March 28, 2024

మాలిక పత్రిక అక్టోబర్ 2016 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Headపాఠకులందరికీ దసరా , దీపావళి శుభాకాంక్షలు.. ఆసక్తికరమైన కథలు, సీరియళ్లు, వ్యాసాలతో, విభిన్నమైన కథాంశాలతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మీ ముందుకు వచ్చింది.. సంగీతం,సాహిత్యం, ఆధ్యాత్మికం, సస్పెన్స్ మొదలైన ఎన్నో అంశాలు ఈ సంచికలో మీకు లభిస్తాయి.. ప్రమదాక్షరి కథామాలిక పేరిట స్నేహం శీర్షికన వచ్చిన కథలను, వాటిగురించిన విశ్లేషణ తప్పకుండా చదవగలరు. మీ రచనలను మాకు పంపవలసిన చిరునామా: editor@maalika.org 1. అనసూయ 2. […]

అనసూయ – స్నేహం

రచన: కామేశ్వరీదేవి చెల్లూరి ఆలోచిస్తోంది అనసూయ. తనలో తనే తెగ మధనపడుతోంది. మనసులో ఆందోళన. ఏం చేయాలి? కరుణకి చెప్పాలా? వద్దా? చెప్తే తనని అసహ్యించుకుంటుందేమో! కానీ ఇప్పటికీ చెప్పకపోతే ఎలా? దుఃఖం తన్నుకొస్తోంది. సన్నగా తలనొప్పి మొదలయింది. ఇంక చేసే పని వదిలి కూర్చుండిపోయింది. కళ్ళమ్మట కన్నీరు ధారగా కారసాగింది. రాఘవరావు పూజ కానిచ్చి ప్రసాదం తీసుకుని నెమ్మదిగా భార్య దగ్గరికి వచ్చాడు. ఉలుకూ, పలుకూ లేని భార్యని చూసి అతని హృదయం ద్రవించింది. భార్య […]

‘తరగని సిరి’ – స్నేహం

రచన: వాలి హిరణ్మయిదేవి పరుగున వచ్చి కదులుతున్న ట్రైన్ ని ఎక్కేసి, తన సీట్ వెదుక్కుని కూర్చున్నాడు ప్రమోద్. వాటర్ బాటిల్ తెరిచి, కొన్ని నీళ్ళు తాగి కాస్త రిలాక్స్ అయ్యాక ఎదుటి సీట్లో కూర్చున్న వారి వంక చూసాడు. విశాలమైన ఫాలభాగం మీద చిన్న నల్లని స్టికర్ బొట్టుతో, కంటికి ఎడమ వైపు గాయం తాలూకు మచ్చతో ఉన్న యువతి వంక చూసి, ఏదో అనుమానం తోచినట్టుగా మరోసారి ఆమె వైపు దృష్టి సారించాడు ప్రమోద్. […]

స్నేహం పెంచుకునే మార్గం – స్నేహం

రచన:-శ్రీసత్య గౌతమి, పి.హెచ్.డి. సుశీలకు ఇప్పుడు అరవై ఏళ్ళు. ఒక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగినిగా పనిచేసి ఏభై ఎనిమిదేళ్ళకి పదవీ విరమణ చేసింది ఉద్యోగంలో ఉన్నప్పుడు చెయ్యాలనుకొని కాలపరిమితి వల్ల చెయ్యలేకపోయినవన్నీ రిటైర్ అయ్యాక చెయ్యాలనుకొనేది. ఉదాహరణకి కన్నవాళ్ళతో కలిసి తీర్ధయాత్రలకెళ్ళాలనో లేక ఏ సుందర ప్రదేశం చూడాలనో. ఊహు … అసలు వీలే పడలేదు, ఈలోపుల వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తమ్ముళ్ళ, చెల్లెళ్ళ బాధ్యతలున్నాయని పెళ్ళిని వాయిదా వేసుకుంటూ వెళ్ళేసరికి, ఆ పెళ్ళి వయసు కూడా దాటిపోయింది, […]

బ్రహ్మలిఖితం – 2

రచన: మన్నెం శారద రక్తంలో ముంచి తీసినట్లున్న ఎరుపురంగు జడలు కట్టిన వెంట్రుకలు, వళ్ళంతా రాసుకున్న బూడిద, మురికి బారిన కాషాయరంగు వస్త్రాలు, మెడలో రుద్రాక్షలు – చూడగానే భయం కొలిపే ఆకృతిలో వున్న ఒక సాధువులాంటి వ్యక్తి కార్తికేయన్ ఎదురుగా నిలబడి వున్నాడు. స్మశానాన్ని చూసి చలించని కార్తికేయన్ లేత శరీరం అతన్ని చూసి చిన్నగా వణికింది. అతనదోలా నవ్వాడు. “భయపడుతున్నావా?” “ఊహూ” అబద్ధం చెబుతూ లేచి నిలబడ్డాడు కార్తిక్. “ఎవరు పోయేరు?” “మా అత్త” […]

