April 19, 2024

Gausips . ఎగిసే కెరటాలు-10

రచన: -శ్రీసత్యగౌతమి

..

ల్యాబ్ లో సింథియాకు ఒక ప్లేస్ కేటాయించబడింది పని చేసుకోవడానికి, అలాగే ఒక ఆఫీసు రూం కూడా. అయితే ఆల్ రెడీ ఉన్నవాళ్ళ మధ్య కాకుండా కొంచెం వేరేగా. సింథియా హాయిగా కంప్యూటర్ మీద కూర్చొని రోజంతా కాలక్షేపం చేసుకొని ఈ-మెయిల్స్ ఇచ్చుకొని, ఈ-పేపర్స్ చదువుకొని, సాయంత్రమయ్యేకల్లా చక్కగా వెళ్ళిపోతోంది. ఎవరినీ పలుకరించదు. ఎదుటివాళ్ళే పలుకరించాలని కోరుకుంటుంది. ఒకటి రెండు సార్లు అలాగే చేసారు అంతా క్రొత్తలో. కానీ ప్రతిరోజూ అలాగే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఎక్స్ పెక్ట్ చేసేసరికి, అందరూ బిజీ గా ఉన్నట్లే అప్పటికప్పుడు నటించేసి తప్పుకుంటున్నారు.

లహరి ఆమె వ్యవహారాన్ని గమనిస్తూనే ఉంది, కాని ఎలా ఆమెతో ప్రారంభించాలో తెలియటంలేదు. కౌశిక్ చూస్తే ఈ-మెయిల్స్ ఇస్తున్నాడు.

“హెలో సింథియా … హౌ ఆర్ యు?” … లహరి మొదలు పెట్టింది.
“ఓ అ యాం గుడ్. హౌ అబౌట్ యూ? … అని పెద్దగా గొంతెత్తి ఇంతసేపు పట్టిందా నన్ను నువ్వు పలకరించడానికి అన్న భావన వచ్చేటట్లు తిరిగి ప్రశ్నించింది సింథియా.
లహరి నవ్వుతూ … యెస్. ఐ యాం గుడ్. థాంక్యు… అన్నది.
అంతే తప్పా.. లహరి మొదటగా తానడిన హౌ ఆర్ యూ అన్న ప్రశ్నకు సింథియా నుండి సమాధానం రాలేదు. లహరి నొచ్చుకుంది, ఆ పై ఊరుకుంది.
ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. సింథియా మళ్ళా అటు తిరిగిపోయి తన పని తాను చేసుకుంటున్నది కంప్యూటర్లో. ఒక కొద్ది సెకన్లు అలా నిలబడి లహరి వెనక్కి వచ్చేసింది. అదీ పరిస్థితి.

ఒక సాయంత్రం కౌశిక్ మళ్ళీ మొదలెట్టాడు లహరి ని వేధించడం. లహరి ఖచ్చితంగా చెప్పింది. “ఎంత ప్రయత్నించినా సింథియా మాటలు ఎక్స్ టెండ్ చెయ్యడం లేదు. ఎంత అడిగితే అంతే చెప్పేసి వెంటనే గిరుక్కున తిరిగి తన ఆఫీసు రూం లోకి వెళ్ళిపోతోంది. అఖరికి ఆ మె ఆఫీసు ముందు కొద్ది సేపు నిలబడినా ఆమె వెనక్కి చూదడం లేదు”.

“నువ్వు వెనుక ఉన్నావని ఆమె కి తెలియకపోవచ్చు. డెస్క్ దగ్గిర్ కూర్చోబెట్టి వర్క్ నేర్పాలి” .. కౌశిక్ ఆరాటం.

లహరి ముందు చెప్పిన మాటను పెడచెవిన పెట్టాడు. లహరి మళ్లీ రిపీట్ చేసింది.

కౌశిక్ … ఐ హేవ్ ఆల్రెడీ మెన్షండ్ టు యూ. షి ఈజ్ నాట్ రెస్పాన్సివ్ అండ్ ఆల్ థ టైం సిటింగ్ విథ్ థ కంప్యూటర్. నెవర్ ఫౌండ్ హెర్సెల్ఫ్ ఫ్రీ. వాట్ డు యూ వాంట్ మి టు డు? … కాస్త గట్టిగా అనేసరికి ఆ పక్కనే ఉన్న సింథియా కు వినబడింది. కౌశిక్ కూడా అక్కడినుండి వెళ్ళిపోయి సింథియా రూం లోకి వెళ్ళాడు.

ఏం మాట్లాడాడో ఏమో … వెనక్కి వచ్చి, … మళ్ళీ అన్నాడు … “యు షుడ్ గివ్ యాన్ ఈ-మెయిల్ టు హెర్ ఫస్ట్ అండ్ టాక్ టు హెర్”.

విచిత్రమైన ప్రేలాపన. మరి సింథియా ఏం చెప్పిందో మరి. అతని ప్రక్కనే నిలబడి ఉంది సింథియా.

లహరికి చిర్రెత్తుకొచ్చింది. “ఏదీ హలో … హౌ ఆర్ యూ అని ఆమెని పలకరించడానికి కూడా ముందుగా ఈ-మెయిల్ ఇచ్చి పెర్మిషన్ తెసుకోవాలా?”

టైం చూసుకొని అలా అడిగిన కూడా … ఆమె తిరిగి హౌ అబౌట్ యు అని తిరిగి ప్రశ్నిస్తాదే తప్పా … అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వదు” అని టక టకా చెప్పింది లహరి.

అలా డైరక్ట్ గా చెప్పేసరికి సింథియాకు ఏం చెప్పాలో తోచలేదు. అలా వింటున్నది. కౌశిక్ కు ఏం మాట్లాడాలో తెలియలేదు. వెళ్ళిపోయాడు. సింథియా కూడా వెళ్ళిపోయింది.

సింథియా రాకముందునుండి కౌశిక్, లహరిని విసిగిస్తున్నాడు సింథియా విషయంలో. అప్పటికే ఆమె ఓర్పు పరీక్షించబడింది. ఇప్పుడు ఆమెకి, లహరికి మధ్యలో వస్తున్నాడు.

మరుసటి రోజు ప్రొద్దున్న మళ్లీ లహరిని కలిసాడు కౌశిక్. ఈసారి సౌమ్యమైన గొంతుతో, చెప్తున్నాడు.

“లహరీ … నువ్వు చేస్తున్నవి చాలా ముఖ్యమైన పరిశోధనలు. వాటిని సింథియాకి గాని, మరెవ్వరికి గాని అప్పజెప్పడం నాకు ఇష్టం లేదు. అంతా నువ్వు, బాబ్ చూసుకోవాలి. కాకపోతే మీరిద్దరూ చేసేటప్పుడు సింథియాని కూడా పిలిచి చూడమనండి, ప్రతి ఒక్క స్టెప్ జాగ్రత్తగా ఆమెని పరిశీలించమని, తన బుక్ లో వ్రాసుకోమని చెప్పండి. కానీ తనని చెయ్యమని అడగొద్దు. తనకి వేరే ప్రాజెక్ట్ ఆలోచిస్తాను. షి ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ థ ల్యాబ్, జస్ట్ సిట్టింగ్ ఇన్ థ ల్యాబ్ విథౌట్ వర్క్”

లహరి, బాబ్ లు ఊపిరి పీల్చుకున్నారు, ఇహ తమని కౌశిక్ విసిగించడు అని.

“ఓకే. ష్యూర్ అని చెప్పింది లహరి.

కౌశిక్ ఇంతకు మునుపు చెప్పినట్లు ఈ-మెయిల్ ఇచ్చింది, చెయ్యబోయే ఎక్స్ పెరిమెంట్ గురించి సింథియాకు, ఫలానా టైం కల్లా వచ్చి చూడమని. ప్రక్కనే ఉన్నా ఆమెని మాట్లాడించడానికి లేదు. ఈ-మెయిల్ ఇవ్వాలి. అదేకదా వాళ్ళిద్దరూ తీర్మానించినది.

ఆ ఈ-మెయిల్ కి సమాధానం కూడా ఇవ్వలేదు సింథియా, కాని టైం కి వచ్చింది. ఆమె మాట్లాడినా, మాట్లాడకపోయినా సరిగ్గా … వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు.

సింథియా మాత్రం దిక్కులు చూడడం, ఏదీ వ్రాసుకోకుండా. అలాగే మధ్య మధ్యలో ఫోన్స్ అటెండ్ అవ్వడం తో సర్దాగా గడిపేసింది. లహరి, బాబ్ లు అవాక్కయిపోయారు.

మధ్యాహ్నం … కౌశిక్ మళ్ళీ వచ్చాడు. తానంతట తానే సింథియా టాపిక్ ఎత్తి సింథియా రూం కి వెళ్ళి ప్రొసీజర్ అంతా ఎక్స్ ప్లెయిన్ చెయ్యమన్నాడు.

లహరి, బాబ్ మొహాలు చూసుకున్నారు. ఇద్దరూ చెప్పారు. “ఎక్స్ పెరిమెంట్ చేస్తూ ఆమె విశదీకరిస్తేనే తానేమీ పట్టించుకోలేదు, షి ఈజ్ లుకింగ్ హియర్ అండ్ థేర్ అం డ్ కీప్ అటెండింగ్ ఫోన్ కాల్స్. షి లెఫ్ట్ ఇన్ బిట్వీన్ అం డ్ కేం లేటర్ అండ్ యాక్టె డ్ సర్ప్రైజ్ థట్ వియ్ ఫినిష్డ్”.

ఆమె ఫోన్ కాల్స్ అయ్యేంతవరకు … ఎక్స్ పెరిమెంట్ ఆప్లేము, వెంటవెంటనే చెయ్యాలి. యు న్యూ థట్.

“యెస్.. థట్స్ వై, యు షౌడ్ హేవ్ రిటన్ ప్రొసీజర్ ఆన్ థ పేపర్ అండ్ ఎక్స్ ప్లెయిన్ హెర్ బిఫోర్… అని మళ్ళీ సాగడం, లహరి ప్రాణం తియ్యడం మొదలు పెట్టాడు.

బాబ్ ఇక చూడలేక, కల్పించుకున్నాడు.

“డా. కౌశిక్, వియ్ కెన్ నాట్ కీప్ టెల్లింగ్ సింథియా డూ థిస్ అండ్ డూ థట్. షి షుడ్ ఇన్వాల్వ్ ఇన్ థ ప్రోజెక్ట్”

“ఇఫ్ యు గయ్స్ ఆస్క్ హర్ … థెన్ ఓన్లీ షి విల్ కం”…. కౌశిక్ ఉవాచ (అలా చెప్పి పంపి ఉంటుంది సింథియా)

“థట్స్ రాంగ్. షి ఈజ్ ఈక్వల్లీ పి. హెచ్.డి. వియ్ కెన్ నాట్ ఆస్క్ హెర్ టు డు థిస్ .. డు థట్. షి ఈజ్ నాట్ విల్లింగ్ ఈవెన్ టు లిజన్ అం డ్ స్పీక్. వియ్ కెన్ నాట్ కీప్ గివింగ్ ఈ-మెయిల్స్ టు హెర్ వెన్ షి ఈజ్ సిటింగ్ నెక్స్ట్ టు అస్” చాలా గట్టిగా సమాధానమిచ్చాడు బాబ్.

అప్పటికి కౌశిక్ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సింథియా కూడా చప్పుడు చెయ్యకుండా లోపలే ఉండిపోయింది.

దీన్నిబట్టి అప్పుడు అర్ధమయ్యింది లహరికి, ల్యాబ్ లో అందరికీ. సింథియా చేసే ప్రతి వెధవ పనిని కౌశిక్ కవర్ చేసుకుంటూ వస్తున్నాడనీ, తానే వికృతపు పని చేసినా అది కౌశికి కు కవరింగ్ ఇచ్చి చెప్పి మరీ సింథియా, లహరి మీదకు యుద్ధానికి పంపిస్తున్నదని.

ఈ యుద్ధం అలాగే కొనసాగింది, ఎక్కువ అయిపోయింది. అలాగని లహరిని ఇద్దరూ వదలడం లేదు. ముఖ్యం గా సింథియా ఎందుకంటే కౌశిక్ ఆమెతో సింథియాని లింకు పెడుతున్నాడు.

సింథియాకు తాను చటర్జీ దగ్గిర చేసిన ఉద్యోగం లాంటిది ఆశించింది కౌశిక్ దగ్గిర. కానీ కౌశిక్ మరోలా ట్రీట్ చేస్తున్నాడు. ఇది భరించలేకపోతోంది సింథియా.

అందుకే సింథియా ఇలా చిన్న చిన్న తగువులు పెడితే సరిపోదు, తన ఒకప్పటి స్వరూపం బయటకు తియ్యాలి, ఈ లహరిని బయటకు తగిలెయ్యాలి అని ధృఢం గా నిర్ణయించుకున్నది రాత్రంతా ఆలోచించి.

ఇహ భర్తా రాకేష్ ని గాలికి వదిలేసింది, ఇప్పుడు ఆలోచనంతా లహరిని వెళ్ళగొట్టడం, కౌశిక్ కి మళ్ళీ దగ్గిరవ్వడం. ఇహ తాను కన్నీళ్లు ఆపి, ఎదుటివారిని కన్నీళ్ళు పెట్టించడానికి రెడీ అయిపోయింది.

తనకా కాంఫిడెన్స్ తన మీద తనకి పెరగడానికి డ్రెస్ వేసుకునే విధానం మార్చింది ముందు. టైట్ షర్ట్, లో వెయిస్ట్ టైట్ జీన్ ప్యాంట్, అంత ఎత్తు బూట్స్ వేసుకొని … టక్ టక్ మని ఎత్తి పెట్టి నడవడం మొదలెట్టింది ల్యాబ్ లో. ఆ శబ్దాలకు అందరూ తలెత్తి చూశారు. ఆమె అలంకరణలో కూడా తేడా వచ్చేసింది. ఒకేసారి అందరికీ హలో చెప్పేసి … కౌశిక్ ఆఫీసులోకి వెళ్ళిపోయింది. పోతూ పోతూ అక్కడే ఉన్న అతని పి.ఏ కి కూడా ఒక హలో పడేసింది. అలా మధ్యాహ్నం వరకూ కాల్క్షేపం చేసేసి … అప్పుడు తన ఆఫీస్కి వచ్చింది. అంతే రోజూ ఆమె చేసే పని. అలా ఆరేడు నెలలు అయిపోయింది. అడపా దడపా ఏదో చేస్తున్నట్లు కనిపిస్తుంది, ఏమి చేస్తాదో తెలియదు.

బాబ్ ఇచ్చిన డోస్ తో లహరికి కాస్త కౌశిక్ పీడ విరుగుడయ్యింది. తాను మిగితా పన్లలో మునిగిపోయింది. ఈ లోపున తాము చేసిన వర్క్ కి మంచి పేరు వచ్చి అవార్డు కూడా అందుకుంది లహరి. కౌశిక్ ఆనందం. లహరి అవార్డ్ అందుకొనేటప్పుడు, టాక్ ఇచ్చేటప్పుడు కౌశిక్, ల్యాబ్ లో ఇతరులు లహరి ఫోట్స్ తీస్తుంటే సింథియాకు పుండు మీద కారం చల్లినట్లయ్యింది.

“ఏంటీ … తన ప్రయత్నాలు ఇలా బెడిసికొడుతున్నాయి. ఒక ప్రక్క కౌశిక్ ని మార్చుకుంటుంటే … ఈ లహరి ఇలా ఎదిగిపోవడం ఏంటి అదీ తన కళ్ళెదురుగా. ఇలా అయితే … కౌశిక్ పూర్తిగా మారడు ఒక ప్రక్క ఆమె ఎదుగుతుంటే … ఆమెనే గౌరవిస్తారు ల్యాబ్ అంతా. మరి నాకెప్పుడు గౌరవం రావాలి, నేనిలా పడుండడమేనా??????” ఎక్కడలేని సాగరమధనం సింథియాలో.

తాను ఓడిపోయినట్లుగా భావించుకొని లహరి మీద అసూయా ద్వేషాలతో రగిలిపోతోంది సింథియా.

ప్రతి వీకెండ్ కౌశిక్ ని ఎక్కడో దగ్గిర లంచ్ అనో, డిన్నర్ అనో బయట కలుస్తూనే ఉంటుంది, ఎలాగూ పాత పరిచయం ఇండియానుండి. ఇద్దరికీ క్రొత్త లేదు. ఏ రాత్రికో ఇంటికి వెళ్తుంది. రాకేష్ అప్పటికి ఏదో ఒకటి తినేసి నిద్రపోతుంటాడు. అలా ఎవరి జీవితాలు వాళ్లు జీవించుకొనేలా వేదిక సెట్ చేసేసింది సింథియా.

కౌశిక్ కూడా సింథియా టైమింగ్స్ కి సెట్ అయిపోయాడు, వర్కింగ్ డేస్ లో వర్క్, సింథియా ఎలాగూ వర్క్ ప్లేస్ లో ఉంటుంది. వీకెండ్స్ మళ్ళీ సింథియాతో అక్కడా ఇక్క్కడా లాంగ్ డ్రైవ్స్. ఇలా తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సింథియా. తనను ఆనంద పరుస్తున్నందుకు కౌశిక్ కూడా సింథియాను వర్క్ చెయ్యమని అడగడంలేదు. లహరివాళ్ళు చేస్తున్న ప్రోజెక్ట్ లో సింథియా కూడా ఒక పార్ట్ అని వ్రాసేస్తున్నాడు పై అధికారులకు సింథియా ప్రోగ్రెస్ చెప్పాల్సి వచేటప్పుడు, ఆ విధంగా సింథియా కడుపులో చల్ల కదలకుండా జీవించేస్తున్నది.

కానీ లహరి విషయంలో మాత్రం సింథియా కుదురుగా ఉండలేకపోతోంది. ల్యాబ్ లోనూ, డిపార్ట్మెంట్ లోనూ తనదే పై చెయ్యి కావాలి. ఆ దుగ్ధతో …

లహరి తన ఆఫీసు రూంలో కూర్చొని ఏదో చదువుతూ… కాఫీ త్రాగుతోంది. ఈలోపుల ఏదో ఫోన్ వచ్చింది. వెంటనే లహరి కాఫీ అక్కడ వదిలి … ఆఫీసు రూం బయట ఉన్న ఫోన్ తియ్యడానికి వచ్చింది. ఏదో మాట్లాడి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయింది. ఇదంతా జాగ్రత్తగా చూస్తోంది అవకాశం కోసం అన్నట్లు సింథియా.

వెనక్కి రాబోయి మళ్ళీ అక్కడే ఉన్న అందరికీ ఆనందం గా చెప్పింది- తనకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఖాయమయ్యిందని, అయితే అఫీషియల్ గా లెటర్ ఆన్ థ వే అని. దానితో అందరూ ఆనందం తో షేక్ హ్యాండ్స్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పడం, కౌశికి కూడా వచ్చి ఆ అనందం లో పాలు పంచుకోవడం, సింథియా కు తల కొట్టేసినట్లయ్యింది. కౌశిక్ తాను గీసిన గీతలో ఉండడంలేదనే ధ్యాస పెరిగిపోయింది సింథియాకు. ఎంతసేపు చటర్జీ దగ్గిర తన వైభవాన్ని తలచుకొని కుమిలిపోతోంది.

తాను మాత్రం ఇదేమీ విననట్లు అక్కడినుండి వెళ్ళిపోయి నటించింది. కొద్ది నిముషాల తర్వాత … లహరి తన ఆఫీసు రూం లోకి వెళ్ళి చల్లారి పోయిన కాఫీని మైక్రో వేవ్ లో వేడి చేసుకొని త్రాగింది. అందరూ వెళ్ళిపోయారు.

ఎందుకో … ఆ రాత్రి కాస్త నలతగా అనిపించింది లహరికి. అయినా మరుసటిరోజు ప్రొద్దున్న అఫీసుకి మామూలుగానే వచ్చేసింది. మళ్ళీ ఏదో ఒక పని చేస్తూ మధ్య మధ్యలో కాహీ అని, జ్యూస్ అని కాఫీ అని తన ఆఫీస్ రూంలో త్రాగుతూ, టైం కి లంచ్ చేసి పని చేసుకుంటున్నది లహరి. సింథియా కనిపెట్టుకొనే ఉంది లహరికి దగ్గిరలోనే తిరుగుతూ.

ఇంతలో …. లహరికి మొహం తిరిగిపోయి, మొహం నుండి శరీరమంతా … రేషస్ వచ్చేసి కళ్ళు బైర్లు కామ్మి, గొంతు పట్టేస్తోంది. ఇది గమనించిన సింథియా…

“యెస్” … అని పిడికిలి బిగించి తాను సాధించిన ట్టుగా చెయ్యెత్తి గాలిలోకి విసిరి మనసున ఆనందిస్తోంది …చూస్తూ.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *