April 18, 2024

మే 2016 సంచికలో …

1. ప్రసిద్ధ వాడపల్లి లక్ష్మీనృసింహ స్వామి 2. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 6 3. “వరాళి” రాగ లక్షణములు 4. రజియా ….. 5. ఇలాక్కూడా మనుషులు…! 6. ఆలి కోసం అలికిడి 7. మాయానగరం 27   8. శ్రీకృష్ణదేవరాయ వైభవం           ఎపిసోడ్-2 9. శుద్ధ కవిత్వ భాషలో జరిపిన సుదీర్ఘ సంభాషణ – ఇందిరకవిత్వం 10.ఒక్క సారి రారాదా!   11. దుర్ముఖీ నీవు సుముఖివే 12.  సాగనంపేస్తా   13.గత సంవత్సర మాతృమూర్తి  14. ఆమనిలో  15.ఆమని ఆగమనం 16. అరుదె౦చెను యుగాది 17. ముష్టి భక్తులు! 18. ఉగాది ప్రత్యేకం 19. పుస్తక సమీక్ష: అమృతవాహిని 20.విశ్వనాధ నవలలు – ఒక విహంగవీక్షణం: భగవంతుని మీది […]

కార్టూన్ పోటీ విజేతలు – కార్టూన్లు

ఉగాది సందర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎంతోమంది కార్టూనిస్టులు ఉత్సాహంగా తమ కార్తూన్లు పంపించారు. అందులో విజేతలెవరో నిర్ణయించడం కష్టమే అనుకుని ప్రముఖ కార్టూనిస్ట్, గురుతుల్యులు జయదేవ్ గారిని సంప్రదించగా వారు సంతోషంగా ఈ బాధ్యత తీసుకుని ఐదుగురు విజేతలను ఎంపిక చేసారు. ఈ ఏప్రిల్ ఉగాది ప్రత్యెక సంచికలో విజేతల కార్టూన్లు ప్రచురింపబడతాయి. మిగిలిన వాటిలో సాధారణ ప్రచురణకు తీసుకున్నవి వరుసగా రెండు మూడు నెలలు ప్రచురింపబడతాయి. ఈ […]

కవితల పోటీ విజేతలు – కవితలు

దుర్ముఖి నామ సంవత్సర శుభారంభ వేల ఉగాది పండగ సందర్భంగా మాలిక పత్రిక మొదటిసారిగా నిర్వహించిన కవితల పోటీలో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కవితలకు న్యాయనిర్ణేతలుగా డా.మధు ( HCU), డా.సీతాలక్ష్మిగారు వ్యవహరించారు. అన్ని కవితలను పరిశీలించిన తర్వాత విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ కవితల పోటీని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించైనా గౌతమిని అభినందిస్తూ విజేతలకు కూడా బహుమతులు, నూతన సంవత్సర  శుభాకాంక్షలు. మొదటి బహుమతి: సిరి వడ్డే   2. రెండవ బహుమతి: విజయ […]

అనువాదం – దొరికిన సిరి

అనువాదం:-బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి మూల రచన: సి.ఎన్.ముక్తా మూలం: ఉత్థాన (కన్నడ  పత్రిక) ప్రచురణకాలం- 2015 అక్టోబర్.     లేనిది కోరేవు యున్నది వదిలేవు ఎందుకు రగిలేవొ యేమై మిగిలేవొ మౌనమె నీ భాష ఓ మూగమనసా!   ఎక్కణ్ణించో సన్నగా ఆకాశవాణి లోంచి పాట వినిపిస్తోంది. ఉన్నది, మనదైనది అయిన దానిమీద ఎప్పుడూ అసంతృప్తి ఎందుకో మనకు? ఎప్పుడూ ఇంకా ఏదో లేదనే అసమాధానమే! దీనికి దాదాపు ఎవ్వరూ మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరం […]

యాచకులు

 రచన:  – పుక్కళ్ళ రామకృష్ణ   ఇంటి ముందాగున్న కారులో కూర్చోడానికి వెళ్తున్న సుచిత్రను చూసి చిరునవ్వు చిందించింది గేట్ ముందు నిల్చున్న కనకమ్మ. కనకమ్మ చేతిలో ఏభై రూపాయల నోట్ పెట్టి కార్లో వివేక్ పక్కన వెళ్లి కూర్చుంది సుచిత్ర. కారు కొంచెం దూరం వెళ్ళాక “కాలువలు ఊడ్చడానికి జీతాలు దొరుకుతాయి వాళ్లకు. లెక్కాడొక్కా లేకుండా వారానికి రెండు మూడు సార్లు కనకమ్మకు డబ్బులిస్తుంటావ్! డబ్బులకలవాటు పడితే లంచమిస్తే గానీ పని చేయరు” అన్నాడు వివేక్. […]

అమ్మ మనసు

రచన:- పి.లక్ష్మీ వసంత   అమ్మా! అంటూ తనయ్ పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒళ్ళో వాలి పోయాడు, “అబ్బా! అలా మీద పడిపోకురా బాబూ! “ఎంత పెద్ద వాడైపోతున్నాడు, అంటూ ముద్దుగా విసుక్కుంటూ లేచాను. వాడికే దోటి చేసి పెట్టాలి. సాయంత్రం ఉపహారం ఇప్పుడు ఈయన మటుకు ఈయన చేతులూపుకుంటూ ఉదయమూ, సాయంత్రమూ  నడక  అంటూ  ఇంట్లోంచి పారిపోతారు,  తనకి  తప్పదు  కదా! చంటివాడు ఎదుగుతున్న పిల్లాడు ఇంకా నాలుగో తరగతి ఇపుడు,ఎప్పటికి తేరేను? తీరేను? నాబాధ్యతలు అంటూ మోకాలు మీద చేయాంచి లేస్తూ, ఈ రమణమ్మ ఇవాళ కూడా వనిలోకి రాలేదు, తన కష్టాలు తనవి. మొగుడు  తాగి వచ్చి కొట్టాడు అంటూ చూపిస్తుంది, నువ్వూ తిరిగి కొట్టు, ఓ కర్రపుచ్చుకుని అంటే “అమ్మో! చంపేస్తాడు” అంటుంది.  నాలుగిళ్ళల్లో పని చేస్తూ పోషిస్తున్నది తనే, ఓపిక ఉంటే, తాగని రోజు పనిలోకి వెళతాడుట, […]

అసమాన అనసూయ ఆలపించిన జీవనరాగం

పుస్తక సమీక్ష  -సి.ఉమాదేవి ఆత్మకథ రాయాలంటే ముందు మనమేమిటో మనకర్థం కావాలి. అర్థమయాక వరుసక్రమంలో జ్ఞాపకాలను చక్కని మాలగా అల్లగలగాలి. వయసు మీరిందనడానికి గుర్తు దృష్టి,వినికిడి లోపాలుగా పరిగణిస్తారు.కాని అత్యాధునిక చికిత్సావిధానాలతో వీటిని అధిగమించగలుగుతున్నాము. అయితే ఎంత సాధన ఉన్నా మతిమరపును జయించడం కాస్త శ్రమే. కాని వార్ధక్యానికి వరం చిన్ననాటి జ్ఞాపకాలు బహుపసందుగా గుర్తుకురావడం.తొంభై నాలుగు సంవత్సరాల మెదడు కురిపించిన మెరుపులే కాదు మనసులోని ఉరుములు చవి చూపారు కళాప్రపూర్ణ డా.అవసరాల (వింజమూరి) అనసూయా దేవి. […]

అక్షరాల సాక్షిగా…

 సమీక్ష – వాణి కొరటమద్ది                “మంజు యనమదల” గారి “అక్షరాల సాక్షిగా… నేను ఓడి పోలేదు” కవితాసంపుటి పై నాలుగుమాటలు ‘మౌనం రాల్చిన అక్షరాల్లో మసక బారిన జ్ఞాపకాలు కదులుతున్న కాలంలో చెరిగిపోని ఆనవాళ్ళు’ ఆమె పేర్చిన అక్షరాలు. అంతులేని ఆత్మ విశ్వాసాలు పదాల పొందికలో లోతైన భావాలు. తన గెలుపుకు అక్షరాలే సాక్ష్య౦ అంటూ కవితా సంపుటి పేరు లోనే విజయాన్ని ప్రకటించారు ఇలా ….”అక్షరాల సాక్షిగా … నేనోడిపోలేదంటు…….”. మనసుతో […]

అలరించే సైన్స్ ఫిక్షన్ (కల్పన) నవల – నీలీ ఆకుపచ్చ

సమీక్ష   –పుష్యమీ సాగర్    రచయిత– చిత్తర్వు మధు     తెలుగులో సైన్స్ ఫిక్షన్ నవలలు ఎన్నో వచ్చాయి. అవన్నీ వేటికవే విభిన్నత కలిగినవి అని చెప్పవచ్చు. సైన్స్ ఫిక్షన్ ని పాఠకులు ఎక్కవగా ఇష్టపడరు అని చాలా మంది అఫోహ పడతారు. కాని ఈ “నీలీ-ఆకుపచ్చ” చదివాక ఖచ్చితంగా ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.  కొంత విజ్ఞానాన్ని, మరికొంత వినోదాన్ని అందిస్తూ సాగిపోయే ఈ నవల ఆద్యంతం ఆకట్టుకుంటుంది.   “విశ్వశక్తి” అనే శక్తి […]

సామాజిక మాధ్యమమా? మాజాకానా?

 రచన:  – వెంకట్ యస్. అద్దంకి సామాజిక మాధ్యమమా మాజాకానా అనిపిస్తుంది ఒకొక్కసారి. ఎక్కడెక్కడి వారో స్నేహితులు అయిపోతారు, కొన్ని స్నేహాలు వివాహబంధం గా మారుతున్నాయి. కొన్ని స్నేహాలు హత్యలకు, మానభంగాలకు దారితీస్తున్నాయి.. ఎందుకు అంటే “మన బంగారం మంచిదైతే ఎవర్నో తప్పు పట్టక్కరలేదని” సామెత. ఎవరైనా తమ మనసు, బుద్ధిని బట్టే నడుచుకుంటారు. అంతర్జాలంలో నిక్షిప్తమయి వున్న విజ్ఞాన పరిజ్ఞానం ఒకరినుండి ఒకరికి, ఒక చోట నుండి మరో చోటకి రవాణావ్వడానికి సామాజిక మాధ్యమాలు అవసరమే. […]