April 24, 2024

మాలిక పత్రిక మార్చ్ 2015కు స్వాగతం..

మాలిక పత్రిక మార్చ్ సంచిక  మహిళా దినోత్సవ ప్రత్యేక సంచికగా  చక్కని మహిళా అంశాలతో, కవితలతో, కధలతో, వ్యాసాలతో మరియు నవ్వించే, కవ్వించే కార్టూన్లతో, క్రొత్త క్రొత్త యాత్రామాలిక విశేషాలతో ఆద్యాత్మిక వ్యాస రచనలతో, సీరియళ్ళతో, సంగీతాల రాగ విశ్లేషణలతో  మిమ్మల్ని అలరించదానికి వచ్చింది.. . మార్చ్ సంచికలోని విశేషాలు: . 1. ఒక గంటకధ 2. అన్నమయ్య ఆత్మానందలహరి-4 3. మనోగతం 4.మారుతున్న కాలంలో 5. కలంకారీశారీ డిజైనర్ భారతి గారితో కాసేపు… 6. ప్రేమలోనే […]

ప్రపంచమనుగడకు మహిళామూర్తులే ఆలంబన  

రచన: రాచవేల్పుల విజయభాస్కర్ రాజు   నేడు అంత్జర్జాతీయ మహిళాదినోత్సవం. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ సంపూర్ణహక్కులను నిరాటంకంగా అనుభవిస్తుందో, ఎక్కడ స్వేచ్చగా నడయాడుతుందో, అక్కడి ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా వర్థిల్లుతుంది. ఆ దేశ ఔన్నత్యం పతాకస్థాయిలో నిలబడుతుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఎన్నోవిప్లవపోరాటాల అనంతరం అలాంటి రోజును అన్ని దేశాలు చవి చూడాలని, ఆ దేశ గౌరవాన్ని అన్నిచోట్లా ప్రతిబింబించాలన్న సత్సంకల్పంతో ప్రతి ఏడాది మార్చినెల 8వ తేదీన అంతర్జాతీయమహిళాదినోత్సవంగా జరుపుకుంటున్నాయి. ఆడది అబల కాదు […]

 స్వర్ణమందిరం – అమృత్ సర్                       

రచన:  వెంకట్ యస్. అద్దంకి        చరిత్ర ఉన్న ప్రదేశాలను దర్శించగలగడం అన్నది కొన్ని సార్లు అనుకోకుండా కలసివచ్చే అవకాశాలు. అలాంటి ఒక గొప్ప అవకాశమే నా ఈ అమృత్ సర్ యాత్ర. కంపెనీ పనిమీద జమ్మూ వెళ్ళడం, మధ్యలో నా పనిలో చిన్న విరామంగా వచ్చిన ఆదివారం నాకు చేసిన మేలు. ముందు రోజు టాక్సీ డ్రైవర్ ని అడిగితే 200 కిలోమీటర్ల దూరం,4-5 గంటల ప్రయాణం అన్నాడు. ఇంక ఆలస్యం ఎందుకు […]

“చక్రవాకం” రాగ లక్షణములు

రచన: భారతీ ప్రకాష్.     చక్రవాకం 16.వ మేళకర్త రాగం. మూడవ చక్రమైన అగ్ని లో 4వ రాగం. ఈ రాగం మూర్చనకారక రాగం. ఈ రాగం లోని “మ” ని షడ్జమం చేస్తే “సరసాంగి (27వ మేళకర్త రాగం)“ అవుతుంది. అలాగే “ని” షడ్జమం “చేస్తే” ధర్మావతి (59 వ మేళకర్తరాగం) “ అవుతుంది. ఆరోహణ :- స రి గ మ ప ద ని స. స.నిదపమగరిస ఈ రాగం లో […]

హిందోళ రాగం   

రచన: విశాలిపేరి   హిందోళ రాగం   జన్యరాగం. శాస్త్రీయ సంగీతము ఇరవైయ్యోవ మేళకర్త నఠభైరవి. ఆ నఠభైరవి రాగానికి జన్యరాగము ఈ హిందోళ రాగము. ఆరోహణ: స మ గ మ ద ని స అవరోహణ: స ని ద మ గ స హిందోళం వొక విలక్షణమైన రాగం.  సంగీత జ్ఞానం లేని వారు సైతం ఈ రాగంలో స్వరపరిచిన పాటలను వింటే పారవశ్యంతో తలలూపాల్సిన్. ఈ రాగంలోని పాటలు వింటే జీర్ణ […]

మనోగతం

రచన: శ్రీధర్ నీలంరాజు   కార్యేషు దాసి, కరణేషు మంత్రీ అంటూ ప్రతి విషయం లో జోక్యం చేసుకునే భార్య నాకొద్దు… ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. నిజానికి ఈ విషయం తో నేను పూర్తిగా ఏకీభవించను. కేవలం విజయం లోనే కాదు అతని పుట్టుకనుండి ప్రతి ఆనందం లోనూ స్త్రీ ప్రమేయం తప్పకుండా ఉంటుంది. మరి ఇది విజయానికి మాత్రమే సంబంధించిన విషయం ఎలా అవుతుంది? అతని జీవితం స్త్రీతో వివిధ […]

ముందుమాట తో కట్టి పడేసే అక్షరం

సమీక్ష: పుష్యమీ సాగర్ అక్షరాలతో మనుషుల్ని కలపవచ్చా? మనిషి లోపల మరో ప్రపంచాన్ని వెతికి బహిర్గతం చేయవచ్చా? తన అంతరంగం లో ని భావాలతో మనుషుల్ని ఆప్యాయం గా అక్కున చేర్చుకోవడానికి తన “రెండో అధ్యయనానికి ముందు మాట” లో విరించి విరివింటి గారు తొలి ప్రయత్నం చేసారు సామాజిక స్పృహ తో తన కలానికి పదును పెడుతూనే, సున్నితత్వాన్ని మార్ధవాన్ని వదలలేదు. కవిత్వమంటే రూపెత్తిన ఆక్షర మాల మాత్రమే కాదు అదొక ప్రాసెస్ . అందుకేనేమో […]

అతడిలొ సగం  

రచన: ధనలక్ష్మి సైదు   ఆకాశంలొ అర్దభాగస్తులం … అవకాశాలలొ మూడోవంతు భాగస్తులం పెదవి విరుపులకు వెరవణి వేణీలం … ధృడబీజాలమై అంకురిస్తున్న శరీరిలం తృణీకరించబడుతున్న ఆడజాతి రత్నాలం .. బాల్య మందు అలివేణిలం .. కన్యగా పూబంతులం .. యవ్వనమున సవంతికలం .. పలుకుటలొ తియ్యమ్రానులం .. ముదుప్రాయమున అలసిన మందాకినీలం .. అణిచిపెట్టినా ఆరడిపెట్టినా మెట్టినింటిని విడువని గృహిణులం.. “అ”తగా”డి” మ”ది”లో “ఆడది”గా రూపాలం .. కుడి ఎడమలు చూడని తోడులం .. ఎప్పటికి అతడి వెనకుండే మరో  రూపాలం .. నినదించిన నిరసించిన నీరసించినా వీడని మేఘమాలికలం వింజామరులం .. అతగాడి సహకారంతొ సంపూర్ణులం…

ఆకురాలే కాలం

రచన: గవిడి శ్రీనివాస్      యవ్వనం మొగ్గ తొడిగి లేతప్రాయం వెన్నెల గొడుగు కింద కలల్ని వేలాడదీసుకుంది సహవాసాలు అభిమానాలు తెలియని బంధమై అల్లుకుపోయి జీవితంగా ముడివేసుకుంటున్నాయి కన్నె వయసు ఊహలన్నీ ఊసులన్నీ పదిలంగా హృదయం లోకి ప్రవేశించాక తొంగిచూసిన క్షణాల్లో ఏడడుగుల బంధంలోకి ప్రవేశించాం రోజులు పెనవేసుకున్నాయి కాలం కబుర్లు చెప్పుకుంది అనుభూతులు ఆడపిల్ల రూపం లో సాక్షాత్కరించాయి ఏమైందో ఏమో ఆకు రాలే కాలం తడితడిగా తడుముతోంది నన్ను తరుముతోంది తోడై నిలవాల్సినవాడే కన్నీళ్ళ బుట్టను నెత్తిన ఎత్తి జాడే లేని చోటుకి జారిపోయాడు రెక్కలూపుతున్నపాపతో నా పూల కొట్టు లో […]