April 20, 2024

ఇలా ఐతే ఎలా?

రచన: పారనంది శాంత కుమారి.

కొడుకులుంటే కోడళ్ళతో బాధంటావు,
కూతుళ్ళయితే అల్లుళ్ళతో వ్యధ అంటావు.
మనవళ్లుంటే గోలంటావు,
వాళ్ళు లేకుంటే బ్రతుకు బోరంటావు.
ఇంటికెవరైనా వస్తే సహించలేనంటావు,
రావటం మానేస్తే భరించలేనంటావు.
పెళ్ళాలు వాదిస్తారంటావు,
భర్తలు వేధిస్తారంటావు.
అత్తలు వాదిస్తారంటావు,
మామలు మోదిస్తారంటావు.
జోకులంటే డోకంటావు,
నవ్వులంటే కేకలేస్తావు.
చెడును మరువనంటావు,
మంచిని తలవనంటావు.
నువ్వు చెప్పినదే వేదమంటావు,
ఎవరు ఏమన్నా వాదమంటావు.
ఇలా ఐతే ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *