March 28, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2017 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   పండగ రోజులు మొదలయ్యాయి కదా. వినాయకుడు నవరాత్రులు కొలువుదీరి తిరిగి వెళ్లిపోతున్నాడు. తర్వాత బతుకమ్మ పండగ, దసరా, దీపావళి వరుసగా రాబోతున్నాయి.  మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు పండగల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసపు విశేషాలను అందిస్తున్నాము. ఎప్పటిలాగే మీరు నచ్చే, మీరు మెచ్చే కవితలు, వ్యాసాలు, కథలు, సీరియళ్లు, ఉన్నాయి. ఈ నెలనుండి శ్రీమతి అంగులూరి అంజనీదేవిగారి మూడవ సీరియల్ “కొత్త జీవితం” ప్రారంభమవుతోంది. మీకు […]

ఎందరో మహానుభావులు 1. రావు బాలసరస్వతి

ముఖాముఖి చేసినవారు: విశాలి పేరి తెలుగు పాటల మణిహారములో సరస్వతీ దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గుళికగా అందించిన గాయకులు ఎందరో! పాటలో ప్రతి పలుకు మనసుపొరలలో గూడు కట్టుకొనేలా చేసే గాయకులు చాలా తక్కువమందే! . లాలిత్యం, హాయిగా రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో చెప్పుకోతగినవారు రావుబాల సరస్వతి దేవి గారు. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో […]

రెండో జీవితం

రచన : అంగులూరి అంజనీదేవి జీవితం చిన్నదే అయినా మనుషుల్లో ఆశలు, ఆకాంక్షలు వుంటాయి. తాము చేరుకోవలసిన గమ్యాలు, పెట్టుకున్న లక్ష్యాలు వుంటాయి. శాంతికి, అశాంతికి మధ్యన అవ్యక్తపు ఆలోచనలు, ఊహకందని అలజడులు వుంటాయి. వీటికోసం ఎంతో గోప్యంగా తమ హృదయాన్ని రహస్యపు మందిరంగా చేసుకొంటారు. మనసును దారంతో బిగించి కట్టిన పొట్లంలా మార్చుకుంటారు. తాము గీసుకున్న బొమ్మలో తామే తిరుగుతున్నట్లు తమలోకి తాము చూసుకుంటారు. ఎక్కడ ఆగుతామో అక్కడ మన ఆనందం ఆగుతుందని గ్రహిస్తారు. తిరిగి […]

మాయానగరం – 39

రచన: భునవచంద్ర “మాధవిగారూ… నేను మీకు తెలుసు. నా అనే వాళ్ళు నన్నొదిలేశారు. ఎలా పైకొచ్చానని అడక్కండి. ఏ జీవితాన్ని చూసినా పైకి రావాలంటే రెండే పద్ధతులు. ఒకటి కష్టపడి ఎదగటం… రెండోది ఇతరుల్ని కష్టపెట్టి ఎదగటం. ఇతరుల్ని కష్టపెట్టే ఎదిగేది రౌడీలూ, గూండాలూ మాత్రమే కాదు. ఎదుటివారి వీక్ నెస్ ని సొమ్ము చేసుకునేవారు కూడా! ” ఓ క్షణం ఆగాడు బోసు. “అదంతా నాకెందుకు చెబుతున్నారూ? ” ఏ మాత్రం కుతూహలం ధ్వనించని స్వరంతో […]

బ్రహ్మలిఖితం .. 11

రచన: మన్నెం శారద అతను తలదించుకుని టాయిలెట్స్ దగ్గర నిలబడ్డాడు. కోయదొర లిఖిత వైపు చూసి చిరునవ్వుతో “మేం కూడా కూటి కోసం అబద్ధాలడతాం. కాని మా సమ్మక్క జాతరలు నిష్టగా చేస్తం. పూజలో వుంటే పెళ్ళాన్ని కూడా తల్లిలానే చూస్తం. ఇపుడు చెప్పు. పుస్తకల్లో చ్ అదివి నాగరికత తెలుసుకునే మీ బస్తీ జనాలు పరగడుపునే పాపాలు చేస్తారా లెదా? ఇంతోటీ గోరాలు మా అదవిలో చిత్తకార్తి ఊరకుక్కలు కూదా సెయ్యవు!” అన్నాడూ. లిఖిత అతనికి […]

Gausips – ఎగిసే కెరటాలు-14

రచన: -శ్రీసత్య గౌతమి కానీ పాపం సింథియాకు తెలియలేదు, ఆమె మాట్లాడే ప్రతి మాట సోఫియా, శామ్యూల్ లు రికార్డ్ చేస్తున్నారని. సోఫియా అడిగింది “మరి అంతా అఫీషియల్ గానే జరుగుతున్నది కదా. లహరి ని ఆ డిఫెన్స్ ప్రోజెక్ట్స్ నుండి తొలగించవచ్చుగా? అనధికారికంగా నిన్ను అప్పాయింట్ చేసి ఆమె మీద, ఆమె వర్క్ మీద నీ నిఘా ఎందుకు?” దానికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు సింథియా కు. వెంటనే … “ఏమో … నా […]

మనుగడ కోసం.

రచన: ఓలేటి శశికళ శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం రోజు. సాయంత్రం పేరంటంపెట్టుకుని, అరవైమందిని పిలుచుకున్నాను. చాలా సందడిగా జరిగింది పేరంటం. పిలిచినవారంతా చక్కటి ముస్తాబుతో, అందమయిన పట్టుచీరలు కట్టుకుని, కొత్త, పాత నగలు అలంకరించుకుని, అపర లక్ష్మీదేవుల్లా ఒచ్చి పసుపు, కుంకుమ, తాంబూలాదులు తీసుకుని వెళ్ళి పోయారు. ”అమ్మయ్యా! ఒకరిద్దరు తప్ప అందరూ ఒచ్చేసినట్టే”. ఇంక వీధి తలుపు వేద్దామని వెళ్తూ, నా అమ్మవారిని ఒకసారి తేరిపార చూసుకున్నా. పాలరాతి మందిరంలో, స్థాపించిన అష్టలక్ష్మీ కలశంలో, […]

కథ చెప్పిన కథ

రచన: విజయలక్ష్మీ పండిట్. ఆ రోజు రాత్రి భోజనాలయినాక భారతి వాళ్ళ అమ్మతో అంది, ” అమ్మా రేపు మా టీచర్‌ పెద్ద కథ చెపుతానన్నది. . ., కథ అంటే ఏమిటమ్మా. . ! “అని అడిగింది. “కథ అంటే. . . మన, జంతువుల జీవితాలలో రోజు జరిగే సన్నివేశాలే కథలు నాన్నా “అని అన్నది భారతి వాళ్ళ అమ్మ. కాని ఆ సమాధానంతో సంతృప్తి కలుగలేదు భారతికి. కథను గురించి మరలా మరలా […]

కృషితో నాస్తి దుర్భిక్షం’’

రచన: కె.ఇ.ఝాన్సీరాణి 36వ ఇంటర్వ్యూ పూర్తి చేసిన మురారి బయటకు వచ్చాడు. ఈ ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అక్కడ వారి మాట వల్ల తెలిసింది. ఏమితోచని పరిస్థితి. డిగ్రీ చేసి, కంప్యూటర్‌ కోర్సు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోచింగ్‌ అలా ఎన్నో అర్హతలు, సర్టిఫికెట్లు ఉన్నా ఉద్యోగం మాత్రం సున్నా. ఈ మధ్యనే ఒక అయిదుగురు ఎనిమిది ఇంటర్వ్యూ నుంచి ప్రతి ఇంటర్వ్యూలో కలుస్తున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగం రాలేదన్నమాట. కాని వాళ్ళు నిరుద్యోగంలో తనకు జూనియర్లు […]

ఫ్యామిలీ ఫోటో

రచన – డా. లక్ష్మి రాఘవ “వాసూ” రామచంద్ర గొంతు విని రూం నుండి బయటకు వచ్చాడు వాసుదేవరావు. హాల్లోకి వచ్చిన రామచంద్రను చూస్తూ” రా …రా… రామూ” అని ఆహ్వానిస్తూ ముందుకు వచ్చి సోఫాలో కూర్చోమంటూ సైగ చేసి తానూ రామచంద్ర పక్కనే కూర్చున్నాడు. “ఏమైంది నీకు? ఫోను స్విచ్చ్ ఆఫ్ చేస్తే అందరికీ కంగారు కాదా అదీ రెండు రోజులు?” “నీవు ఫోను చేసావా?” “నేను చేస్తే రెండుసార్లు చూసి ఏకంగా ఇంటికే వచ్చి […]