April 20, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 17

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య మానవ జన్మ ఎక్కువ కాలం నిలిచి వుండదు. లభించిన కాలాన్ని అంటే జీవించియున్న కాలాన్ని సక్రమంగా వాడుకోవాలి. “దుర్లభో మానుషోదేహః” శరీరం లభించడమే చాలా కష్టం, “దేహినాం క్షణ భంగురః” లభించినది ఒక క్షణమంత కూడా ఉండదు. “మిన్నిన్ నిలయిల మన్ను ఇఱాక్కెగళ్” అని చెబుతారు నమ్మాళ్వార్. ఇది మెరుపు కంటే కూడా ప్రమాదకరమైనది. మెరుపు ఎట్లా ఐతే పోయేదో, ఆ వెలుతురును పట్టించుకోం, అట్లానే శరీరం పోయేది అని తెలిసి కూడా […]

బ్రాహ్మణుడంటే ఎవరు?

రచన: శారదా ప్రసాద్(టీవీయస్.శాస్త్రి) రాజకీయాలలోనే కాదు అన్ని వేదికలమీద కూడా కొందరు తామే హిందూ మతోద్ధారకులమని చెప్పుకుంటూ ఒకరినొకరు అభినిందించుకునేవారున్నారు. వారికివారే డబ్బాలు కొంటుకుంటారు! హిందూమతం ఎవరూ ఉద్ధరించే నీచస్థితిలో ఇప్పుడూ లేదు,ఇక ముందు కూడా ఉండబోదు! భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు హిందూమతంలో ఉండటమే, హిందూమతం యొక్క విశిష్టత, ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఉండబట్టే హిందూమతం నిరంతరం ప్రవహిస్తుంది! మతోద్ధారకులమని చెప్పుకునే వారికి ఇతరుల భావాలను గౌరవించటం చేతకాదు! వారి భావాలకు భిన్నమైన భావాలను వ్యక్తపరిస్తే […]

దైవప్రీత్యర్థం విధ్యుక్త ధర్మాచరణం

రచన: జి సందిత మానవులు జన్మనుసార్థకంచేసుకోవటం అంటే భగవంతుని మెప్పుపొందటమే! అందుకోసం మనుషులకై నిర్దేశించిన అనుసరించవలసిన కర్మాచరణ విధివిధానశాస్త్రమే ధర్మము. కర్మాచరణం కూడా త్రికరణశుద్ధిగా చేయవలసి వుంటుంది. అప్పుడే అది ధర్మంమవుతుంది. త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా వైరుధ్యం లేక పోవటమే! ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి భోజనంపెట్టటం మన ధర్మం అనుకుందాం అప్పుడు వండి సిద్ధం చేయటం వడ్డించటం శరీరకర్మ. అతిథిని భోజనానికి ఆహ్వానించటం తదుపరి ఏమేమి ఉన్నాయో తెలిపి కొసరికొసరి అడగటం […]

ఇద్దరు మనుషులు

రచన:- రామా చంద్రమౌళి ఆ రోజు ఆదివారం.. మధ్యాహ్నం పన్నెండు దాటిందేమో పొద్దటినుండీ .. మబ్బు పట్టిన ఆకాశం ఒకటే ఉరుములు .. గర్జనలు వర్షం ఎప్ప్పుడు మొదలౌతుందో తెలియదు అతను ఫ్రిజ్ మీది అందమైన బుద్ధుని గాజుబొమ్మను కోపంతో విసిరేసాడు. భళ్ళున పగిలి అన్నీ గాజు ముక్కలు .. తళతళా మెరుస్తూ పిల్లలిద్దరూ బెడ్రూంలో నక్కి నక్కి ముడుచుకుపోయి.. నోళ్ళు మూసుకుని, ఆమె.. చేతిలోని టీ కప్పును నేలకేసి కొట్టింది. ఫెడేల్మని.. పగిలి.. అన్నీ పింగాణీ […]

వీరు…

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. పిల్లల ఎన్ని ఆగడాలనైనా భరిస్తారు, వారి ఎన్ని తప్పులనైనా క్షమిస్తారు, వారి ఎన్ని అవివేకాలనైనా హర్షిస్తారు, ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక! సదా వారి సేవలో తరిస్తారు, ఎప్పుడూ వారి క్షేమాన్నే కాంక్షిస్తారు, వారి సుఖాన్వేషణలోనే చరిస్తారు, ఎందుకంటే వీరు వారికి తల్లితండ్రులు కనుక! వారితో చీవాట్లు వీరి అలవాట్లుగా చేసుకుంటూ, వారితో చెప్పుదెబ్బలు వీరి పొరపాట్లుగా చెప్పుకుంటూ, వారితో అగచాట్లు తెరచాట్లుగా ఉంచుకుంటూ ఉంటారు, ఎందుకంటే వీరు వారికి […]

సాధ్యం కాదేమో!

రచన: పారనంది శాంతకుమారి కొంత మాయ,కొంత మర్మం నేర్చుకొంటే కానీ జీవించటం సాధ్యం కాదేమో! కొంత నటన, కొంత మౌనం అలవర్చుకొంటే కానీ మెప్పుపొందటం సాధ్యం కాదేమో! కొంత స్వార్ధం, కొంత లాభం చూసుకుంటే కానీ సుఖపడటం సాధ్యం కాదేమో! కొంత వేదం, కొంత నిర్వేదం ఆచరిస్తే కానీ ఆనందించటం సాధ్యం కాదేమో! కొంత గోప్యం, కొంత లౌఖ్యం ఉంటే కానీ శాంతి దొరకటం సాధ్యం కాదేమో!