May 19, 2024

మాలిక పత్రిక జనవరి 2017 సంచికకు స్వాగతం…

Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రిక పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ నూతన సంవత్సర , మకర సంక్రాంతి శుభాకాంక్షలు కొద్దిగా ఆలస్యంగా జనవరి 2017 సంచిక మీ ముందుకు వచ్చింది. ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మిమ్మల్ని అలరించబోతోంది ఈ మాసపు మాలిక పత్రిక. మీ రచనలు పంపడానికి మా చిరునామా: editor@maalika.org ఈ మాసపు ప్రత్యేక అంశాలు మీకోసం: 0. మహారాజశ్రీ మామ్మగారు 1. మాటల్లేవ్.. Audio 2. […]

మహారాజశ్రీ మామ్మగారు – సమీక్ష

రచన: పొత్తూరి విజయలక్ష్మి నవల పేరు గమ్మత్తు గా వుందికదా . పేరుకి తగినట్లే ఉంటుంది నవల కూడా వుండదా మరి ! రాసింది ఎవరూ? కాయితం మీద కలంతో లయవిన్యాసం చేయించగల రచయిత్రి మన్నెం శారదగారు నవల రాసినా, కథ రాసినా, టి.వీ సీరియల్ రాసినా ఒక స్థాయిలో రాస్తారు . ఎన్నో బహుమతులు గెల్చుకున్నారు . తన సీరియల్స్ ద్వారా పత్రికల సర్క్యూలేషన్ పెంచిన ఘనత ఆమెది . ఈ నవల కాస్త విలక్షణంగా […]

జీవితం ఇలా కూడా ఉంటుందా? 7

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి సతీష్‌చంద్ర వెళ్లేటప్పటికి వాసుదేవ్‌, జాన్‌ హాల్లో కూర్చుని మ్లాడుకుంటున్నారు. సతీష్‌చంద్రను చూడగానే ”రా సతీష్‌! కూర్చో” అంటూ ఆప్యాయంగా కుర్చీ చూపించాడు వాసుదేవ్‌. సతీష్‌చంద్ర కూర్చున్నాక ”దృతిని తీసుకురాలేదేం?” అని అడిగాడు వాసుదేవ్‌. సతీష్‌చంద్ర నవ్వి ”ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తాను అంకుల్‌! ఇప్పుడు నేను అనుకోకుండా వచ్చాను. మీతో మాట్లాడాలని వచ్చాను” అన్నాడు. ”మాట్లాడు” అన్నాడు వాసుదేవ్‌. జాన్‌ వున్నా ఫర్వాలేదన్నట్టుగా జాన్‌ ముందే ”నాకు మా పేరెంట్స్ ని వదిలేసి […]

బ్రహ్మలిఖితం – 4

రచన: మన్నెం శారద కాన్వొకేషన్ జరిగిన రాత్రి వెంకట్ లిఖితని ముద్దు పెట్టుకున్నాక తిరిగి వాళ్ళిద్దరూ కలిసింది ఆ రోజే. “నువ్వు చేసిన పనేంటి?” లిఖిత సూటి ప్రశ్నకి తడబడుతూ “నేను నిన్ను ప్రేమించేను. అయ్ లౌ యూ” అన్నాడతను. “అన్ని భాషల్లో చెప్పనక్కర్లేదు. నాకు తెలుగొచ్చు. కాని నువ్వు ప్రేమించేసేవని నిర్ణయించుకున్నాక నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా నన్ను ముద్దు పెట్టేసుకోవచ్చును అనుకోవడాన్ని ఏమనాలి. ఆడదానికసలు ఇష్టాలుండవనా? నేనెంత హర్టయ్యేనో తెలుసా?” అంది లిఖిత సీరియస్‌గా. […]

శుభోదయం 11

రచన: డి.కామేశ్వరి “కుమారి రేఖతో మీ పరిచయం ఎన్నాళ్లుగా వుంది. ఆమె తండ్రి పేరు ఎన్నడూ అడగలేదా మీరు?” “ఒక్క మూడు రోజుల పరిచయం మాది. మొదటిసారి రౌడీలు అల్లరి పెడుతుంటే శ్యాం ఆ సమయానికి అటునించి వస్తూ ఆమెని తీసుకుని మా యింటికి వచ్చాడు. ఆ రోజే ఆ రౌడీల గురించి చెప్పింది ఆమె. తరువాత మర్నాడే ఆ ఘోరం జరిగింది. ముందు రోజు ఆమె వున్న అరగంటలో ఆమె తండ్రి ప్రసక్తి రాలేదు.” “ఆహా! […]

మాయానగరం – 33

రచన: భువనచంద్ర బిళహరి గుళ్ళో కూర్చుంది. భగవంతుడున్నాడా? ఇదీ ఆమె మనసును నలిపేస్తున్న ప్రశ్న. మళ్ళీ ఒక్కసారి జీవితాన్ని చూసుకుంటే ఏముందీ? ఆరోహణా, అవరోహణా గమకాలు తప్ప బిడ్డ జీవితం గురించి పట్టించుకోని తల్లితండ్రులూ, అన్నావదినలూ. ఇహ అత్తగారింట సంగతి సరేసరి. పెళ్ళైంది కానీ భర్త రాధామోహనుడు అప్పటికే పుచ్చిపోయి చచ్చిపోయాడు. పెళ్లైన కన్య తను. ఇంకా కన్నెతనం చెడలేదు. లేపుకొచ్చిన కామేశ్వరరావు పరమ అసమర్ధుడు, భయస్తుడు. ఇల్లు కల సర్వేశ్వరరావు ఓ కట్లపాము. ఆ ఇంట్లోనే […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 12

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య. భక్తుడు ఏకులం వాడు? ఏమిచేసే వాడు? అన్న బేధం భగవంతునికి లేదు. భక్తి గలిగి ఉంటే చాలు. జీవుడు ఎలాంటివాడు అని కాకుండా జీవుడు తన అంతరాత్మలో నిత్యం భగవంతుని స్మరిస్తే చాలు పాపాలు పటపంచలవుతాయి. భగవంతుడు భక్తునికి కైవశమౌతాడు అని బోధిస్తున్నాడు అన్నమయ్య. పల్లవి: పరుస మొక్కటే కాదా పయిడిగా జేసేది అరయ లోహమెట్టున్నా నందుకేమీ చ.1. వనజనాభుని భక్తి వదలకుండిన జాలు మనసు ఎందు దిరిగినా మరియేమి మొనసి ముద్రలు […]

మేధావుల మౌనం అవినీతిపరులకు ఆయుధం!

రచన: టి.వి.ఎస్ శాస్త్రి కొన్ని సంస్థల పేర్లను చూస్తుంటే నవ్వొస్తుంది! ఒక ప్రఖ్యాత ఆంగ్ల రచయిత(పేరు గుర్తుకు రావటం లేదు, క్షమించండి! ) లండన్ లో ‘Ugly Men Club ‘అనే సంస్థను ప్రారంభించాడట! ఎంతకాలం చూసినా ఏ ఒక్కడు కూడా అందులో సభ్యుడిగా చేరలేదట! ఎవరికి వారు తమని అద్దంలో చూసుకొని తమ అందాన్ని చూసి మురిసిపోతుంటారు! ‘నేను అందవిహీహనంగా ఉన్నానని ‘ ఎవడూ అనుకోడు! మనిషి అందంగా ఉండి, ఆలోచనలు ugly గా ఉంటే […]

GAUSIPS – ఎగిసే కెరటాలు-9

రచన: – శ్రీసత్య గౌతమి కౌశిక్ ఆఫీసుకి వెళ్ళిన వెంటనే అడ్మినిస్ట్రేటర్ డయానా తో తన బడ్జెటింగ్ గురించి మాట్లాడాడు. డయానా వెంటనే ఫైల్స్ ని తిరగేసి, కౌశిక్ గ్రాంట్ ఒకటి రెన్యువల్ అయితే ఒక సంవత్సరం పాటు ఒక మనిషి జీతమివ్వడానికి కాని బెనిఫిట్స్ లేకుండా అంటే ఒక పార్ టైం జాబ్ ని కల్పించేటంత మాత్రమే సరిపోతుంది అని చెప్పింది. “వెల్ డయానా … థట్ ఈజ్ నాట్ ఐ యాం లుకింగ్ ఫర్” […]