March 29, 2024

చిరు చిరు మొగ్గల

రచన: రావూరు సత్యనారాయణ

రాధ:
చిరుచిరు మొగ్గల చిలిపి తెరలలో
చిటికెలు వేయుచు, చిలిపిగ నవ్వుచు
వడివడిగ వచ్చెను వసంతరాగం
ఎవరికోసమో సుమభోగం!

కృష్ణ:
పిలపిలగాలులు పుప్పొడి దూగ
ఈలలు వేయుచు ఎదలను దూయుచు
ఆమని రాత్రుల యామిని రాగా
ఎవరికోసమీ అనురాగం!

రాధ:
ఎవరికోసమీ సుమభోగం!

కృష్ణ:
ఈ అనురాగం – ఈ సుమభోగం!

రాధ:
పూలతోటలో – కాలిబాటలో
మురిపించెడి నీ మురళి పాటలో
తూగిన నా యెద – ఊయలలూగగ
ఎన్నినాళ్లనీ సహయోగం

కృష్ణ:
ఎవరికోసమీ సుమభోగం
యమునా తీరమున మురళీగానమున
కనులార మూయుచు, కలువలు దూయుచు
మయూరివలె నీ వయారి నాట్యం
ఎవరికోసమాహ్వానం.

రాధ:
ఎన్నినాళ్ళదీ సహయోగం!
మరచిన తలపులు పరుగిడి రాగా
విరిసిన వలపులు పరువము దోగ
మధురభావనలు మనసున మూగ
ఎవరికోసమీ మధుమాసం

కృష్ణ;
అంతులేని సహవాసం
రాధ:
ఆరిపోని చిరుహాసం

1 thought on “చిరు చిరు మొగ్గల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *