April 19, 2024

వివిధ దశల్లో వనిత

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు.

బాల్యంలో పొందాల్సిన లాల్యంలో
అనూహ్యంగా మగపిల్లాడికంటే తక్కువే,
చెందాల్సిన హక్కుల విషయంలో
అత్యంత అసహజంగా ఆమె లోకువే.
యవ్వనంలో నాన్న వెనకేసుకొచ్చినా
అణకువ, అణిగిఉండటం తనకు మాత్రమే
సంబంధించినవి అన్నట్లున్న బోధలు,
తను మాత్రమే అనుసరించి తీరాలనే నిబంధనలు.
తప్పుచేయకున్నా తప్పనిసరి బాధలు,
నియమాల గట్టు దాటకున్నావదలని వ్యధలు.
అడుగడుగునా ఆమెకు షాకులు,
వీధిలోకెళ్తే వెధవల వెర్రిచూపుల బాకులు,
వికారం కలిగించే చిత్తకార్తి కుక్కల చొంగ కార్పులు.
కళాశాలకెళ్తే కాటేయటానికి సిద్ధంగా ఉండే విషనాగులు,
క్యాబెక్కుతే కబళించటానికి కాచుకు కూర్చున్న కామపిశాచులు.
కట్నం తేలేదని కాల్చివేతలు,

1 thought on “వివిధ దశల్లో వనిత

  1. ఆర్యా! కవిత పంపుదామని చూస్తే నాట్ ఫౌండ్ అని వస్తోందే తప్ప ఎన్ని సార్లు పంపినా మెయిల్ మీకు చేరటం లేదు. కారణం ఏమిటో తెలియటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *