December 6, 2023

రైలు పక్కకెళ్ళొద్దురా డింగరీ! డాంబికాలు పోవద్దురా! !

రచన: శారదాప్రసాద్ (గత ఆరునెలల్లో ఆరు ఘోరమైన రైలు ప్రమాదాలు జరిగాయి. కొన్ని వందలమంది ఈ ప్రమాదాల్లో మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. మరెందరో గాయపడ్డారు! ప్రభుత్వం, ఇవి విద్రోహ చర్యలని చేతులు దులుపుకుంటున్నది! సంస్థాగత లోపాలను గురించి రైల్వే అధికారులు, మంత్రివర్గం పట్టించుకోలేదు. . ఈ సందర్భంలో వ్రాసిన చిన్న వ్యంగ్య రచనను ఈ దిగువన చదవండి! ) ******* “ఏమోయ్! అర్జంట్ గా ఇటురా! రెండు జతల బట్టలు వగైరా సద్దు. నేను అర్జంట్ […]

వేదిక – విశ్లేషణ

రచన: నండూరి సుందరీ నాగమణి వేదిక! ఎంత చక్కని శీర్షిక!! గోతెలుగు వారపత్రికలో ఈ నవల ధారావాహికంగా వెలువడినప్పుడు నేను అనుసరించలేకపోయాను. కానీ పుస్తకరూపం లోనికి వచ్చాక చదువుతూ ఉంటే మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది. రచయిత్రి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారు నాకు చక్కని మిత్రురాలు, సన్నిహితురాలు. క్రిందటేడు ఆమె మాతృభూమికి వచ్చినప్పుడు శ్రీమతి మంథా భానుమతి గారి గృహంలో వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. అంత గొప్ప నృత్యశాస్త్ర కోవిదురాలు అయినా కూడా […]

అనుబంధాల టెక్నాలజీ – సమీక్ష

రచన: లక్ష్మీ రాఘవ పరిచయకర్త: మాలాకుమార్ లక్ష్మీ రాఘవగారి పుస్తకం “అనుబందాల టెక్నాలజీ”, పేరేదో కొత్తగా ఉందే అని చదువుదామని తీసాను. మొదటి కథనే “అనుబంధాల టెక్నాలజీ”. చదవగానే ఇదేదో మన కథలానే ఉందే అనుకున్నాను. అవును మరి ఈ తరం అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు మనవళ్ళతో గడపాలంటే అంతర్జాలంలోకి ప్రవేశించక తప్పదు. మొదటి కథ చదివిన అనుభూతితో అలా అలా మిగితావీ చదివేస్తూ పోయాను. జెల్ పాడ్ చదవగానే మా ఇంట్లో ఎలుకల కోసం ఎవరో […]

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి – వేదిక

రచన: సి. ఉమాదేవి ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాఙ్మయమ్ ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్ అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం […]

మనోవేదికపై నర్తించిన అక్షరరవళి – వేదిక (సమీక్ష)

రచన: సి. ఉమాదేవి ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాఙ్మయమ్ ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్ అభినయ దర్పణములో ప్రారంభ శ్లోకంతో కోసూరి ఉమాభారతి రచించిన వేదిక నవలపై సమీక్ష ప్రారంభించడానికి కారణం నవల నడిచిన కాదు నర్తించిన తీరు. భరతముని రచించిన నాట్య శాస్త్రమును నాట్యవేదమంటారు. వేదిక నవల నాట్యశాస్త్రాన్ని గుర్తు చేయడం కాకతాళీయమే కాని విభిన్న నృత్యాంశాలకు చక్కటి మార్గదర్శినిగా నిలిచిన నాట్యశాస్త్రం నృత్యాభిలాష ఉన్నవారికి కరదీపిక అని పునశ్చరణ చేసుకోవడం […]

సీతారామ కల్యాణం

రచన: కిభశ్రీ రండి కన రండి – – – – తరలి రండి రండి రండి రారండి – – – – కదలి రండి నవ్య యుగములో అందరూ సవ్యముగా జరుపుకునేది దివ్యానుభూతిని ఇచ్చేదీ భవ్యమైన కల్యాణమే ఇది || రండి|| తుల్యమే లేని సీతమ్మే కౌసల్యతనయుని చేరునటా కల్యాణం చూసినవారికి కైవల్యం తథ్యమటా ధరణిని జనకుని పట్టియట ఆ సిరియే- – – పెండ్లికూతురట సరియైనవాడె జోడట ఆ హరియే – – […]

చిటికెన వ్రేలు

రచన: రామా చంద్రమౌళి వాడు బుడిబుడి అడుగులతో పరుగెత్తుకొచ్చి ‘అమ్మా’ మోకాళ్లను చుట్టుకుపోతాడు. పైగా నవ్వు ముఖం నిండా ‘అమ్మ నాదీ’ అన్న వ్యక్తీకరణ ఈ చంద్రుడు నాది.. ఈ ఆకాశం నాది.. ఈ సమస్తమూ నాదే.. వలె… ఔను మనిషి తనను తాను స్పష్టంగానే చెప్పుకోవాలి ‘నేను దు:ఖిస్తున్నాను. నేను సంతోషంతో పొంగిపోతున్నాను. నేను నీకోసం పరితపిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి నీ కోసం యుగయుగాలుగా ఇక్కడ ఇదిగో ఈ తీరంపై నేను […]

మీమాంస ..

రచన: శ్రీకాంత గుమ్ములూరి మస్తిష్కానికి మనసుకు మీమాంస !! మస్తిష్కపు మట్టిలో చిన్న విత్తనం … నాటిన వాని ఊహకే అనూహ్యం ! గోరంతలు కొండంతలు చేసిన నైజం.. మానసిక సంతులాన్ని తిరగదోసిన వైనం .. మానవ నైజపు వాసనలు చేసిన అంకురార్పణం .. అంకురించిన అనుమానపు బీజం .. వేరు తన్నిన వెర్రి ఊహల విజృంభణం .. సాదృశమైన దౌర్భాగ్యపు కలుపు మొక్కల భాషాజాలం .. విస్తరించిన చీడ కొమ్మలనలముకొన్న విషం .. కొత్త ఆశల […]

తల్లి *వేరు*

రచన:సందిత ధరణిన్ చాలా గొప్పది తరుమూలముతరచిచూడతగువిధిఁ! బీజాం కురమదిప్రథమాంకురమది! గురుతరమగుప్రథమమూల గుణితంబదియౌ! బలమునొసంగెడుదుంపగు తొలగింపగరోగమోషధులరూపమ్మౌ తెలియసుగంధపువేరగు పలువిషములవిరిచివేయుపరమామృతమౌ పైపైకెదుగన్ జూడక పైపైమెరుగులనుకోరిపరుగులనిడకన్ పైపైకెదుగన్ సహజుల కాపై జూపకనసూయ నాహారమిడున్ స్వర్గసుగంధసుధలఁతరు వర్గోద్భూతప్రసూనఫలరూపమునన్ దుర్గమమైనట్టియథో మార్గంబందునచరించిమరియందించున్ సౌందర్యముమాధుర్యము విందులుబడసినవియెదుగవేరులవలనన్ పొందుచునథోగతులనటు నందించున్ సాయమటుల నమ్మనఁవేరుల్ పొగడునులోకంబారయ నగుపించగవృక్షశోభనాహాయనుచున్ దిగుచున్ తానెదిగించును సుగుణమ్ములరాశి *వేరు*సూనృతమరయన్ దిగుచున్ తొలుచుచుజేరును పగలున్ రేయనకఁబూని పాతాళమ్మున్ భగవంతునిపాదమ్మది సగమాకసమందు సగము సాగుచు భూమిన్ !

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

May 2017
M T W T F S S
« Feb   Jun »
1234567
891011121314
15161718192021
22232425262728
293031