March 28, 2024

తెలుసుకున్నాను

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

……

కొందరికి కాళ్ళు లేవు, కొందరికి చేతులు లేవు.
ఐనా, ఆగకుండా నడుస్తున్న వారి జీవితాలను చూశాను,
వారికళ్ళలో నిండిఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూశాను.
కొందరికి బుద్ధిలేదు, కొందరికి సిద్ధిలేదు,
ఐనా, పరిష్కృతమౌతున్న వారి సమస్యలను చూశాను.
వారి చేతల్లో ఆవిష్కృతమౌతున్న ఆత్మవిశ్వాసాన్ని చూశాను
కొందరికి చూపు లేదు, కొందరికి రూపు లేదు
ఐనా, జీవించటానికి వారుపడే తపనను చుశాను,
వారిలో పొంగిపొరలుతున్నఆత్మవిశ్వాసాన్ని చూశాను.
కొందరికి కలిమిలేదు, కొందరికి కాలం కలిసిరాలేదు,
ఐనా, జీవితంతో అలుపెరుగని వారిపోరాటాన్ని పసికట్టాను,
వారి నిగ్రహశక్తిలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూశాను.
ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి బట్టలేదు, తినడానికి తిండి లేదు,
ఐనా, ఆగిపోని వారి నడకను గమనించాను,
వారి ప్రవర్తనలో కట్టలుతెగి ప్రవహిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని చూశాను.
విధి వికట్టహాసం చేస్తున్నా మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని,
తీర్చిదిద్దుకుంటున్నవారి జీవనవిధాన్నాన్ని చూశాను.
జీవితాన్ని ఎదుర్కొనే విధానాన్ని తెలుసుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *