May 19, 2024

ఆశ్రమం

రచన: YSR లక్ష్మి రావి చెట్టు కింద బెంచ్ మీద విచారవదనంతో కూర్చున్న శాంతమ్మ దగ్గరకు రాధమ్మ వచ్చి “ఏమిటి శాంతమ్మా? ఒంటరిగా కూర్చొని ఏమి ఆలోచిస్తున్నావు?”అని అడిగింది. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి “ఈ బ్రతుక్కి ఒంటరిగా కాక ఇంకేమి మిగిలింది? ఆయన ఈ కష్టాలేమీ చూడకుండా మహరాజు లాగా వెళ్ళిపోయాడు. నేనేమో దిక్కులేనిదానిలా ఇక్కడ పడి ఉన్నాను. “అని అన్నది శాంతమ్మ. “అదేమిటి శాంతమ్మా! అలా అంటావు. ఇక్కడ నీ చుట్టూ ఇంతమందిమి ఉన్నాము. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 13

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య. శ్రీవేంకటేశ్వరా! నేను నిన్ను కాపాడు అని అడిగే అర్హత లేని వాడిని. ఎందుకంటే.. నా జీవితంలో ఒక్క క్షణము కూడా నిన్ను మనసారా కొలిచింది లేదు. జీవితమంతా సంసార సుఖాలలో గడిపాను. నా జీవితం అజ్ఞానమయం. నిన్ను శరణు అని అడగాలంటే భయం వేస్తోంది అంటున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. అన్నమయ్య లాంటి పరమ భక్తుల స్థితి అలా ఉంటే మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి? తెలుసుకొని, మేల్కొని ఆ పరంధాముని సేవించి […]

గోమాంసాన్ని ఎందుకు తినొద్దని అటున్నాను ?

రచన: టీవీయస్.శాస్త్రి రాజస్థాన్‌లోని హింగోనియా గోశాలలో ఈ ఏడాది జనవరి నుంచి జాలై 2016 వరకు అక్కడి ప్రభుత్వం వారు చెప్పే 8, 122 ‘గోమాతలు ‘ మరణించాయి. అయితేనేం అక్కడి ప్రభుత్వం ఒక్క కేసును కూడా ఎవరి మీదా నమోదు చేయలేదు, కనీసం విచారణ జరపలేదు. బీహార్‌ లో లాలూప్రసాద్‌ ప్రసాద్‌ యాదవ్‌ ఏలుబడిలో మాదిరి రాజస్థాన్‌ సర్కారు గోమాత పేరుతో గడ్డి తింటున్నదని విమర్శలు వచ్చాయి. ఆవు ‘ఒక ఉపయోగకరమైన జంతువు అవసరమైతే దానిని […]

పండుతాటికల్లు

రచన: కృష్ణ మణి … గుల్ఫారం దంచి లొట్లు నిమ్పిండు గౌండ్ల రాజన్న అట్ల నింపిండో లేడో గప్పుడే దిగిన్రు ఎల్లిగాడు మల్లిగాడు పెడ్లాం పిల్లలను గాలిదేవునికి గిరివిబెట్టిండు ఎల్లిగాడు పెండ్లికానక దుకాన్లనే ముంతతోని సంసారం జేస్తుండు మల్లిగాడు మాటలు జూస్తే మూటలు నిండుతయి బతికిశెడ్డ దొరలమని గాలిల కోటలు కడ్తరు సొక్కమైనోళ్ళు శింపిరి గడ్డం మాశిన బట్టల కశీరు దూలాలు ఎల్లిగాని నొసలుకు సూరెండ గుచ్చితే అర్దమయ్యింది అద్దుమరాతిరి ఇల్లు జేరింది బరిగడుపున తిందామంటే పెండ్లాం […]

పరుగు

రచన: కాంత గుమ్ములూరి ఉదయించిన బాలభానుని కిరణాల వెంట పిల్ల గాలుల పరుగు … నిన్న రాత్రి పడ్డ వర్షపు పరియలలో సూర్య కిరణాల పరుగు … నీటి గుంటలలో పడ్డ కాంతి ఇంద్రధనుస్సు వైఖరి పరుగు … ఆ రంగుల హరివిల్లు నందుకోడానికే ఈ చిన్నారి పరుగు… విచ్చలవిడిగా పూసిన రంగు రంగుల గడ్డిపూలకోసం పరుగు … విశృంఖలంగా అల్లుకున్న తీగపై ఊదారంగు పూలవెంట పరుగు … వాటి వెంటే విహరిస్తున్న పసుపు వన్నె సీతాకోక […]

తెలుసుకున్నాను

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. …… కొందరికి కాళ్ళు లేవు, కొందరికి చేతులు లేవు. ఐనా, ఆగకుండా నడుస్తున్న వారి జీవితాలను చూశాను, వారికళ్ళలో నిండిఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూశాను. కొందరికి బుద్ధిలేదు, కొందరికి సిద్ధిలేదు, ఐనా, పరిష్కృతమౌతున్న వారి సమస్యలను చూశాను. వారి చేతల్లో ఆవిష్కృతమౌతున్న ఆత్మవిశ్వాసాన్ని చూశాను కొందరికి చూపు లేదు, కొందరికి రూపు లేదు ఐనా, జీవించటానికి వారుపడే తపనను చుశాను, వారిలో పొంగిపొరలుతున్నఆత్మవిశ్వాసాన్ని చూశాను. కొందరికి కలిమిలేదు, కొందరికి కాలం కలిసిరాలేదు, ఐనా, […]