్ చేసిన బాసలు – మనోరమ
5. వెన్నెల్లో గోదారి అందం – సితార
6. ఉరికే చిలకా – బొంబాయి
7. చిన్ని చిన్ని ఆశ – రోజ
8. ఎల్లిపోతోంది ఎల్లిపోతోంది జోడేడ్ల బండి – రోజులు మారాయి
9. నా హృదయం లో నిదురించే చెలి – ఆరాధన
10. జోరుగా హుషారుగా షికారు పోదమా – భార్యాభర్తలు
11. దేవమహదేవ మము బ్రోవుము శివ – భూకైలాస్
12. నలుగిడరే చెలువుగా శ్రీగౌరికి – వినాయక చవితి
13. నాకో తోడు కావాలి – చదువుకున్న అమ్మాయిలు
14. ఇదే పాట ప్రతీ చోట – పుట్టినిల్లు – మెట్టినిల్లు
15. చెట్టులెక్కగలవా ఓ నరహరి – చెంచులక్ష్మి
16. ఓ రంగయో – వెలుగు నీడలు
17. చిలకా గోరింకా కులికే పకా పకా – చెంచులక్ష్మి
18. విన్నావా యశోదమా (కాళింది మడుగున విషమును కలిపే కాళియు తలపై తాందవ మాడి) – మాయాబజార్
19. కానరార కైలాశ నివాశ – సీతారామ కల్యాణం
20. అహా నా పెళ్ళియంట – మాయబజార్
21. కమ్ కమ్ కమ్ కంగారు నీకేలనే – శాంతి నివాసం
22. ఆశలు తీర్చవే జనని – శాంటినివాసం
23. చల్లనైన తల్లివి శంకరు రాణివి – శ్రీ వేంకటేశ్వర మహత్యం
24. అందెను నేడే అందని జాబిల్లి – ఆత్మ గౌరవం
25. నీటిలోన నింగిలోన – వివాహ బంధం
26. వేయి కన్నులు చాలవుగా – సీతారాముల కల్యాణం
27. చిన్నారి నీ చిరు నవ్వు – పసిడి మనసులు
28. అందాల ఓ చిలుకా – లేత మనసులు
29. దేవా దివ్య కృపాకర – కాళహస్తీ మహత్యం
30.పాడవోయి భారతీయుడా (పదవీ వ్యామోహాలు)- వెలుగు నీడలు
31. హల్లో డార్లింగ్ మాటాడవా – శభాష్ రాముడు
32. కులాశ రాదోయ్ రమ్మంటే – అన్నపూర్ణ

ఈ రాగములో హింది సినిమా పాటలు చూద్దాము.

* భోర్ ఆయి గయా అంధియార – బవర్చి
* సారే కె సారే గామ కో లేకే గాతే చెలే – పరిచయ్
* దిల్ హై చోటా సా చోటి సి ఆష – రోజ
* తుహిరే తుహీరే – బొంబాయ్
* ముఝ్ కో అప్నే గలే లగాలో – హుం రాహీ
* మేరీ లాడ్లీ హై – అందాజ్
* హే దిల్ హై ముషికిల్ జీనా యహా – సి.ఐ.డి
* దిల్ తడప్ తడప్ కే పుకారే – మధుమతి
* ఆజ్ హుం అప్నే దువాకా అసర్ దేఖేగ్నే – పాకీజా
* బచ్పన్ కి ముహోబత్ కో – బైజూ బావరా
* జిందగీ ప్యార్ కే దో చార్ ఘడి – అనార్కలి
* అయేగా ఆనే వాలా – మహల్
* అల్లా తేరో నాం – హం దోనో
* యాద్ కియా దిల్ నే కహాహో తుం – పతిత
* మేరే మెహబూబ్ తుఝే – మెహబూబ్
* పియా తూసే నైన అలాగే రే – గైడ్
* జీవన్ కె సఫర్ మే రాహి – మునిం జీ
* ఏ మేరే హుం సఫర్ ఏ మేరే జానేజా – బాజీ గర్
* హోలే హోలే గూంగట్ – గూంజ్ ఉఠీ షహనాయి
* ఏ దిల్ నా హోతా బేచారా – జువెల్ తీఫ్

1 thought on “శంకరాభరణం:

Leave a Comment