April 20, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2016 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head అనివార్య కారణాల వల్ల గతమాసపు మాలిక పత్రిక విడుదల కాలేదు. దానికి క్షమాపణలు కోరుతున్నాము. ఒక నెల పత్రిక రాకున్నా ఆ లోటును సంపూర్ణంగా భర్తీ చేస్తూ మరిన్ని ఎక్కువ కథలు, వ్యాసాలు, కవితలు, కొత్త సీరియళ్లతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది మాలిక  పత్రిక.. రచయితలు, పాఠకులు, మిత్రులు ప్రోత్సాహం, ఆదరణకు మనఃఫూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాసపు సంచికలోని  30 విశేషాలు తెలుసుకుందాం.. తీరిగ్గా చదువుకోండి. […]

చపలమహర్షి తపస్సు – హాస్యకథల పోటి – మొదటి బహుమతి

రచన: ధనికొండ రవిప్రసాద్ పూర్వకాలంలో మహర్షులు తపస్సు చెయ్యటం, స్వర్గలోకం నించి అప్సరసలు దిగొచ్చి ఎంచగ్గా వాళ్లని సుఖపెట్టి పోవటం ఉండేది. ఈకాలంలో కూడా స్వామీజీలు, యోగులు తపస్సులు చేస్తూనే ఉన్నారు కానీ అప్సరసలు రావటం ఆగిపోయింది. అలా జరగటానికి గల కారణమే ఈ కథ. ************ కలియుగారంభంలో చపలమహర్షి ఘోరాతిఘోరమైన తపస్సుచేస్తున్నాడు. ఆ తపోగ్నికి స్వర్గలోకంలో టెంపరేచర్ భూలోకంలో మే నెలలో రామగుండంలో ఉన్న టెంపరేచర్ని మించిపోయి దేవేంద్రుడు గాబరా పడిపోయాడు. దేవగురువైన బృహస్పతిని రప్పించి […]

“ఆమె అతడిని కొట్టింది” – హాస్యకథల పోటి – రెండవ బహుమతి

రచన: కె.ఎన్.మూర్తి “వీర సుత్తి” పత్రికలో ఆ కథ చదవగానే “సుత్తిశ్రీ” కి పట్టలేని ఆవేశం వచ్చింది. బీపీ పెరిగి కాసేపు మనిషి చెట్టు కొమ్మలా ఊగిపోయాడు. “నా కథనే కాపీ కొట్టి బహుమతి గెలుచుకుంటావా సీతా ! నీ సంగతి చూస్తా! ఫేస్ బుక్ లో నిన్ను ఎండ గడతా! “అంటూ భీకర శపథం ఒకటి చేసి ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యాడు సుత్తిశ్రీ అనబడే సుత్తి శ్రీధర్. “వీర సుత్తి సంక్రాంతి ప్రత్యేక […]

ఫ‌ట్‌…..ఫ్లాప్‌…..ప‌ర‌మ‌చెత్త‌…..వావ్‌ – హాస్యకథల పోటి – రెండవ బహుమతి

రచన: ముచ్చర్ల రజనీ శకుంతల హీరో, విల‌న్, హీరోయిన్‌, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ మైకుల మీద మైక్ ట్రైస‌న్ మాదిరిగా ఫిటింగ్‌లు మొద‌లుపెట్టారు. టీవీఛానెల్స్ వాళ్లు చిద్విలాసంగా …. మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంటే….ఆ మ‌ర్డ‌ర్‌ని ఏ యాంగిల్‌లో తీయాలి…. మ‌ర్డ‌ర‌వుతున్న వ్య‌క్తి ఫీలింగ్స్‌ని ఎలా క‌వ‌ర్ చేయాలి…. ఈ మ‌ర్డ‌ర్ మీద జ‌నం అభిప్రాయాలు ఎలా క‌రెక్ట్ చేయాలి…అని ఆలోచిస్తున్నంత చిద్విలాసంగా తిల‌కిస్తున్నారు. *ఫ‌ట్టు…….ఫ్లాపు* అన్నాడు వెధ‌వ డైరెక్ట్ * ప‌ర‌మ‌చెత్త‌* అన్నాడు హీరోయిన్ * తూ…..యాక్* అంది ఛానెల్స్ […]

బ్లాక్ మెయిల్ – హాస్యకథల పోటి – మూడవ బహుమతి

రచన: వి.శశి కళ ‘త్వరగా కానీ ” పులిపిరి మొహం తొందర పెట్టింది పబ్లిక్ ఫోన్ డైల్ చేస్తున్న కోర మీసం వేళ్ళు వణికాయి . ”ఉండరా! చేస్తున్నాను ” ”రింగ్ అవుతుందా ?” ”హా ” తలూపాడు ”మాట్లాడు మాట్లాడు ” తొందర చేసాడు . ఊరుకోరా అన్నట్లు చేయి ఆడించాడు , ”హలో ఎవరు ?” అవతలనుండి ఆడ గొంతు . ”నేను ఎవరైతే ఏంటి ? చెప్పేది విను ” కటినంగా అన్నాడు […]

నాన్నమ్మొస్తో౦ది…. హాస్యకథల పోటి – 3 బహుమతి

నాన్నమ్మొస్తో౦ది…. రచన: అనురాధ (గంటి సుజల) “ మీ నాన్నమ్మగారు వస్తున్నారు” అన్న శ్రీమతి మాటలకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు కార్తీక్. “ఎప్పుడొస్తో౦ది?నీకెలా తెలుసు? అమ్మ ఫోన్ చేసి౦దా”?అ౦టూ వరసగా భర్త వేసిన ప్రశ్నలకు ఆశ్చర్య౦లో మునిగిపోయి౦ది భార్గవి. ఇదేమిటి? వాళ్ళ నాన్నమ్మ వస్తో౦ద౦టే ఈయనలో ఇ౦త క౦గారు! అన్నఅనుమాన౦ పొడసూపి౦ది. ఆవిడ౦టే ఈయనకు ఇష్ట౦ లేదా!అన్న డౌట్ అనుమాన౦ వచ్చేసి౦ది. బహుశా చిన్నప్పుడు ఈయన చేసే అల్లరి భరి౦చలేక ఈయనతో గోడ కుర్చీ గానీ వేయి౦చి౦దా! […]

కళా చికిత్స (ఆర్ట్ థెరపీ, Art therapy) ఒక ఆత్మ వైద్యము – రాధికా వెంకట్

ముఖాముఖి జరిపినవారు:-శ్రీసత్య గౌతమి జీవనపరుగులో మనిషి ఎన్నో భావోద్వేగాల మధ్య ఊగిసలాడుతుంటాడు, మానసిక ఒత్తిళ్ళకు గురవుతుంటాడు. అటువంటప్పుడు తనలో ఉన్న కళ అది ఏదయినా కావొచ్చు నృత్యం, గానం, మిమిక్రీ, క్రీడలు, చిత్రలేఖనం, కవిత్వం, హ్యాండ్ క్రాఫ్ట్స్ గుర్తించి సాధన చేసినప్పుడు ఆ సాధనే మానసిక పరివర్తనకు దారితీస్తుంది, అందుకే ఇది ఒక వైద్యము అంటారు కాలిఫోర్నియా, అమెరికా నుండి రాధికా వెంకట్. రాధికా వెంకట్ భారత్ లో క్యాన్సర్ బయాలజీ ఫీల్డ్ లో పి.హెచ్.డి పట్టా […]

బ్రహ్మలిఖితం – 1

రచన: మన్నెం శారద మార్గశిర మధ్యం… బ్రహ్మీ ముహూర్తపు వేళ! వెన్నెల ఎర్రబారుతున్న సమయం. భువిపై కురుస్తోన్న మంచు – చంద్రకిరణాలతో సఖ్యం పెంచుకొని మరింత ఘనీభవించి నేలంతా తెల్లని గొంగళి పరచినట్లుంది. సృష్టిలోని యావత్ ప్రాణికోటి వెచ్చదనం కోసం గదుల్లోకి, నెరియల్లోకి, గుహల్లోకి దూరి ముడుచుకొని ఆదమరచి నిదురపోతున్న ఆ సమయంలో వాల్తేరు అప్‌లాండ్స్‌లోని ఒక ఇంటి రెండో అంతస్తులోని ఈశాన్య భాగపు గదిలో చెదరని ఏకాగ్రతతో కనులు మూసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేస్తోంది […]

సస్పెన్స్ కథలు – 1. పొరుగిల్లు

రచన: మధు అద్ధంకి సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన రాహుల్ కి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో సామాన్లతో నిండిన లారీ కనిపించింది.. కొత్తగా ఎవరో వచ్చుంటారు అనుకుని లిఫ్ట్ లో రెండో ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడ తన పక్క అపార్టుమెంట్లో హడావుడిగా తిరుగుతున్న మనుషులను చూసి “ఓహో” ఈ అపార్ట్మెంట్లోకి వచ్చారా?” అనుకుని లోపలికి నడిచాడు. బట్టలు మార్చుకుని రిలాక్స్ అయ్యి కాఫీ తాగుతూ టీ.వీ చూస్తున్నాడు. “ఆపు నీ నస. ఇంత పని ఉన్నప్పుడు […]

మాయానగరం – 29

రచన: భువనచంద్ర కొన్ని సంఘటనలకి కారణం కనిపించదు. కానీ అవి జరుగుతాయి. కొందరు దాన్నే’ఈశ్వరేఛ్చ’అంటే , మరి కొందరు మరో పేరు పెట్టే ప్రయత్నం చేస్తారు. పరమశివం సడన్ గా తేరుకున్నాడు. జీవితాంతం ’మాటరాని’ మనిషిగా బ్రతకాలని చెప్పిన డాక్టర్. శ్రీధర్ మాట పొల్లుపోయింది. మూగమణి జాలితో పెట్టిన ప్రసాద ’మహిమ’ కావొచ్చు, ఫాదర్ డేవిడ్ దయాపూరితమైన చూపులు కావొచ్చు. లోకంలో అతనికింకా ’నూకలే’గాక ’మాటలు’ కూడా మిగిలివుండటం కావొచ్చు. ఏమైతేనే… పరమశివం మళ్ళీ మనిషయ్యాడు. చావు […]