March 29, 2024

21-వ శతాబ్దంలోవికటకవి – 1

రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్)

ఒకసారి రాయలవారూ, తిరుమలదేవి, రామకృష్ణకవి, హైదరాబాదు పబ్లిక్ గార్డన్స్ లో వ్యాహ్యాళి సమయంలో వాదులాటలో వున్న ఒక యువజంటను చూసి వారి ఘర్షణకు కారణమేమయ్యుంటుందన్న విషయం మీద చర్చ వచ్చి రాయలవారు పొరపాటు అమ్మాయిదయుంటుందనీ , రాణిగారు తప్పు తప్పకుండా అబ్బాయిదేనని, వాదించుకుని కాసేపు, రామకృష్ణకవిని అభిప్రాయం అడుగుతారు. అప్పుడు రామకృష్ణుడు:

కం।। మగువలు వెదకుదురెప్పుడు
తగవుపడగ కారణమ్ము తన తప్పైనా
మగడు సతికి యన్నింటను
సగభాగమునిచ్చెగాన సహియించవలెన్

అని పద్యం చెబుతుండగా రాణిగారి కొరకొర చూపులు గమనించి వెంటనే

అని అంటాననుకున్నట్లున్నారు రాణివారు. కాదు తల్లీ దేవీ ఉపాసకుడను కాబట్టి నా అభిప్రాయం:

కం।। మగువలు నిరతము యేలనొ
తగవుపడుట వలదనుకుని తప్పు తనదనున్
మగడు తనకు యన్నింటను
సగభాగమునిచ్చెననుచు సహనముచూపున్

అని మార్చేసరికి అతని సమయస్ఫూర్తికి రాజు రాణి ఫక్కున నవ్వేస్తారు

7 thoughts on “21-వ శతాబ్దంలోవికటకవి – 1

  1. Kishore superb. I am wondering why you chose to hide this talent of a poet-writer in our college days I am sure it was in you always.

  2. Hi SRINIVAS KISHORE CHALA BAGINDI.I ENJOYED IT FULLY. GOWRI DELHI NUCHI VACHINDI. VASANTHAKI AND GOWRI CHALA BAGA NACCHINDI

  3. చాలా బావుంది తమ్ముడూ
    అయితే 15 వశతాబ్దిలో రాయలవారే రాణీ గారిమీద నిద్రలో కాలు తగిలిందని , ( అదీ రాణీ గారి
    కాళ్ళ వైపు తానే పడుకొని ) అలిగి నందుకే పారిజాతాపహరణం కావ్యం తిమ్మనగారిచే రాణీవారు
    రాయించి అలకతీర్చారు .
    తప్పుతమదైన వేళన
    యొప్పరు మగవా రదేమియుచితం బనఘా
    చెప్పుము మీరా యలకని
    దెప్పెను నవ్వుచు తిరుమల దేవియు భర్తన్ !

  4. Excellent. I like the way Ramakrishna had diffused the situation fast. You must thank the Vikatakavi for saving you from the wrath of the ladies and labelling you as a MCP. Here is wishing more strength to your funny bone and conveying best wishes to your family.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *