Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మహాశయులకు, రచయిత మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవం, రక్షాబంధన పండగ శుభాకాంక్షలు.. ఈ జీవితం చాలా చిన్నది. ఆ కొద్ది సమయంలో ఎందుకీ కలతలు, కలహాలు, అపార్ధాలు, గొడవలు. ఒకరిమీద ఒకరికి స్నేహభావం ఉంటే ఎటువంటి అపార్ధాలకు తావుండదు. కలిసిమెలసి సంతోషంగా ఉందాం. హాయిగా నచ్చినది చదువుకుంటూ, ఇష్టమైన పనులు చేసుకుంటూ కాలం గడిపేద్దాం. మాలిక పత్రికలో వస్తోన్న సీరియల్స్, కథలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, కొత్తగా మొదలుపెట్టిన […]
Day: August 1, 2017
సామాజిక స్పృహ నేపధ్యం
రచన: డా. నాగపద్మిని పుట్టపర్తి మానవుడు సంఘజీవి. అంతే కాదు మేధోజీవి కూడా. సమాజంలో ఇరుగుపొరుగు వారితోనే కాదు, జంతువులూ, మొక్కలతోనూ సహజీవనం చక్కగా చేయగల నేర్పు, ఓర్పూ గలవాడని, తరతరాల చరిత్ర చెబుతున్నది.తన హక్కులూ బాధ్యతలేకాక, ఇతరుల హక్కులూ బాధ్యతలను గౌరవించటమన్న సర్దుబాటును అలవరచుకోవటమే అంచెలంచెలుగా మానవేతిహాసమైంది. అసలిలా మానవుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించిన స్పృహతో జీవించటాన్నే సామాజిక స్పృహ అన్న పేరుతో పిలుస్తున్నారు ఇటీవలి కాలంలో. కానీ యీ స్పృహ చాలా […]
మాయానగరం – 38
రచన: భువనచంద్ర “ఇన్నేళ్ళుగా మీరిక్కడ వుంటున్నారు? నాకు తెలిసి, ఇది నీరు లేక మోడుగా మారిన దేవాలయం. దీన్ని ఇంత పచ్చగా చేసినవారెవరు? ” అడిగాడు రుషి. రుషికి ఇరవై తొమ్మిదేళ్ళు వుంటాయి. అందంగా, దబ్బపండుగా వుంటాడు. వొంటి మీద కాషాయ రంగు పైజామా లాల్చీ వున్నాయి. మెడలో రెండు మూడు పూసల దండలూ, ఓ రుద్రాక్షమాలా వున్నాయి. భుజాన వేలాడుతూ ఓ కాషాయ సంచీ. అతడంతట అతను వచ్చి అమరేశ్వర అవధానిగార్ని పరిచయం చేసుకున్నాడు. ” […]
బ్రహ్మలిఖితం – 10
రచన: మన్నెం శారద “రాగి వేడిని బాగా పీలుస్తుంది తొందరగా. దాని మీద వెలిగించిన కర్పూరపు వేడికి రాగి కాయిన్ వేడెక్కుతుంది. దాంతో ఆముదం కూడా వేడెక్కి దాని డెన్సిటీ (సాంద్రత) తగ్గి పలచబడుతుంది. పలచబడగానే ఆముదం ప్రవహించటం మొదలెడుతుంది వాలుకి. దాంతో పైన జ్యోతి వెలుగుతున్న రాగిబిళ్ళ కదిలి ప్రవాహానికనుగుణంగా నడుస్తుంది. మన అదృష్టం ఆ దిశనుందని.. మనకి భ్రమ కల్గిస్తాడు కోయదొర. నేను కూడా నిన్న జ్యోతి నడవడం గురించి ఆశ్చర్యపడ్డాను. కాని ప్రాక్టికల్‌గా […]
జీవితం ఇలా కూడా ఉంటుందా? – 12
రచన: అంగులూరి అంజనీదేవి రోజులు గడుస్తున్నాయి. అరుణోదయం వేళ అప్పుడే సూర్యుడు పైకి వస్తూ ఇళ్ల మధ్యలోంచి, చెట్ల మధ్యలోంచి తొంగి చూస్తున్నాడు. ఆ సూర్యుని లేలేత కిరణాలు సోకి ఆరుబయట గంగిరావిచెట్టు కింద నవారు మంచంలో పడుకొని వున్న సతీష్‌చంద్ర కొడుకు బోసి నవ్వులు నవ్వుతున్నాడు. గాలికి వూగే మొక్కజొన్న కంకుల్లా పిడికిళ్లను పైకి లేపి కదిలిస్తూ కాళ్లతో మంచం మీద తన్ని పైకి జరగాలని చూస్తున్నాడు. సతీష్‌చంద్ర ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని బాబునే చూస్తూ […]
Gausips.. ఎగిసే కెరటాలు-13
రచన:- శ్రీసత్యగౌతమి రాకేష్ తో తెగతెంపులు చేసుకొని నేరుగా కౌశిక్ రూం వైపు నడుస్తూ … లహరి ఆఫీసు రూం ని దాటుతోంది. ఎందుకో కాస్త మనసు బాధ కలిగింది సింథియాకు, అక్కడ లహరి కనబడకపోయేసరికి. ఆమె రూం లో లైట్ లేదు. అందరూ ఆ చుట్టు ప్రక్కలే ఉన్నా నిశ్శబ్దంగా ఉన్నారు. కౌశిక్, సింథియాల అలికిడి ఉన్నా, శబ్దం రాని సముద్రపు అలలా అనిపిస్తున్నది సింథియాకు. “లహరి నిష్క్రమణ ఇంత బాధిస్తున్నదెందుకు నాకు? చేసిన పాపం […]
స్త్రీ ఎందుకు బానిసైంది? – ముళ్ళ కంచెల మూలాలు
రచన: జ్వలిత భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు, స్త్రీవాదం గురించిన ఆలోచన భారతదేశంలో మొలకెత్తక ముందే 1942లోనే “స్త్రీ ఎందుకు బానిసైంది”. అనే ప్రశ్నను లేవనెత్తి చర్చించి వివరణనిచ్చారు “ఆత్మ గౌరవ ఉద్యమకారుడు” యాక్టివిస్ట్ ఈరోడ్ వెంకటప్ప రామస్వామి పెరియార్. వారు ఆంగ్లంలో రాసిన “Why were women Enslaved” రచనకు తెలుగు సేత ఎ.జి. యతిరాజులు చేయగా ప్రజాశక్తి బుక్ హౌస్ వారు 2010లో ప్రచురించారు. కవరు పేజీతో కలిపి 52పేజీల పుస్తకం. ఇందులో మొత్తం […]
జీవన వారధులు
రచన: డా.విజయలక్ష్మీ పండిట్ ”అమ్మా.. ఆత్మహత్య అంటే ఏంటి? ఎందుకు చేసుకుంటారు?” ఈనాడు న్యూస్ పేపర్ మధ్య పేజీలను పక్కన పెట్టి అక్కడే కాఫీ తాగుతున్న వాళ్ళమ్మనడిగింది పన్నెండేళ్ళ దివ్య. ఈనాడు మెయిన్ పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న సునీత, కూతురు ప్రశ్నకు కండ్లు పెద్దవి చేసి దివ్యను చూస్తూ వెంటనే ఏం జవాబు చెప్పాలో తోచలేదు సునీతకు. జవాబుకోసం దివ్య వాళ్ళ అమ్మ మొహంలోకి చూస్తూ కూర్చుంది. ” ఆత్మహత్య అంటే మనల్ని మనం చంపుకోవడం […]
మా వదిన మంచితనం- నా మెతకతనం..
రచన: జి.ఎస్.లక్ష్మి.. నవంబరు 8న మన ప్రథానమంత్రి నరేంద్రమోడీగారు రాత్రి యెనిమిదిగంటలకి మొత్తం ప్రపంచమే ఉలిక్కిపడేలా. 500, 1000 రూపాయిలనోట్లు ఆరాత్రి పన్నెండుగంటలనుంచీ చెల్లుబడి కావంటూ ఒక ప్రకటన చేసారు. అది వినగానే ప్రపంచం మాట దేవుడెరుగు.. నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. సంగతి కూడా అలాంటిదే మరి.. అసలే నాది ముక్కుసూటిగా వ్యవహరించే స్వభావం. బీరువాలో డబ్బుంటే ఖర్చుపెట్టుకోవడం, లేకపోతే మాట్లాడకుండా వూరుకోవడం తప్ప చాటూమాటూ తెలీనిదాన్ని. అలాంటిదానికి నాకు మా వదిన బ్రైన్ వాష్ […]
రక్షా బంధనం
రచన:కె.ఝాన్సీరాణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న నిత్య ఆలోచిస్తూ వుంది. ఆఫీసుకి వెళ్ళాలా, సెవు పెట్టాలా? లేక ఏకంగా ఉద్యోగమే మానేయాలా? అని. నిత్య ఒక ప్రైవేటు ఆఫీసులో కంపెనీలో 6 నెల నుంచి ఉద్యోగం చేస్తూంది. భర్త అజయ్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం. రెండు నెలలు ఇండియాలో ఉంటే ఒక నెల అమెరికాలో ఉంటాడు. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు. అందుకే నిత్య ఉద్యోగం మానేయాలంటే ఆలోచించడం. పోనీ వేరే ఉద్యోగం చూసుకోవాంటే `ఇప్పుడు […]
ఇటీవలి వ్యాఖ్యలు