April 17, 2024

బహుజన సమీకరణకు ‘సమూహం’

రచన: జ్వలిత డెంచనాల కులాల గుట్టు రట్టు చేసే మార్గం అంతర్‌ వివాహాలు మాత్రమే అని చెప్పారు అంబేద్కర్‌. అస్తిత్వవాదం ఇప్పుడు మొదయింది కాదు. జ్యోతిరావుపూలే తన రచను బోధన ద్వారా చేసినది అదే. పుట్టుకతో అందరూ సమానులే అయినా చదువు లేని కారణంగా బానిసలుగా, పాపులుగా భావించబడు శూద్ర, అతిశూద్రు సమానమని వారు ఐక్యంగా కలిసినపుడు ద్రోహపూరిత వ్యూహాను తిప్పికొట్టగలుగుతామని, కులం కన్న, మతం కన్న మానవత్వం గొప్పదని, విద్య అందించిన జ్ఞానం వల్లనే మానవీయత […]

‘వేయి పడగలు’ అక్షర యాత్రకు దారి

రచన: విజయలక్ష్మీ పండిట్   “విశ్వనాథ ‘వేయిపడగలు’ లోని కొన్ని ముఖ్యాంశాలు, విశ్వనాథ గురించి కొందరు ప్రముఖుల భావాలు” అనే డా.వెల్చాల కొండలరావుగారి సంకలనం ఈ తరం కవులు, రచయితలు చదవవలసిన సంకలనం. వివిథ వర్ణాల సుగంథభరిత పూలతో, వైవిధ్యభరిత వృక్షాలతో మనోహరంగా ఉండే దట్టమైన ఒక అందమైన అడవిలో మనిషి ప్రయాణించడానికి ఆ అడవి అందాలను పూర్తిగా అనుభవించడానికి, దారి తెన్ను తెలపడానికి ఒక నావిగేషన్ మ్యాప్ (navigation map) కావాలి. అలాగే కవిసామ్రాట్ విశ్వనాథ […]

ఫీల్ గుడ్ మీడియా..

రచన: జి.ఎస్.లక్ష్మి మన నట్టింట్లో తిష్టవేసి, మనలను వినోదింప చేయవలసిన టీవీతో మనలో చాలామంది అనుభవిస్తున్న నిత్య సంఘర్షణ అందరికీ తెలిసినదే. వేలకువేలు పెట్టి టీవీలు కొంటున్నాం. ప్రతినెలా వందలకి వందలు కేబుల్ కనెక్షన్ కి కడుతున్నాం. దానివల్ల యింట్లో మనము కోరుకున్న ప్రసారాలు వస్తున్నాయా? ఈమధ్య ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. రోజురోజుకీ సమాజపు విలువలను దిగజారుస్తున్న టీవీ కార్యక్రమాలపై ప్రేక్షకులు చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబమంతా కూర్చుని చూసే ఆ కార్యక్రమాలకి ఒక […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 16

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఓ దేవ దేవా! నీ లీలలు మాకు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మాలాంటి సామాన్యులకు నీ మాయలు అర్ధం కానే కావు. పరమాత్మ గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు, కేవలం ఆయన గుణాలను కీర్తించటం తప్ప మనం ఏం చెయ్యలేమని అన్నమయ్యకు అర్థం అయ్యింది. ఆ విషయాన్నే చెప్తున్నాడు. మనకు రుక్మాంగద, ధర్మాంగద, హరిశ్చంద్రుడు, గజేంద్రమోక్ష గాధలను ప్రస్తావిస్తూ శ్రీ మహావిష్ణువు గొప్పదనాన్ని చాటుతున్నాడు.` ఆ గాధల ద్వారా పరంధాముని కరుణ […]

నీటిని పొదుపుగా వాడుకుందాం!

రచన: శారదాప్రసాద్ (టీవీయస్. శాస్త్రి) నీటిని పొదుపుగా వాడేవారు ధనాన్ని కూడా పొదుపుగా వాడుతారట!నీటిని దుబారా చేసే వారు డబ్బును కూడా అలానే దుబారా చేస్తారట. ఈ భూమి మీద లభిస్తున్న మొత్తం నీటిలో 97 శాతానికి పైగా సముద్రజలం. అది ప్రాణులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేది కాదు. మరో రెండు శాతానికి పైగా మంచు రూపంలో ఉంది. మిగిలిన ఒక్క శాతంకన్నా తక్కువే ప్రాణులకు పనికివచ్చేది. అదే మంచినీరన్న మాట! ఇప్పుడా మంచినీటికి పెద్ద ముప్పు ఏర్పండింది. […]

దీపం

రచన: కృష్ణ మణి నింగిలోంచి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు తెలిసింది ఎంత అందంగా ఉందోనని ! అన్ని గ్రహాలు ఉన్నట్లు గుండ్రంగా ఉన్నా ఆ అందాల ప్రక్రుతి హొయలు మనసుని కట్టిపడేసింది తెల్లని మబ్బుల ఊయలలు డోలాయమానం అంటే ఏంటో రుచి చూపించాయి అ నీలి సంద్రం మధ్యలో పచ్చటి మైదానపు ప్రదేశాలు అక్కడక్కడ గోదుమరంగు ఇసుక ప్రాంతాలు కన్నుల పండుగనే చెప్పాలి మబ్బుల్ని దాటి భూమిపైకి వస్తుంటే ఏవో రేకుడబ్బాలు చువ్వలు దాడి చేసాయి భూమికి […]