March 28, 2023

మాయానగరం – 35

రచన: భువనచంద్ర “వాన్ని గమనించాను వెంకటస్వామి… నిస్సందేహంగా వాడు పరమశివమే! అయితే వాడు ఇటువైపు రాలేదు. వెనక వైపు నుండి వచ్చి మా పెరట్లోకి దూకాడు. యాక్ట్యువల్ గా ఇవాళ నాకు ఆఫ్. అయినా ఓ చిన్నవిషయం వల్ల ఆఫీస్ కు వస్తూ వాడ్ని చూశాను. వాడి కథంతా మహదేవన్ గారు నాకు చెప్పారు. వాడెంత క్రూరుడో కూడా చెప్పారు. నువ్వే ఎందుకో నాతో చెప్పడానికి సందేహించావు. వాడేదో క్రూరత్వమైన ఆలోచనలతోటే ఇక్కడికొచ్చాడు. బహుశా వాడొచ్చాడని మీకు […]

బ్రహ్మలిఖితం 6

రచన: మన్నెం శారద భగవంతుడు దుష్టులకెన్నడూ సహాయపడడని.. తాత్కాలికంగా కనిపించే విజయాలన్నీ తర్వాత శాపాలై వంశపారంపర్యంగా తింటాయని అతను గ్రహించే స్థితిలో లేడిప్పుడు. అదతని దురదృష్టం. ***** లిఖిత ఎంతో అవస్థపడి హైద్రాబాదు చేరుకుంది. తల్లి ఇచ్చిన ఎడ్రస్ ప్రకారం ఆమె ఎలాగోలా జుబ్లీహిల్స్‌లోని కేయూర లాబరేటరీస్‌కి చేరుకుంది. అంతవరకు ఆమె పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదని ఆమెకి గుర్తు కూడా లేదు. ఆమెకు ఆకలి, దాహం అన్నీ తండ్రిని చూడాలన్న ఆరాటంలోనే కలిసిపోయాయి. దూరం నుండే […]

శుభోదయం

రచన: డి.కామేశ్వరి “ఆత్మహత్యా.. ఆత్మహత్యకి తలపడిందా? ఏమయింది, ఎలా వుంది?… అసలేం జరిగింది?” అప్రతిభురాలై అడిగింది. “అమ్మా.. రేఖ టిక్ ట్వంటీ తాగిందట. ఎంతోసేపటికిగాని ఎవరూ చూడలేడుట. చూసి తీస్కొచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేశారట. డాక్టర్లు చాలా ప్రయత్నించాక ఆఖరికి ప్రమాదం గడిచిందంటున్నారు.” “ఏం జరిగింది? ఎందుకింతపని చేసింది?” తెల్లపోతూ అంది. శ్యాం తల దించుకున్నాడు. “అమ్మా.. రేఖ.. ప్రెగ్నంట్ అయిందని, అందుకని… సిగ్గుతో, భయంతో ఆ పని చేసిందని అనుకుంటున్నారు. రేఖ ఫ్రెండు .. వాళ్ల […]

Gausips – ఎగిసే కెరటాలు-11

రచన:- శ్రీసత్యగౌతమి లహరి గురవుతున్న అశ్వస్థతను ల్యాబ్లోని ఇతరులు గుర్తించి కంగారు పడ్డారు, దానితో లహరీ కంగారు పడుతూ శరీరం మీద వస్తున్న రాషెస్ (Rashes, దద్దుర్లు), ఆకస్మిక వాపులను చూసుకోవడం మొదలు పెట్టింది.ఇంతలో కౌశిక్ కూడా అటే వచ్చాడు. అది చూసిన సింథియా భృకుటి ముడుచుకుంది. కౌశిక్ లహరిని పరీక్షగా చూసి, వెంటనే హాస్పిటల్ ఎమ్ర్జెన్సీ కి పంపించాడు, తానుగా హాస్పిటల్ స్టాఫ్ కి ఫోన్లు చేసి. కౌశిక్ యొక్క ప్రమేయంతో లహరికి హాస్పిటల్ వసతులు […]

ఈ జీవితం ఇలా కూడా వుంటుందా? 9

రచన: అంగులూరి అంజనీదేవి అంకిరెడ్డి ఆఫీసు నుండి ఇంటికి రాగానే సతీష్‌చంద్ర ఫోన్‌ చేసినట్లు మాధవీలతతో చెప్పాడు. ఆమె మాట్లాడకుండా మౌనంగా విని ”సరే! మీకు కాఫీ తెచ్చిస్తాను” అంటూ అక్కడ నుండి కావాలనే లేచి వెళ్లింది. భార్య కాఫీ తెచ్చేంత వరకు ఖాళీగా కూర్చోకుండా లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి కొత్తగా వచ్చిన వెబ్‌సైట్లు చూసుకుంటూ కూర్చున్నాడు. ”ఊ… ఇదిగోండి కాఫీ” అంటూ ఆయనకు నాలుగు అడుగుల దూరంలో వున్నప్పుడే అంది. ”దగ్గరకి రా! అక్కడ నుండే […]

ట్రావెలాగ్ – వారణాసి యాత్ర

రచన: చెంగల్వల కామేశ్వరి మన దేశం లో కాల భైరవుడు క్షేత్రపాలకుడుగా పార్వతీ పరమేశ్వరులు కొలువయిన వారణాశిని దర్శించడం పూర్వ జన్మ సుకృతం ఎంతో అదృష్టం ఉండాలి. అన్నిటికన్నా మనకి ఆ పుణ్యక్షేత్ర దర్శనం కావాలంటే కాలభైరవుని అనుగ్రహముండాలి. అందుకే మనం వారణాశి వెళ్లాలి అనుకుంటే కాలభైరవాష్టకం చదువుకోవాలి. నిరాటంకంగా మన వారణాశి యాత్ర చక్కగా జరుగుతుంది వారణాశికి బెనారస్ అని, కాశీ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లో ఉంది. పూర్వం […]

ప్రేమతో

రచన: డా.లక్ష్మీ రాఘవ అర్ధరాత్రి!! చిమ్మ చీకటి!!! ‘ధన్’ శబ్ద౦!!!! కిందపడగానే ‘కుయ్’ మన్న శబ్దం వచ్చింది నా నోట్లో… స్కూటర్ స్టార్ట్ అయిన శబ్దం! ఏం చేసారు నన్ను??? తల పైకి ఎత్తబోతే.. ‘జుయ్’మని వెళ్ళిపోయింది స్కూటర్. ఎక్కడ వున్నాను?? అర్థం కాలేదు నాకు. పైకి లేవబోయాను..పడిపోయాను..కాలు విరిగింది కదా ఎలా లేవగలను?? పొద్దున్న రోడ్డు మీదకు రాగానే వెనకనుండి కొట్టిన కారు నిలవకుండా వెళ్ళిపోయింది..కింద పడిపోయి ‘కుయ్యో’ మని అరుస్తుంటే..పట్టించుకున్న వాళ్ళెవరు నన్ను?? చివరకు […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

May 2017
M T W T F S S
« Feb   Jun »
1234567
891011121314
15161718192021
22232425262728
293031