April 23, 2024

ప్రేమ స్పర్శ

డా.పి.విజయలక్ష్మీ పండిట్

ఎందుకిలా ….

నీ హ్రుదయాన్ని స్పర్సించిన ప్రేమ

మరణించిందని వాపొతున్నావ్‌..?

నీ కన్నీటి పొరలపై ప్రేమనద్ది

అటు చూడు …

సగం ఎండి శుస్కించిన ఆ తరువు

ప్రసవించిన చిగుర్లు చూడు

ఆ చిగుర్ల చిరు గాలి ప్రేమస్పర్శ

నీ మనసును చల్లపరుస్తుంది ..,

అడవంటుకుని అగ్ని జ్వాలలకు మాడి

మసైపొయిన ఆ మరుభూమిని చూడు

భూమాత గర్భం నుండి మొలకెత్తి

తలలూపుతున్న ఆ గడ్డి మొలకల్లో

ప్రేమ పల్లవిస్తునే ఉంటుంది…

బడబాగ్నిని కడుపులొ దాచుకున్న

ఆ కడలినిచూడు..

చల్లని సమీరాలు వెదజల్లె అలలతో

ప్రేమగా ఆహ్వానిస్తూనె ఉంటుంది ..!

భూమిపై పడ్డ ప్రాణులపై..

విశ్వం ఎడతెగని ప్రేమ వర్షాన్ని

కురిపిస్తూనే ఉంటుంది…

ప్రీమించే హ్రుదయామికి

జగమంతా రాగమయం అనురాగమయం;

కలత చెందిన నీ హ్రుదయాణువులు

ఆ ప్రేమ స్పర్శతో సేద తీరనీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *