April 20, 2024

మాలిక పత్రిక జూన్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ఎప్పటిలాగే మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, సీరియళ్లు, ఆధ్యాత్మిక, సరదా రచనలతో మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక జూన్ 2017 సంచిక. మాలిక పత్రికలో కొన్ని మార్పులు, చేర్పులతో పాటు కొత్త ఆలోచనలకు నాంది  పలకడం జరిగింది. అందులో మొదటిది ఒక వీడియో టపా. ఇలాటివి మరికొన్ని రాబోయే సంచికలలో మీకోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com ఈ మాసపు అంశాలను పరికిద్దామా […]

గడసరి అత్త – సొగసరి కోడలు

అత్తా కోడలూ…యెంత ఆకర్షణ యీ పదాల్లో !!.పుల్ల పుల్లగా.. తియ్య తియ్యగా ఊరించే మామిడి ముక్కల పైన కాస్తంత కారం అలా అంటించి, ఉప్పు కాస్త తగిలించి, పంటికింద వేసుకుని….నెమ్మది నమ్మదిగా నములుతూ ఉంటే….యెంత బాగుంటుందో మన తెలుగు నాలుకలకు వివరించి చెప్పవలసిన పని లేదు కదా !!! ఇదివరకటి తరంలోని గయ్యాళి తనం, ఇప్పటి సర్దుకుపోయే గుణం, తెలుగు చెరకు పాల రుచులూ, ఇంగ్లీషు మాటల తేనె చుక్కలు, చిరు కోపమూ, నవ్వుతూనే చురకంటించే గడసరి […]

రంగుల ‘భ్రమ’రం..

రచన, చిత్రం, కవితాగానం : కృష్ణఅశోక్ ఈ మైక్ మీద క్లిక్ చేసి  కవితను వింటూ చదువుకోండి. అప్పుడప్పుడు… ఆకాశంలో ఉల్కలు రాలిపడినప్పుడో, భూమ్మీద సునామీలు చెలరేగినప్పుడో, నాలోకి నేను ప్రయాణం చేస్తుంటాను… కారణం లేకుండానే! జ్ఞాపకాలు హృదిలో కదలాడే వేళ మొదట కనిపించేది నీవే… నగ్నంగా… అవును! నగ్నంగానే… నిన్ను మొదటిసారి నగ్నంగా చూసినప్పుడు “నా న్యూడ్ పెయింటింగ్ వేస్తావా!?” అని ఆకాశంలో ఏదో వెదుకుతున్నట్టు చూస్తూ అడిగావ్… గుర్తుందా!…” భౌతికంగా కాకుండా, మనో నగ్నత్వం […]

దుఃఖ విముక్తి

రచన:- రామా చంద్రమౌళి అతనికి చాలా దుఃఖంగా ఉంది పంచుకోడానికి ఎవరూ లేరు.. చుట్టూ వెదికాడు అంతా అరణ్యం నాభిలోనుండి తన్నుకొస్తున్న ఆక్రోశంతో ఆకాశం దద్ధరిల్లేలా అరిచాడు సకల దిశలూ ప్రతిధ్వనించాయి కాని దుఃఖం తగ్గలేదు పరుగెత్తి పరుగెత్తి.. ఒక మనిషిని చేరాడు మధ్య మద్యం సీసాను తెరిచి పెట్టుకుని దుఃఖ గాథ నంతా వర్షించాడు.. దుఃఖం రెట్టింపయింది శరీరమంతా కరిగి కరిగి.. అంతా కన్నీరే వెళ్ళి ‘ యూ ట్యూబ్ ‘ లో కళ్ళు మూసుకుని […]

మాయానగరం – 36

రచన: భువనచంద్ర బోంబే లో ట్రైనింగ్ అయ్యాక అక్కడే ‘జూహూ’ లో పోస్టింగ్ ఇచ్చారు ఆనందరావుకి… ఇది కాస్త ఊహించని విషయమే. జనరల్ గా ఎవరి స్వరాష్ట్రానికి వారిని పోస్ట్ చేస్తారు…. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి. ఆనందరావు విషయంలో చిన్న తేడా జరిగింది. తొలి పోస్టింగ్ గనక చెయ్యక తప్పదు. ఛాయిస్ అడగటానికిప్పుడు వీలుండదు. బొంబే లో అన్నీ దొరుకుతాయి …. ‘ఇళ్ళు ‘ తప్ప. వెయ్యి అడుగుల అపార్ట్మెంట్ సంపాదించుకొన్న బాలీవుడ్ నటవర్గమే ఆనందంతో పొంగిపోతారు. […]

బ్రహ్మలిఖితం – 7

రచన: మన్నెం శారద తాత్కాలికంగా వచ్చిన పని మరచిపోయి లిఖిత దాని దగ్గర కెళ్లి మోకాళ్ల మీద కూర్చుని దాన్ని నిమరసాగింది. పామరిన్ కుక్కపిల్ల లిఖిత ఏనాటి నుండో తెలిసినట్లుగా లిఖితని ఆనుకొని కూర్చుని ఆమె చేతుల్ని ఆబగా నాకుతూ తన ప్రేమని ప్రకటించుకోసాగింది. బహుశ గత జన్మలో ప్రేమరాహిత్యానికి గురయిన వ్యక్తులు పామరిన్ కుక్కలుగా పుడ్తారేమోననిపించింది లిఖితకి. ఎలాంటి కరకురాతి మనిషయినా వాటిని దగ్గరకు తీయకుండా వుండలేడు. లిఖిత దాన్ని లాలిస్తుండగా పక్క గోడ మీంచి […]

జీవితం ఇలా కూడా ఉంటుందా??? 10

రచన: అంగులూరి అంజనీదేవి ”అవి వాడి లోపల వున్న బేబీకి లంగ్స్‌ పెరిగేలా చేస్తారట. లంగ్స్‌ పెరిగితే బ్లెడ్‌ సర్కులేషన్‌ ప్రాపర్‌గా వుండి బాడీ పెరిగే అవకాశాలు వున్నాయంట…” ”అలా ఎన్ని వాడాలి?” ”ముందు ఒకటి వాడి రెండు వారాల తర్వాత స్కాన్‌ తీసి అవసరమైతే మళ్లీ ఇంకో ఇంజక్షన్‌ ఇస్తారట” ”మరి వాడారా?” ”అది నాకు ఇంకా చెప్పలేదు. హాస్పిటల్‌ నుండి రాగానే అమ్మ గొడవ పెట్టుకుందట. ఆ హడావుడిలో అంతవరకే చెప్పాడు నాన్న. స్టెరాయిడ్‌ […]

Gausips – ఎగిసేకెరటాలు-12

రచన:-శ్రీసత్య గౌతమి “సోఫియా … పేరు సోఫియా. ఎవరయి ఉంటుందీ? అమెరికన్లా లేదు. హిస్పానికన్. యస్ హిస్పానికన్. సోఫియా హిస్పానికన్ నేం. ఈమె రీసెర్చ్ చేసే వ్యక్తిలా లేదే? మరి ఈ డేటాలెందుకు? సరేలే … నేను మాత్రం రీసెర్చర్ నా? అయినా నేను లేనూ???… రీసెర్చర్ అంటే లహరిలా ఉండాలి! కౌశిక్ ని అడిగితే ఈమె గురించి తప్పకుండా వివరాలు దొరుకుతాయి, కానీ సోఫియా నాకెలా తెలుసని అడుగుతాడే..అపుడెలా?” …అని స్వగతంలో ఆలోచిస్తున్నది. సోఫియా శామ్యూల్ […]

శుభోదయం

రచన: డి.కామేశ్వరి ఆమె మాటలకి మాధవ్ కూడా కాస్త విచలితుడయ్యాడు. అంతలోనే పౌరుషంగా “నాకెవరి సహాయం అక్కరలేదు” బింకంగా అన్నాడు. “నీకక్కరలేదు. కాని రేఖకి కావాలి” లోపల్నించి రాధాదేవి గొంతు గుర్తుపట్టిన రేఖ ఒక్క ఉదుటున పక్కమీద నుంచి లేచి వచ్చి రాధాదేవిని కౌగలించుకుని “ఆంటీ” అని బావురుమంది. ఈ హడావిడికి శారద కూడా లోపల్నించి వచ్చి “అక్కయ్యా, ఎంత పని జరిగిందో చూశావా? నీలాగే అయింది దాని బతుకూ, నిన్ను పెట్టిన ఉసురు మాకు కొట్టింది […]

భూరితాత

రచన: భాస్కరలక్ష్మి సంభొట్ల అర్ధరాత్రి రెండు అయినట్టు ఉంది, టెలిఫోన్ చప్పుడికి ఇంట్లో అందరం హాల్లోకి వచ్చాము. మా అబ్బాయి తేజ పేరున్న హృదయవ్యాది నిపుణుడు కావడంతో మాకు ఇవి మామూలే. ఎదో అత్యవసర పరిస్థితిట, హాస్పిటల్ నుండి సందేశం, హడావిడిగా అబ్బాయి వెళ్ళిపోయాడు. నాకు, మా ఆవిడకి వెంటనే నిద్ర పట్టలేదు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ, టీవీ చూస్తూ ఉన్నాము. ఇంతలోనే తేజ వచ్చేశాడు. ఎవిట్రా అంటే ఐదేళ్ల చిన్న కుర్రాడికి నిన్న సాయంత్రం శస్త్ర […]