April 25, 2024

దుఃఖ విముక్తి

రచన:- రామా చంద్రమౌళి

అతనికి చాలా దుఃఖంగా ఉంది
పంచుకోడానికి ఎవరూ లేరు.. చుట్టూ వెదికాడు
అంతా అరణ్యం
నాభిలోనుండి తన్నుకొస్తున్న ఆక్రోశంతో ఆకాశం దద్ధరిల్లేలా అరిచాడు
సకల దిశలూ ప్రతిధ్వనించాయి
కాని దుఃఖం తగ్గలేదు
పరుగెత్తి పరుగెత్తి.. ఒక మనిషిని చేరాడు
మధ్య మద్యం సీసాను తెరిచి పెట్టుకుని
దుఃఖ గాథ నంతా వర్షించాడు.. దుఃఖం రెట్టింపయింది
శరీరమంతా కరిగి కరిగి.. అంతా కన్నీరే
వెళ్ళి ‘ యూ ట్యూబ్ ‘ లో
కళ్ళు మూసుకుని విషాదగీతాలనూ, కృతులనూ విన్నాడు
లావా కరుగుతూ నరాల్లో ప్రవహిస్తున్న అనుభూతి
శరీరం అంతర్ధానమౌతున్నట్టు తప్తత
కాని .. అశ్రు అవశేషాలేవో ఇంకా మిగిలే ఉన్నాయి
సంగీతం విన్నాడు .. సంభాషణలు విన్నాడు
ఉద్యమ గీతాలనూ, విషాదానంద బ్రహ్మ ప్రవచనాలనూ విన్నాడు
కాని లోపలి నిప్పు ఆరడంలేదు
లేచి .. ఒంటరిగా.. ఏకాంతంగా.. ఆఖరి మెట్టుపై కూర్చుని
కళ్ళు మూసుకుని లోపలి ప్రపంచంలోకి ప్రవేశించాడు
అంతా నిశ్శబ్దం .. నిరంతరమైన శుద్ధనిశ్శబ్దం
నిశ్శబ్దంలో లీనమౌతున్నకొద్దీ
దుఃఖం మెల్లగా తెల్లని పావురమై.. ఎగిరిపోతూ.. అదిగో
విముక్తత –
*

4 thoughts on “దుఃఖ విముక్తి

  1. కవిత చాలా లోతుగా, తాత్వికంగా చాలా బాగుంది

  2. కవిత చాలా లోతుగా, తాత్వికంగా చాలా బాగుంది

Leave a Reply to Dr. Tangirala . MeeraSubrahmanyam Cancel reply

Your email address will not be published. Required fields are marked *