!! కోరుకొండ నుంచి పాపి కొండల వరకు !!

రచన: -పుష్యమీ సాగర్ ..

img_20161009_154801

మిత్రులకు వందనము, చాలా రోజులు అయింది మిమ్మలనందరిని పలకరించి …మరల ఇలా మీ ముందుకు వచ్చాను ..పని ఒత్తిడి వలన రాలేకపోయాను మన్నించండి ..ఇవాళ యాత్ర లో మీకు అద్భుతమైన ప్రదేశం గురించి చెప్పబోతున్నాను (నాకు తెలిసి నేను చెప్పబోయే ప్లేస్ గురించి తెలిసే ఉంటుంది ). అదే రాజమండ్రి అలియాస్ రాజమహేంద్రవరం. ఇంకా దాని చుట్టు పక్కల ప్రదేశాలు గురించి చెప్పబోతున్నాను ..చాలా రోజులనుంచి ఇన్ ఫాక్ట్ సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాను రాజమండ్రి ని చూడాలి గోదావరి జిల్లాల లో ఉన్న పర్యాటక ప్రదేశాలని కవర్ చెయ్యాలని …అదిగో ఇన్ని రోజులకి కుదిరింది (చిన్నప్పుడు చూసాను బట్ అంతగా గుర్తు లేదు ప్లస్ అభివృద్ధి కూడా చెందలేదు ) . ఆఫీస్ కి ఎంచక్కా త్రీ డేస్ లీవ్ పెట్టి మరి బయలుదేరాను ..అన్నట్టు చెప్పలేదు కదు …నేను ఒక్కడినే కాదండోయ్ మా చెల్లెలు ..వాళ్ళ పాప , చిన్ని బాబు , నేను మా కమల, …అక్టోబర్ 6 ఉదయం బయలుదేరితే సాయంత్రం 5 కి రాజమహేంద్రవరం లో దిగాము ..చెప్పొద్దు ఎంత సంతోషమనిపించిందో …ఇంతకు ముందు ఎన్నో సార్లు వైజాగ్ కి వెళ్లినా (కమల వాళ్ళది వైజాగ్ ) రాజమండ్రి ని దాటుకుంటూ వెళ్లడమే కానీ ఆగింది లేదు అన్నమాట…కమల వాళ్ళ మామయ్య గారు రాజమండ్రి లో వున్నారు ..వారు రిసీవ్ చేసుకొని వారింటికి తీసుకెళ్లారు …ఆ సాయంత్రం ప్రయాణిక బడలిక వలన అలిసి పోయి అంతా గప్ చుప్ గా తిని పడుకున్నాము ..