మాయానగరం – 30

ఒక కుర్రాడు కాశీ వెళ్ళాలని బయలుదేరాడు. కారణం తల్లిదండ్రుల చితాభస్మాన్ని గంగలో కలపడానికి. ఆ రోజుల్లో బస్సులు, రైళ్లు, విమానాలూ లేవు. కాలినడకన పోవాల్సిందే. అదృష్టం బాగుంటే కాశీకి, లేకపోతే కాటికి. మొత్తానికి ఓ నలభై రోజుల పాటు నడిచి నడిచి ఓ నగరం చేరాడు. అక్కడి పెద్దలు యీ కుర్రవాడికి జననీ జనకుల మీద వుండే భక్తిని చూసి చక్కని భోజనాలు వసతులూ అమర్చి ‘సేద ‘ తీరమన్నారు. అక్కడో యువతి యీ కుర్రాడి మీద […]

అద్దె గర్భం(సరోగసీ)

రచన: టీవీయస్. శాస్త్రి తుషార్ కపూర్ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. కానీ తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. కావాల్సినంత డబ్బులుంటే చాలు అద్దె గర్భం ద్వారా బిడ్డను కనొచ్చు! ఈ విధంగా నేడు చాలామంది బిడ్డలకు పేరెంట్స్ గా మారుతున్నారు!వైవాహిక వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మన దేశం లాంటి దేశంలో వీటిని ప్రోత్సహించటం ఎంతవరకు మంచిది?పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడని తుషార్ అద్దె గర్భంతో తాజాగా తండ్రయ్యాడు. ప్రసిద్ధ హిందీ నటుడు జితేంద్ర కుమారుడైన తుషార్ కపూర్ అవివాహితుడు. అతడికి […]

Gausips – ఎగిసే కెరటం-7

రచన:-శ్రీసత్య గౌతమి రాకేష్ నలుగురు స్నేహితులతో కలిసి పైకి వస్తున్నాడు. బాల్కనీ నుండి సింథియా వాళ్ళని చూసి వెళ్ళి తలుపు తీసింది. అందరూ లోపలికి వస్తూనే సింథియాని ఎంతో ఆప్యాయంగా పలుకరించేశారు, సింథియా వాళ్ళకి క్రొత్తయినా. సింథియా పొంగిపోయి వాళ్ళకి అదే స్పీడుతో ఆప్యాయతను కురిపించి లోపలికి ఆహ్వానించింది. వచ్చిన నలుగురు స్నేహితుల్లో ఒకరు ఆడవారు మధు. అందరూ ఎంతో ఆప్యాయంగా కలిసిపోయారు. రాకేష్ అందరికీ డ్రింక్స్ కలిపేశాడు ఎవరికి ఏది కావాలంటే అది మార్గరిటా కాక్టైల్స్, […]

జీవితం ఇలా కూడా ఉంటుందా? 6

రచన: అంగులూరి అంజనీదేవి అబ్బురపడి చూశాడు సతీష్‌చంద్ర. ఇన్నిరోజులు ధృతిని చిన్నపిల్ల అనుకున్నాడు కాని ఆమెకు కూడా కొంత అవగాహన వుందనిపించింది. ఆమె అంతటితో వదిలెయ్యకుండా ”దేని గురించో వద్దు. మీ గురించే చెబుతాను వినండి!” అంది. ఏం చెబుతావ్‌ అన్నట్లు సరదాగా చూశాడు సతీష్‌చంద్ర. ”మీ మీద మీకు ప్రేమ లేకుంటే దేశాన్ని ప్రేమించగలరా?” అంది. ”ఇది చాలా వాస్తవం ధృతీ! నేను సైన్యంలోకి వెళ్లిందే నాకోసం. నా ఉనికిని నేను గౌరవించుకోవటం కోసం…” ”అదే […]

శ్రీకృష్ణ దేవరాయలు – 6

రచన: విజయ్ భాస్కర్ రాజు ఎన్నెన్నో విజయాలను అందించి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఘనాపాటిగా తీర్చిదిద్దిన తుళువ నరసానాయకుడు ఉన్నఫళంగా అశ్వస్థతకు గురవ్వడం , ఆ రుగ్మత నుండి కోలుకోలేక మృత్యువాత పడడం విజయనగర సామ్రాజ్యాన్ని విస్మయానికి గురిచేసింది. నరసానాయకుడు అవసాన దశలో ఉన్న సమయం లో రాజ్య కార్యకలాపాలు కుంటుపడ కుండా ఉండేందుకు తన పెద్ద కుమారుడైన వీరనరసిమ్హ రాయలును తన స్థానంలో నియమించి బాధ్యతలు అప్పగించాడు. ఆ మేరకు చక్రవర్తి ఆమోదం కూడా లభించింది. […]