img_20161009_135337

ఇక ఉదయమే లేచి త్వరగా తయారు అయి …”కోరుకొండ” చూడటానికి బయలుదేరాము ..కోరుకొండ అంటే సైనిక్ స్కూల్ వున్న కోరుకొండ కాదు అది వేరే ప్రదేశంలో ఉంది …ఇక్కడికి రావడానికి …ఇన్ ఫాక్ట్ ఈ ట్రిప్ వేయడానికి మెయిన్ కారణం మా చెల్లెలు అను చెల్లించాల్సిన మొక్కు ….తాను గూగుల్ తల్లి ని కాంటాక్ట్ చేస్తే ఈ ప్లేస్ చూపించింది అంట ..(తనకి Lord Narasimha స్వామి అంటే పిచ్చి భక్తి లెండి, ఎక్కడ ఉంటే అక్కడికి పోదాం అంటుంది ). మొత్తానికి ఆలా బయలుదేరాము …మేము ఉన్న ఇంటి నుంచి ఆ ప్రదేశం దగ్గరే….గోకవరం బస్టాండ్ నుంచి “కోరుకొండ” కి కేవలం 20 కిలోమీటర్ లే …”పల్లె వెలుగు” బస్సు లో ….పచ్చని పంట పొలాల మధ్య నుంచి, పిల్ల కాలువల అందాలు, భానుడి ఉదయపు సంధ్యారాగలను , పక్షుల కువ కువలను ఆస్వాదిస్తూ …సరదాగా 30 నిమిషాల్లో కోరుకొండ చేరుకున్నాము …అయితే కోరుకొండ బస్టాండ్ నుంచి మరల 2 కిలోమీటర్ ఆటో లో వెళ్ళాలి ….అక్కడ ఆటో పట్టుకొని దేవస్థానం ఉన్న చోటుకి చేరుకున్నాం …అక్కడ రెండు ఆలయాలు వున్నాయి ఒకటి దిగువ ఆలయం , ఎగువ ఆలయం ….అచ్చు “అహోబిలం ” లాగ….ఆ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఓ అద్భుతమైన భావన కలిగింది ..మాటల్లో చెప్పలేనిది …ముందుగా దర్శనం చేసుకొని …ఎగువ స్వామి ని దర్శించుకోవడానికి బయలుదేరాము ..అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ….ఆ కొండ ఎక్కాలి అంటే మొత్తం గా 615 మెట్లు ఎక్కాలి ..అది కూడా నిట్ట నిలువుగా ఉండే మెట్లు ….సాధారణంగా మెట్ల మధ్య దూరం …ఎక్కువగా ఉంటుంది అది కాకుండా ఏటవాలుగా ఉంటాయి కానీ ఇక్కడ అలాంటిది ఏమి లేదు దగ్గర దగ్గర గా ఉన్నాయి ..ఉదయం 9 గంటలకి మొదలుపెడితే 9 45 వరకు పైకి చేరుకున్నాం …మా ప్రయాణం లో ఆలయ పూజారి గారు కలిశారు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు …వారు కూడా ప్రతి రోజు 9. 30 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే ఉంటారు అంట….ఎందుకంటే మరి రోజు మెట్లు ఎక్కాలి మరి ..మేము శనివారం వెళ్ళాం కాబట్టి భక్తులు ఎక్కువగానే వున్నారు అందులోనూ దసరా టైం ఏమో భవాని భక్తుల సందడి కూడా ఎక్కువగానే వుంది …ఇక మెల్ల గా ఒక్కో మెట్టు ఎక్కుతూ కొండ పైకి చేసురుకున్నాం …

img_20161009_154446
నిజంగా నేను ఎప్పుడు చూడండి అద్భుతమైన ప్రదేశం అది ….ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే అప్పటివరకు వున్నా అలసట ఒక్కసారి గా మాటు మాయం అయ్యింది ….5 కిలోమీటర్ల దూరం వరకు కనిపించ్చే కోరుకొండ గ్రామం…పచ్చని తివాచి పరిచినట్టు వుండే పంటపొలాలు …దూరంగా ఎటు చూసిన కొండలతో కవర్ చేసే ప్రకృతి …వాహ్ …అనిపించింది ..ఇక దాని నుంచి గుడికి వస్తే ఇది మరో మేలి ముత్యమే ……రెడ్డి రాజులచే నిర్మించబడిన మందిరం చూడటానికి రెండు కళ్ళు చాలవు …ఇక్కడి దేవుడు స్వయంభువు అని చెప్తారు ..ఆలయ పూజారిగారు నివేదన చేయడానికి అరగంట టైం తీసుకున్నారు. ఈ లోపు అక్కడ వున్న పరిసరాలు గమనించాను …మందిరం గోడలపై, అలాగే .. స్తంభాలపై చెక్కి ఉన్న శిల్పకళా వైభవం అద్భుతం …..రామాయణ కధను ఎంత బాగా చెక్కారంటే నిజంగా మన ముందు జరుగుతుందా అన్నంత బాగా తీర్చిదిద్దారు …ప్రతి స్తంభం పైన లార్డ్ నరసింహుడి ఉగ్ర రూపాన్ని చూసాను …అంటే మనం ఎప్పుడు చూసే ఫోటో ఉంటుంది కదా రాక్షసుడిని తొడ పై పెట్టి పొట్టని చీల్చే సన్నివేశం ..అసలు నాకు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు ..నేను ఇక గాల్లో తేలుతున్నాను హ్యాపీనెస్ తో .

img_20161009_155625

ఈ లోపు గుడి తలుపులు తెరిచారు ….లక్కీ గా మాతోనే దర్శనం (మొదటి దర్శనం, ఎంత అదృష్టమో కదా ) మొదలు అయింది. చిన్న గుడి లోపల …జయ విజయలు కొలువై వున్నారు …అక్కడ …పరాశర మహర్షిచే ప్రతిష్టించిబడిన స్వామి విగ్రహం చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చింది . ఇక స్వామివారు వెలిసిన చోట పూజలు చేస్తున్నారు ..ఒకరి తరువాత ఒకరిని పిలిచి చూపిస్తున్నారు . చిన్న గుహలో చాలా చిన్నగా ఎంతో బాగున్నారు …(మీరు మంగళగిరి పానకాల స్వామి ని చూసి ఉంటే same to same అలానే వుంటుంది) .. …గోత్ర నామాలతో అర్చన చేయించారు …….ఒకటికి మూడు సార్లు చూసుకొని ….ఆనందం గా బైటికి వచ్చాము……ప్రకృతి దృశ్యాలని, రెడ్డి రాజుల శిల్పకళా వైభవాన్ని క్లిక్ చేసాను ….తెలిసింది ఏమిటి అంటే ..ఇది “కృతయుగం” నాటిదని తెలిసింది ….ఎంత పురాతనమో కదా….(రాజమండ్రి వాసుల భక్తిని మెచ్చుకొని తీరాలి) …తండోపతండాలు గా తరలివస్తూనే వున్నారు ..కానీ అయితే ఇపుడిప్పుడే అభివృద్ధికి నోచుకున్నట్టుంది …అన్నవరం దేవస్థానంవారు దీన్ని దత్తత తీసుకున్నారు అని తెలిసింది సరే…మొత్తానికి 11 గంటలకు పూర్తి అయింది. చిన్నగా దిగుదామని బయలుదేరాం …ఎక్కడం ఒక ఎత్తు అయితే ..దిగడం మరో ఎత్తు …జాగ్రత్తగా ఒక్కో మెట్టు దిగుతూ కిందికి వచ్చాము…మధ్యలో బోలెడు వానరాలు కిచ కిచ మంటూ పలకరించాయి ..కింద కుడి పక్కకు ఒక చిన్న అన్న సత్రం ఉంది …వారు ఏమి ఆశించకుండా యాత్రికులకు ఉచిత అన్నదానం చేస్తున్నారు …మాకు అప్పటికే దిగే సరికి 12 అయింది సరే ఎలాగూ దేవుడి దగ్గరకి వచ్చాము కదా..అన్న ప్రసాదం తీసుకొని వెళదాం అని …చక్కగా బోంచేసి ….మా వంతుగా కొంత సమ్పరించుకొని బయలుదేరాం …

తెలిసింది ఏమిటి అంటే కోరుకొండ కి కేవలం 6 కిలోమీటర్ ల దూరంలో నే “పాండవుల గుహలు ” “రాతి గుహలు ” ఉన్నాయి అవి కూడా చూడాల్సిన ప్రదేశం అని స్థానికులు చెప్పారు .వెళదామని నేను మా చెల్లితో పోరు పెడితే వద్దు అన్నారు …కాళ్ళు అప్పటికే బోలెడు నొప్పి లేస్తున్నాయి మేము రాము అని ..పిల్లలు ఒకటే గోల..కానీ నాకు దాన్ని చూడాలని వుండే…ఇక ఏమి చేస్తాం ..నలుగురితో నారాయణ కదా….చలో మరల రాజమండ్రికి పొలోమని పరిగెత్తాము ….మరల సిటీకి అదే రాజమండ్రికి 2 గంటలకి వచ్చాము ….అందరం బాగా అలసిపోయాము ఏమో కాస్త కునుకు తీసాము …ఇక సాయంత్రం ఏముంది అని ఆరా తీస్తే …”పుష్కర్ ఘాట్”లో ఇచ్చే ” గోదావరి హారతి ని తప్పక చూడాల్సిందే అని చెప్పారు …సరే అని సాయంత్రం 5 గంటలకి బయలుదేరి వెళ్ళాం …నిజానికి గోదావరిని అనుకోని చాలా ఘాట్ లు వున్నాయి . పుష్కరాల టైంలో చాలా అభివృద్ధి చేసినట్టుగా వుంది అంతా నీట్ గా క్లీన్ గా వుంది ..”సరస్వతి ఘాట్”, పుష్కర్ ఘాట్, శివాలయం ఘాట్ .., ఇంకా ఇలానే రెండు మూడు చూసాను .. భవాని భక్తుల సందడి చాలా చాలా కనిపించింది ..సరే అని సరిగ్గా సాయంత్రం 6 30 (టైం అటు ఇటు గా మారుతుంది ) కి “హారతి ” మొదలు పెట్టారు ….ఎంత అందం గా వుంది అంటే ఆ దృశ్యం ..పైన రైలు బ్రిడ్జి పైన నుంచి రైలు వెళ్తుంది ..ఆకాశం లో చందమామ …కింద లైట్ లు అన్ని ఆఫ్ చేసి హారతులు మాత్రమే …దీప కాంతులు నీళ్ల లపై రిఫ్లెక్ట్ అవ్వడం ఓహ్ ..!! సూపర్బ్ …….గంగ హారతులను ఎంత నిష్ఠ గా చేశారో …అంతే నిష్ఠ గా గోదావరి హారతులను చేశారు …మొత్తం 40 నిమిషాలు మరో లోకంలోకి తీసుకెళ్లారు …మాటలకు సరిపోవు అంత అద్భుతంగా వుంది …మొత్తానికి సాయంత్రం 7 గంటలకి ఇంటి బాట పట్టాము ..ఇంకా ధవళేశ్వరం బ్యారేజి , బ్రిడ్జి చూద్దామని మావాళ్ళతో అంటే “ఓపిక “లేదు బాబు కానిచ్చేయి ఇంటికి వెళదామని పోరు పెట్టారు ..నాకు వెళ్లాలని లేకున్నా తప్పక వెళ్లాల్సి వచ్చింది అయితే …మేము హారతులు ముందే “పాపి కొండలు” కు వెళ్లే అవకాశం ఏమైనా వుందా అని సెర్చ్ చేసాము …మేము వెళ్లిన మరుసటి రోజు ఆదివారం కావడంతో అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయంట……గవర్నమెంట్ టూరిజం వాళ్ళవి అసలు దొరకలేదు ..అతి కష్టం మీద …ఒక చోట మాత్రం పట్టుకోగలిగాము ..మనిషి ఒక్కరికి 650/- సరే అని మరుసటి రోజుకి “పాపి కొండల” టూర్ కి టికెట్స్ తీసుకొని ఇంటి బాట పట్టాము ..

img_20161009_151713

మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయాన్నే 7 గంటల కల్లా రమ్మన్నారు ..(అది కూడా పుష్కర్ ఘాట్) దగ్గరనే …సరే అని వెళ్ళాము ….అక్కడ నుంచి ..పోలవరం వరకు బస్సులో జర్నీ (గంట పడుతుంది ) ….నిజానికి పాపికొండల టూర్ మొత్తం పోలవరం నుంచి సాగుతుంది ..ఇదివరకు రాజమండ్రి నుంచి ఉండేది అని విన్నాము …ఇప్పుడు మార్చారంట…సరే లే అని మెల్లిగా 7 గంటలకు వెళితే అక్కడుంచి …కోటిపల్లి బస్టాండ్ కి తీసుకువెళ్లారు మధ్యలో ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కితే అదిగో 9 గంటలు అయ్యింది ..రాజమండ్రి నుంచి పోలవరానికి సరిగ్గా 10 గంటల కి దిగాము …ఇక ఆదివారం ఏమో కదా …పోలవరం స్టార్టింగ్ పాయింట్ దగ్గర రష్ అంటే రష్ ..బాబోయ్ ..ఒకేసారి 16 లాంచీ లు బయలుదేరుతున్నాయి …మా ట్రావెల్ ఏజెంట్ టికెట్ లు అయితే ఇచ్చాడు కానీ బోటు పేరు చెప్పడం మర్చిపోయాడు లక్కీ గా ఫోన్ చేస్తే అప్పుడు మళ్లీ బోట్ పేరు చెప్తే త్వరత్వరగా మా వాళ్ళని వేసుకొని బోట్ లో కి ఎక్కాము ..తస్స దియ్య ఎక్కే దాగా టెన్షన్ ..టెన్షన్ …. అప్పటికే చెమటలు ధారాళంగా కారిపోతున్నాయి (అలవాటు లేని వాతావరణం కదా..) హ్యూమిడిటీ ఎక్కువ ….AC బోట్ కావడంతో హమ్మయ్య ప్రశాంతంగా అనిపించింది
ఇక బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు బాగానే వుంది రెండు ఇడ్లి, ఒక వడ, కొంచం ఉప్మా …(అప్పటికే రాజమండ్రి టిఫిన్ రుచి చూసాం ) సరే వాళ్ళని ఎందుకు నిరుత్సాహపరచాలి అని లాగించేసాం అనుకోండి …ఇక మొదలు అయింది మరో ప్రకృతి దృశ్యమాలిక వీక్షణం …మెల్లిగా మొదలు అయినా ప్రయాణం సాగుతూ పోతూనే వుంది మొదట జానకి రాముడి ఆలయం …పోచమ్మ గుడి ..ఆ తరువాత చివరి మజిలీ అయినా పేరంటాల పల్లి …జానకిరాముడి ఆలయం దగ్గర ఇసుక మేటలు దూరంనుంచి కనిపించే కొండలు ..వాహ్ వాహ్ అసలు ఏమి చెప్పగలము ఫోటోలో బంధించడం తప్ప …అయితే ఈ గుడి దగ్గరనే …”జానకి రాముడు” నాగార్జున చాలా భాగం ఇక్కడే తీసారట అందుకనే ఆ పేరు అన్నమాట…ఇక ప్రతి చోట కేవలం 20 నిమిషాలకు మాత్రమే ఆగుతుంది …ఒకొకటి గా చూసుకుంటూ వస్తున్నాము …పోచమ్మ గుడి తరువాత దేవి పట్నం (మధ్యలో లంచ్ బాక్స్ లు అందించేది ఇక్కడే) …మరి మధ్య మధ్యలో తగిలే చిన్నచిన్న గ్రామాలూ వాటి పరిచయాలు అన్నీ బాగా చెప్పారు …పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రదేశం గురించి తెలుకుసుకున్నప్పుడు బాధేసింది ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే రాజమండ్రి నుంచి పాపి కొండల టూర్ ఉండదు ఏమో ఇక ..ఎందుకంటే అక్కడ ఆనకట్ట కడితే కొండలు వాటిని అనుకోని వున్నా గ్రామాలు ముంపుకి గురి అవుతాయి (అందుకే అక్కడి గిరిజనులు ….ఇంకా పర్యావరణ వేత్తలు వ్యతిరేకిస్తున్నారు ) ..నిజమే కదా..ప్రకృతి సంపదని అభివృద్ధి పేరుతో మనమే చేజేతులారా నాశనం చేస్తున్నాము …నీటిని చీల్చుతూ సాగిపోతున్న మా బోట్ సూపర్బ్ గా ముందుకు దూసుకు వెళ్తుంది …పర్యాటకుల వినోదం కోసం అక్కడి బాయ్స్ ఆటలు పాటలు..డాన్స్ లతో సందడి చేసారు …ఈ లోపు లంచ్ బోట్ లోనే కానిచ్చేశారు …(మొత్తం బోట్ కెపాసిటీ 150 ..అయితే అందరిని ఎక్కించరు కేవలం 120 మంది ని మాత్రమే ఎక్కిస్తారు , మిగతాది లగేజీ వుంటుంది కదా….విడతల వారీగా భోజనం చేసాము …ఇక ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసిన పాపికొండల వ్యూ పాయింట్ రానే వచ్చింది ….వామ్మో వాయ్యోఓ ఎంత అందం …అప్పుడే నేను కూడా వున్నాను అంటూ వాన విపరీతమైన వాన అయిన కూడా లెక్క చెయ్యలేదు ….అలా పాపి కొండల నడుమ వయ్యారంగా మా బోట్ సాగిపోతుంటే చిన్న పిల్లల మాదిరి కేరింతలు కొట్టాం

img_20161009_155630

…(చెప్పొద్దు ఆ అందాలని బంధించడానికి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ కెమెరాల్లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది ..ఇది సత్యం …నా దాంట్లో అంతే మరి ) ..వర్షంలోనే తడుస్తూ ఫోటో తీసాం .చివరికి పేరంటాలపల్లి దగ్గర ఆగింది .అక్కడ శివుడి ఆలయం వుంది సహజసిద్ధంగా వుండే జలపాతం ఒకటి ఎప్పుడు ప్రవహిస్తుంది ..దాని నీళ్లు రుచి చూసి దర్శనం చేసుకున్నాం ..అయితే గిరిజనులు నాగరికులకి కొన్ని నిబంధనలు పెట్టడం చాలా బాగుంది (గంట ని కేవలం ఒక్క సరి మాత్రమే కొట్టాలి, మాట్లాడకూడదు, ఫోన్ లో ఫోటోలు తీయకూడదు, చప్పళ్ళ చెయ్యకూడదు) ఇలాంటివి మనవాళ్ళకి మింగుడు పడకపోయినా బాగుంది మొత్తానికి …దర్శనం చేసుకొని తిరిగి మరల బోట్ కి వచ్చాము ..మధ్యలో గిరిజనలు తయారు చేసిన వస్తువులు విక్రయానికి పెట్టారు …మరి ముఖ్యంగా ఇక్కడ “కొండ రెడ్లు” తయారు చేసిన వస్తువులు అవన్నీ వెదురుతో తయారు చేసినవే…కొనేవాళ్ళు కొని తిరిగి ప్రయాణం పట్టారు …మరల బోట్ కి వచ్చాము ….వెళ్ళేటప్పుడు స్లో గా వెళ్ళామా…వచ్చేటప్పుడు మాత్రం ఫాస్ట్ గానే తీసుకువెళ్లారు …అయితే ఒక చోట మాత్రం చాలా భయం వేసింది ఎందుకంటే విపరీతమైన వర్షం ..అది కాక మొన్నటి వర్షాలకు గోదావరి వరద చాలా ఉదృతంగా వుంది, అచ్చం నేను మూడు ఏళ్ళ క్రితం పాపికొండల టూర్ కి మాదిరి గానే ..(అయితే అప్పుడు నేను రాజమండ్రి నుంచి రాలేదు, భద్రాచలం నుంచి చూసాను ) …నిజానికి పాపికొండలు చూడాలి అంటే రెండు దారులు ఒకటి భద్రాచలం నుంచి (వయా కూనవరం ) నుంచి, రాజమండ్రి (పోలవరం ) నుంచి ..అయితే భద్రాచలం నుంచి వ్యూ పాయింట్ సరిగా కనిపించదు అంటారు ..రాజమండ్రి నుంచి అయితే కేకా …ఇక…మరి “కొల్లూరు “అని ఒక ఇసుకమేటల ద్వీపకల్పం అనొచ్చు నెమో …అక్కడ “బ్యాంబూ హట్స్ “: ఉన్నాయ్ ….అక్కడ రాత్రి పగలు గడపటానికి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రక రకాల ప్యాకేజీ లు ఉన్నాయి …ఇక అలా మరల పోలవరం కి వచ్చేసాం ….మరల ఎక్కడ దింపారో అక్కడ పిక్ అప్ చేసుకొని రాజమండ్రి లో దిగాము …చాలామంది రాజమండ్రి నుంచి భద్రాచలానికి లాంచీ లోనే వెళ్తారు అని తెలిసింది బస్సు రూట్ కూడా చాలా దగ్గర అంట….కేవలం 2.5 గంటల జర్నీ అంత అద్భుతం కదా..

img_20161009_155345

తెల్లారి సోమవారం …దగ్గర దగ్గరలో ఉన్న అన్ని ప్రదేశాలు చూసుకొని సాయంత్రం గౌతమికి ఎక్కి మంగళవారం (దసరా పండుగ రోజు) కి హైదరాబాద్ కి వచ్చేసాం …ఇంకా కొన్ని అలానే మిగిలి వున్నాయి రాజమండ్రి లో …మరల నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పక చూడాలి ..అన్నట్టు చెప్పడం మరిచాను అండోయ్ . కాస్ట్ అఫ్ లివింగ్ అయితే పిచ్చ పిచ్చ గా నచ్చింది ..అన్ని below 15 (టిఫిన్ వరకు మాత్రమే) అంటే కొన్ని ఏరియాస్ మాత్రమే …..మిగతాది అంత మాములే….ఫుడ్ అయితే బాగా వుంది ..i enjoyed a lot …అప్పుడు అప్పుడు యాత్రలు చేయడం మంచిదే ..మానసిక ఉల్లాసానికి ….స్ట్రెస్ లైఫ్ నుంచి మంచి ఆటవిడుపు …మరల మరో యాత్ర విశేషం లో కలుసుకుందాం ..అంతవరకు సెలవు ..

Leave a Comment